స్మార్ట్‌ఫోన్(Smartphone) తయారీ కంపెనీ వివో కొత్తగా ఎక్స్ 80 (Vivo X80) సిరీస్‌ను ఈ వారం లాంచ్ చేసింది. ఈ సిరీస్ ఫోన్లు త్వరలో ఇండియన్ మార్కెట్లో(Market) రిలీజ్ కానున్నాయి. వీటిలో వివో ఫ్లాగ్షిప్(Vivo Flagship) లాంటి ఫీచర్లను(Features) అందిస్తుంది. హై-ఎండ్ ఫోటోగ్రఫీతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను(Charging Support) అందిస్తుంది. Vivo X80 సిరీస్ ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయింది. వివో X80 (Vivo X80), వివో X80 ప్రో (Vivo X80 Pro) డివైజ్‌లు(Devise) గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీడియా టెక్, క్వాల్కమ్ చిప్సెట్ ద్వారా పనిచేసే ఈ ఫోన్ల స్పెసిఫికేషన్లు తెలుసుకుందాం.
* వివో X80 స్మార్ట్‌ఫోన్ ధరలు
వివో X80 స్మార్ట్‌ఫోన్ కేవలం 12GB + 256GB స్టోరేజ్ మోడల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని ధర RM 3,499 (సుమారు రూ. 61,700). వివో X80 ప్రో ఫోన్.. 12GB RAM, 512GB స్టోరేజ్ వేరియంట్‌గా అందుబాటులో ఉంది. దీని ధర RM 4,999 (సుమారు రూ. 88,100).
* స్పెసిఫికేషన్లు
వివో X80 ఫోన్ 6.78 అంగుళాల 120Hz AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. అయితే X80 ప్రో ఇదే స్క్రీన్ సైజుతో క్వాడ్ HD+ రిజల్యూషన్‌ను అందిస్తుంది. ఫ్రంట్ కెమెరా ఫోన్ పైభాగంలో పంచ్ హోల్ కటౌట్ కింద ఉంది. వివో X80 ఫోన్ కొత్త మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్తో పనిచేస్తుంది. అయితే వివో X80 ప్రో ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్సెట్తో పనిచేస్తుంది. ఈ రెండు ఫోన్లు 12GB RAMతోనే అందుబాటులో ఉన్నాయి.
వివో X80 ఫోన్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్, 12 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ సెన్సార్ ఉన్న ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. వివో X80 ప్రో మోడల్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 48 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్, 12 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్‌తో కూడిన క్వాడ్ రియర్ కెమెరా మాడ్యూల్తో వస్తుంది. ఈ రెండు ఫోన్లు 32-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌తో వస్తాయి. ఈ సిరీస్‌తో వివో కొత్త ఆండ్రాయిడ్ 12-బేస్డ్ Funtouch OS వెర్షన్‌ను ఆఫర్ చేస్తోంది. Vivo X80 డివైజ్ 4500mAh బ్యాటరీతో వస్తుంది. X80 ప్రో మాత్రం 4700mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. ఈ రెండు మోడల్స్ 80W స్పీడ్ ఛార్జ్‌కు సపోర్ట్ చేస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g mobile, New smartphone, Technology, Vivo