హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Vivo Y02: కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన వివో.. ధర రూ.10,000 కన్నా తక్కువే.. ఫీచర్లు ఇవే..

Vivo Y02: కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన వివో.. ధర రూ.10,000 కన్నా తక్కువే.. ఫీచర్లు ఇవే..

Vivo Y02 (PC : Vivo)

Vivo Y02 (PC : Vivo)

Vivo Y02: ఎంట్రీ-లెవల్‌లో తీసుకొచ్చిన వివో Y02(Vivo Y02) ఫోన్‌లో ఆకట్టుకునే ఫీచర్స్‌ ఉన్నాయి. Y01కు సక్సెసర్‍గా వివో Y02‌ను కంపెనీ తీసుకొచ్చింది. లార్జ్ బ్యాటరీ, అక్టా-కోర్ ప్రాసెసర్ వంటి ఫీచర్స్‌తో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర, స్పెసిఫికేషన్ వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం..

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

వినియోగదారులను ఆకట్టుకునేందుకు, సేల్స్‌ (Sales) పెంచుకునేందుకు మొబైల్‌ కంపెనీ (Mobile Companies)లు మిడ్‌ రేంజ్‌ సెగ్మెంట్‌పై దృష్టి సారిస్తున్నాయి. ఈ రేంజ్‌లోనే ఎక్కువగా ఫోన్స్‌ను లాంచ్‌ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వివో (Vivo) బడ్జెట్ రేంజ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండోనేషియాలో లాంచ్ చేసింది. ఎంట్రీ-లెవల్‌లో తీసుకొచ్చిన వివో Y02(Vivo Y02) ఫోన్‌లో ఆకట్టుకునే ఫీచర్స్‌ ఉన్నాయి. Y01కు సక్సెసర్‍గా వివో Y02‌ను కంపెనీ తీసుకొచ్చింది. లార్జ్ బ్యాటరీ, అక్టా-కోర్ ప్రాసెసర్ వంటి ఫీచర్స్‌తో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర, స్పెసిఫికేషన్ వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం..

* Vivo Y02 స్పెసిఫికేషన్స్

ఈ హ్యాండ్‌సెట్ వాటర్‌డ్రాప్ నాచ్‌తో 6.51-అంగుళాల HD+ IPS LCD ప్యానెల్‌తో లాంచ్ అయింది. ఐ ప్రొటెక్షన్ ఫీచర్‌ను స్క్రీన్‍కు ఇచ్చినట్టు వివో పేర్కొంది. f/2.0 ఎపర్చర్‌తో 8 MP రియర్ కెమెరా ఉంటుంది. అలాగే f/2.2 ఎపర్చర్‌తో 5 MP ఫ్రంట్ కెమెరాను అమర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ 10W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 mAh బ్యాటరీతో లభిస్తుంది.

* ఆక్టా-కోర్ ప్రాసెసర్

వివో Y02 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ద్వారా రన్‌ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉండే 32GB స్టోరేజ్‌ కెపాసిటీని మైక్రో‌ SD కార్డ్ ద్వారా 1టీబీ వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్, ఫన్‌టచ్‌ OS 12పై ఈ స్మార్ట్‌ఫోన్ పని చేస్తుంది.

* అందుబాటులో రెండు కలర్ ఆప్షన్స్‌

కనెక్టివిటీ ఆప్షన్స్‌లో బ్లూటూత్, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, GPS, హెడ్‌ఫోన్ జాక్ వంటి వాటికి ఇది సపోర్ట్ చేస్తుంది. Vivo Y02 స్మార్ట్‌ఫోన్ 186 గ్రాముల బరువు, 8.49 mm మందంతో ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆర్కిడ్ బ్లూ, కాస్మిక్ గ్రే వంటి రెండు కలర్ ఆప్షన్‌ల్లో లభిస్తుంది. ఇండోనేషియాలో లాంచ్ అయిన వివో Y02 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. ఇండియన్‌ మార్కెట్‌లోకి ఎప్పుడు వస్తుందో కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే త్వరలోనే భారత్‌తో పాటు వరల్డ్ వైడ్‌గా అందుబాటులోకి వచ్చే అవకావం ఉందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.

* లేటెస్ట్‌ ఫోన్‌ ధర

వివో Y02 సింగిల్ వేరియంట్‌‌తో లాంచ్ అయింది. 3GB+32GB వేరియంట్ ధర ఇండోనేషియా కరెన్సీలో IDR 1,499,000 (రూ.7,800)గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ ఇండోనేషియాలోని ప్రముఖ రిటైలర్ల ద్వారా అమ్మకానికి సిద్ధంగా ఉంది.

ఇది కూడా చదవండి : ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్‌.. ఈ స్మార్ట్‌టీవీలపై ఊరించే ఆఫర్లు.. త్వరపడాల్సిందే!

* తైవాన్‌లో Vivo V21s 5G రిలీజ్‌

వివో కంపెనీ తైవాన్‌లోనూ ఇటీవల మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. Vivo V21s 5G పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ 1080 x 2404 పిక్సెల్ FHD+ రిజల్యూషన్‌తో 6.44-అంగుళాల AMOLED ప్యానెల్‌‌తో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ డైమెన్సిటీ 800U చిప్‌సెట్ ద్వారా రన్‌ అవుతుంది. Vivo V21s 5G ప్రస్తుతం తైవాన్‌లో NT$ 11,490 (సుమారు రూ.30,000)గా ఉంది. కలర్‌ఫుల్, డార్క్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో ఇది అందుబాటులో ఉంది.

First published:

Tags: Smart mobile, Smart phones, Tech news, Vivo

ఉత్తమ కథలు