• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • VIVO X60T SMARTPHONE LAUNCH PRICE SPECIFICATIONS DETAILS MK GH

Vivo X60t: వివో ఎక్స్ 60​ సిరీస్​లో మరో స్మార్ట్​ఫోన్​ లాంఛ్.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే..

Vivo X60t: వివో ఎక్స్ 60​ సిరీస్​లో మరో స్మార్ట్​ఫోన్​ లాంఛ్.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే..

Vivo X60 సీరీస్ ఫోన్లు

వివో ఎక్స్ 60 కొనసాగింపు మోడల్​గా వస్తోంది. అయితే, దీనిలో భిన్నమైన ప్రాసెసర్​ను అందించింది. వివో ఎక్స్ 60 టిలో మీడియాటెక్ డైమెన్సిటీ 1100 SoC ప్రాసెసర్​ను అందించగా.. వివో ఎక్స్ 60 స్నాప్​డ్రాగన్ 870 SoC ప్రాసెసర్​ను చేర్చింది.

  • Share this:
ప్రముఖ మొబైల్​ తయారీ సంస్థ వివో వరుస స్మార్ట్​ఫోన్లను విడుదల చేస్తూ భారత మార్కెట్​లో తన స్థానాన్ని పదిలం చేసుకుంటోంది. గత నెలలో తన ఫ్లాగ్​షిప్​ X 60 సిరీస్​లో X ​60, X 60 ప్రో, X60 ప్రో ప్లస్​ వంటి ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటి ప్రీ బుకింగ్స్​కు కూడా అద్భుతమైన రెస్పాన్స్​ వచ్చింది. దీంతో, ఇప్పుడు ఇదే సిరీస్​లో X 60 టీ అనే స్మార్ట్​ఫోన్​ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే చైనాలో లాంఛ్​ అయిన ఈ ఫోన్​లో అట్రాక్టివ్​ ఫీచర్లను అందించింది. ఇది వివో ఎక్స్ 60 కొనసాగింపు మోడల్​గా వస్తోంది. అయితే, దీనిలో భిన్నమైన ప్రాసెసర్​ను అందించింది. వివో ఎక్స్ 60 టిలో మీడియాటెక్ డైమెన్సిటీ 1100 SoC ప్రాసెసర్​ను అందించగా.. వివో ఎక్స్ 60 స్నాప్​డ్రాగన్ 870 SoC ప్రాసెసర్​ను చేర్చింది.

వివో ఎక్స్ 60 టి ధర
వీవో ఎక్స్​60టీలో ఒకే ఒక్క వేరియంట్​ 8జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజ్​ను తీసుకురాగా, దీని ధర చైనాలో 2,489 యెన్​లు (భారత కరెన్సీలో దాదాపు రూ.39 వేలు)గా నిర్ణయించింది. ఈ ఫోన్ షిమ్మర్ బ్లూ, మిడ్​నైట్ బ్లాక్ అనే రెండు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. ఇది చైనీస్ మార్కెట్​లో ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ అమ్మకానికి సిద్ధంగా ఉంది.

వివో ఎక్స్ 60 టి స్పెసిఫికేషన్లు
వివో ఎక్స్ 60 టి ఆండ్రాయిడ్ 11 సాఫ్ట్‌వేర్ ఆధారంగా ఆరిజినోస్ 1.0పై పనిచేస్తుంది. ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్‌ను కలిగి ఉంటుంది. ఇది 6.56-అంగుళాల ఫుల్​ -హెచ్‌డి ప్లస్​ (1,080x2,376 పిక్సెల్‌లు) అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్​ప్లే 19.8: 9 కారక నిష్పత్తి, హెచ్‌డిఆర్ 10 + సపోర్ట్​ను కలిగి ఉంటుంది. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 1100 ఆక్టా-కోర్ SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. దీనిలో 8GB RAM, 128GB ఇంటర్నల్​ స్టోరేజ్​ను అందించింది. ఇక, కెమెరా విషయానికి వస్తే.. వివో ఎక్స్ 60 టిలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్​ని చేర్చింది. దీనిలో f/ 1.79 లెన్స్‌తో కూడిన 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరాను అందించారు. ఇది 120 డిగ్రీల ఫీల్డ్ వ్యూ కలిగి ఉంటుంది. f / 2.2 ఎపర్చరుతో కూడిన 13 మెగాపిక్సెల్ తృతీయ పోర్ట్రెయిట్ సెన్సార్ కెమెరా, ఎఫ్ / 2.46 ఎపర్చరుతో కూడిన 50 ఎంఎం ఫోకల్ లెంగ్త్ కెమెరా, సెల్ఫీల కోసం ముందువైపు f / 2.45 ఎపర్చరుతో కూడిన 32 ఎంపి ప్రైమరీ సెన్సార్​ కెమెరాలను దీనిలో అందించారు.

ఇక బ్యాటరీ, విషయానికి వస్తే.. దీనిలో 4,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీని చేర్చింది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​తో వస్తుంది. కనెక్టివిటీ పరంగా చూస్తే.. దీనిలో యుఎస్‌బీ టైప్-సి, వై-ఫై 6, బ్లూటూత్ వి 5.2, యుఎస్‌బీ ఓటీజీ వంటి ఫీచర్లను చేర్చింది. ఈ ఫోన్‌లో ఇన్​డిస్​ప్లే ఫింగర్​ ప్రింట్​ సెన్సార్​ను కూడా అందించడం విశేషం. అయితే, ఈ స్మార్ట్​ఫోన్​ భారత మార్కెట్​లోకి ఎప్పుడు విడుదలవుతుందన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
First published: