Vivo X70 series: వివో ఎక్స్70 సిరీస్​లో మూడు స్మార్ట్​ఫోన్లు... ధర, అదిరిపోయే ఫీచర్ల వివరాలివే

Vivo X70 series: వివో ఎక్స్70 సిరీస్​లో మూడు స్మార్ట్​ఫోన్లు... ధర, అదిరిపోయే ఫీచర్ల వివరాలివే

Vivo X70 series | వివో ఎక్స్70 సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి. Vivo X70, Vivo X70 Pro, Vivo X70 Pro Plus ధర, ప్రత్యేకతలు, ఫీచర్స్ తెలుసుకోండి.

  • Share this:
ప్రముఖ స్మార్ట్​ఫోన్​ బ్రాండ్​ వివో (Vivo) వరుసగా స్మార్ట్​ఫోన్లను విడుదల చేస్తూ దూకుడుమీదుంది. తాజాగా చైనాలో నిర్వహించిన ప్రెజెంటేషన్ ఈవెంట్‌లో న్యూ జనరేషన్​ హైఎండ్​ ఫోన్లను లాంచ్​ చేసింది. ఈ ఈవెంట్​లో ఎక్స్​ 70 సిరీస్‌ను ఆవిష్కరించింది. ఈ సిరీస్​లో వివో ఎక్స్ 70, ఎక్స్ 70 ప్రో, ఎక్స్​ ప్రో ప్లస్​ వంటి మూడు స్మార్ట్​ఫోన్లు రిలీజ్​ అయ్యాయి. ప్రస్తుతానికి మూడు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు చైనా మార్కెట్​లో మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. భారత్​లోకి ఎప్పుడు వస్తాయనే అంశంపై ఎటువంటి స్పష్టత లేదు.

వివో ఎక్స్​70 స్పెసిఫికేషన్లు


వివో X70 ప్రో చైనీస్ ఎడిషన్ ఎక్సినోస్ 1080 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఇది 6.56 -అంగుళాల ఫుల్-హెచ్‌డి+ AMOLED డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్​తో వస్తుంది. ఎక్స్​ 70లో 12 జీబీ ర్యామ్​, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్​ను అందించింది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆదారిత ఫన్‌టచ్ ఓఎస్‌పై రన్​ అవుతుంది. ఇక, కెమెరా విషయానికి వస్తే,, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించింది. ఇందులో 40 మెగాపిక్సెల్ సోనీ IMX766V సెన్సార్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 12 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ సెన్సార్‌ కెమెరాలని చేర్చింది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం దీని ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించింది. ఇది 4400mAh బ్యాటరీతో వస్తుంది.

Realme 8s 5G: కాసేపట్లో రియల్‌మీ 8ఎస్ సేల్... రూ.1,500 డిస్కౌంట్

వివో ఎక్స్​70 ప్రో స్పెసిఫికేషన్లు


వివో X70, X70 ప్రో ఫీచర్లు రెండూ దాదాపు ఒకే విధంగా ఉంటాయి. X70 ప్రో 6.56 -అంగుళాల AMOLED డిస్​ప్లేతో వస్తుంది. ఇది ఎక్సినోస్​ 1080 ఎస్​ఓసీ ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ప్రో మోడల్​ 8జీబీ ర్యామ్​, 128జీబీ స్టోరేజ్, 12GB ర్యామ్, 256 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్​ గల రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

వీటికి అదనంగా, ప్రో మోడల్‌లో 512GB స్టోరేజ్ వేరియంట్ కూడా లభిస్తుంది. వివో X70 ప్రో 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది 4450mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఎక్స్​ 70 ప్రోలో 50 మెగాపిక్సెల్స్ సోనీ IMX766V ప్రైమరీ సెన్సార్, అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్స్, పోర్ట్రెయిట్‌ల కోసం రెండు 12 మెగాపిక్సెల్ సెన్సార్లు, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్లను అందించింది.

WhatsApp Tricks: వాట్సప్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేశారా? ఇలా తెలుసుకోండి

వివో ఎక్స్​70 ప్రో+ స్పెసిఫికేషన్లు


వివో ఎక్స్ 70 ప్రో ప్లస్ 6.78 -అంగుళాల క్యూహెచ్‌డీ AMOLED డిస్‌ప్లే వస్తుంది. ఇది క్వాల్‌కామ్ ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 888 ప్లస్ ద్వారా పనిచేస్తుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌, 12 జీబీ ర్యామ్​, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ గల రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. X70 ప్రో+ 4,500mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 55W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్​, 50W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్​కు మద్దతు ఇస్తుంది. ఇది క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ శామ్‌సంగ్ జిఎన్ 1 ప్రైమరీ కెమెరాతో పాటు 48 మెగాపిక్సెల్ సోనీ ఐఎమ్ఎక్స్ 598 సెకండరీ సెన్సార్లను అందించింది. వీటికి అదనంగా 8 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్, 12 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ లెన్స్​ను కూడా చేర్చింది.

చైనాలో వివో X70, X70 ప్రో, X70 ప్రో+ వివిధ కలర్​, కాన్ఫిగరేషన్లలో లభిస్తాయి. ఎక్స్​ 70 తెలుపు, నలుపు, నేబ్యులా గ్రేడియంట్​లో అందుబాటులో ఉంటుంది. దీని ధర 3,699 యువాన్ (సుమారు రూ. 42,000) నుంచి ప్రారంభమవుతుంది. ప్రో వేరియంట్ 4,299 యువాన్ (సుమారు రూ. 49,000) వద్ద అందుబాటులో ఉంటుంది. వివో X70 ప్రో+ బేస్ మోడల్ 5,500 యువాన్ (సుమారు రూ. 63,000) నుంచి ప్రారంభమవుతుంది.
Published by:Santhosh Kumar S
First published: