హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Vivo Y01: కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన వివో.. Vivo Y01 ధర, స్పెసిఫికేషన్ల వివరాలు..

Vivo Y01: కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన వివో.. Vivo Y01 ధర, స్పెసిఫికేషన్ల వివరాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్మార్ట్‌ బ్రాండ్ వివో (Vivo) ఇండియాతో పాటు గ్లోబల్ మార్కెట్లో కూడా వరుసగా కొత్త ఫోన్లను విడుదల చేస్తోంది. ఈ కంపెనీ తాజాగా ఇండియాలో మరో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. వివో వై01 (Vivo Y01) పేరుతో సరికొత్త డివైజ్‌ను లాంచ్ చేసింది.

ఇంకా చదవండి ...

స్మార్ట్‌ బ్రాండ్ వివో (Vivo) ఇండియాతో పాటు గ్లోబల్ మార్కెట్లో కూడా వరుసగా కొత్త ఫోన్లను విడుదల చేస్తోంది. ఈ కంపెనీ తాజాగా ఇండియాలో మరో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. వివో వై01 (Vivo Y01) పేరుతో సరికొత్త డివైజ్‌ను లాంచ్ చేసింది. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లో తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్లను అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. వివో Y01 ఫోన్ మీడియాటెక్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ డెవలప్ చేసిన FunTouch OS 11.1తో లాంచ్ అయింది. వివో Y01 ధర, ఫీచర్ల వివరాలు తెలుసుకుందాం.

* వివో Y01 ధరలు

ఇండియాలో వివో Y01 ఫోన్ 2GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌తోనే అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ. 8,999. ఈ స్మార్ట్‌ఫోన్ మన దేశంలోని వివో ఇ-స్టోర్, పార్ట్నర్ రిటైల్ స్టోర్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇది రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కస్టమర్లు ఎలిగెంట్ బ్లాక్, సఫైర్ బ్లూ కలర్స్‌లో ఫోన్లను సెలక్ట్ చేసుకోవచ్చు.

iPhone Offer: మీ పాత ఫోన్ ఇచ్చేస్తే రూ.30,000 లోపేఐఫోన్ కొనొచ్చు

* స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు

వివో Y01 ఫోన్ 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తుంది. దీని స్క్రీన్‌కు ఐ-ప్రొటెక్షన్ మోడ్ సపోర్ట్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 2GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజ్‌ ఆప్షన్‌లో లభిస్తుంది. ఇది మీడియాటెక్ హీలియో P35 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. వివో Y01 స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ కార్డ్ స్లాట్‌తో వస్తుంది. దీంట్లో మైక్రో ఎస్‌డీ కార్డును వినియోగించవచ్చు. దీని సాయంతో మెమరీని 1TB వరకు పొడిగించుకోవచ్చు.

CUET 2022: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్‌కు ప్రిపేర్ అవుతున్నారా.. ఈ టిప్స్ పాటించి బెస్ట్ స్కోర్ తెచ్చుకోండి..


ఆప్టిక్స్ పరంగా చూస్తే.. కొత్త వివో Y01 ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ షూటర్‌ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 5,000mAh సామర్థ్యం ఉన్న బ్యాటరీతో వస్తుంది. ఇది రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌ను కూడా అందిస్తుంది. ‘మేక్ ఇన్ ఇండియా’ స్కీమ్‌లో భాగంగా తాజా ఫోన్‌ను ఇండియాలోనే తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా ప్లాంట్‌లో దీన్ని తయారు చేశారు.

ఈ స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌ సందర్భంగా వివో బ్రాండ్ స్ట్రాటజీ డైరెక్టర్ యోగేంద్ర శ్రీరాముల మాట్లాడారు. ‘ఎప్పటికప్పుడు మారుతున్న వినియోగదారుల డిమాండ్‌ను తీర్చడానికి బడ్జెట్ ధరలో బెస్ట్ టెక్నాలజీని అందించే దిశగా వివో పని చేస్తోంది. ఎడ్యుకేషన్, గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, వర్చువల్ కనెక్టివిటీ అవసరాలను తీర్చేలా Y01 బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది’ అని యోగేంద్ర తెలిపారు.

First published:

Tags: 5g smart phone, 5G Smartphone, Mobile phones, Smartphones, Technology

ఉత్తమ కథలు