Vivo X90 Pro Plus Price | వివో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. వివో (Vivo) ఎక్స్90 ప్రో ప్లస్ మోడల్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. చైనాలో డిసెంబర్ నెలలో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వెలువడుతున్న నివేదికల ప్రకారం చూస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌లో (Smartphone) అదిరిపోయే ఫీచర్లు ఉండొచ్చని తెలుస్తోంది. మరీముఖ్యంగా సూపర్ కెమెరా సెటప్ ఉండచ్చని చాలా మంది భావిస్తున్నారు.
1 ఇంచ్ కెమెరా సెన్సార్, వివో కొత్త వీ2 ఐఎస్‌పీ చిప్ వంటి ఫీచర్లు ఉండొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ఇప్పుడు ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. తెగ చక్కర్లు కొడుతున్నాయి. వీటి ద్వారా ఫోన్ ఎలా ఉండబోతోందో తెలుస్తోంది.
ఫ్లిప్‌కార్ట్‌లో రూ.599 ఆఫర్.. పాత ఫోన్ ఇచ్చి కొత్త ఫోన్ పొందండిలా!
లీక్ అయిన ఇమేజ్‌లను గమనిస్తే.. వీటిల్లో లెదర్ రెడ్ మోడల్ ఫోన్ కనిపిస్తోంది. జీస్ బ్రాండింగ్ పేరు ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సోనీ ఐఎంఎక్స్989వీ ఇమేజ్ సెన్సార్ ఉండే అవకాశం ఉంది. అలాగే కెమెరాలో 100 ఎక్స్ జూమ్ వరకు కెపాసిటీ ఉండొచ్చు. క్వాడ్ రియర్ కెమెరా వ్యవస్థను గమనించొచ్చు. అలాగే ఫ్యాన్సీ టెక్చర్డ్ రియర్ ప్యానెల్ ఉంది. టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ ఈ ఫోటోలను షేర్ చేశారు.
సర్‌ప్రైజ్ ఆఫర్.. 200MP కెమెరా ఫోన్‌పై ఏకంగా రూ.35 వేల డిస్కౌంట్!
vivo X90 Pro+ Snapdragon 8Gen2 + IMX989 + Max 100x zoom pic.twitter.com/MBl0BsrWYh
— Ice universe (@UniverseIce) November 8, 2022
అంతేకాకుండా గత నెలలో కూడా వివో ఎక్స్ 90 ప్రో ప్లస్ ఫోటోలు కొన్ని ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టాయి. మెరుగైన కెమెరా వ్యవస్థ ఈ ఫోన్ ప్రత్యేకతగా ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. డ్యూయెల్ టోన్ రియర్ ప్యానెల్ ఉండొచ్చు. వివో ఎక్స్80 లైనప్‌లో కూడా ఇదే ఫీచర్ ఉంది. పవర్ బటన్స్, వాల్యూమ్ బటన్స్ ఫోన్ కుడి వైపున ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ఉండొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి.
కాగా వచ్చే నెలలో ఫోన్ మార్కెట్‌లోకి వస్తే.. ఏ ఏ ఫీచర్లు ఉన్నాయో పూర్తిగా తెలుస్తుంది. తొలిగా చైనా మార్కెట్‌లో లాంచ్ అయిన తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్ మన మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సంక్రాంతి పండుగ సమయంలో ఈ ఫోన్ మన మార్కెట్‌లోకి రావొచ్చు. మరోవైపు షావోమి కూడా తన తదుపరి ప్రీమియం స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు రెడీ అవుతోంది. ఆ షావోమి 13 సిరీస్ ఫోన్ ఫోటోలు కూడా ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Smartphones, Vivo