హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Vivo V25: కలర్ మారే ప్యానెల్‌తో వివో వీ25 రిలీజ్... ఫీచర్స్ ఇవే

Vivo V25: కలర్ మారే ప్యానెల్‌తో వివో వీ25 రిలీజ్... ఫీచర్స్ ఇవే

Vivo V25: కలర్ మారే ప్యానెల్‌తో వివో వీ25 రిలీజ్... ఫీచర్స్ ఇవే
(image: Vivo India)

Vivo V25: కలర్ మారే ప్యానెల్‌తో వివో వీ25 రిలీజ్... ఫీచర్స్ ఇవే (image: Vivo India)

Vivo V25 5G | వివో వీ25 సిరీస్‌లో వివో వీ25 5జీ (Vivo V25 5G) స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసింది వివో ఇండియా. ఇందులో కలర్ మారే బ్యాక్ ప్యానెల్ ఉండటం విశేషం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

దసరా, దీపావళి సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని స్మార్ట్‌ఫోన్ కంపెనీలు భారతదేశంలో పోటాపోటీగా మొబైల్స్‌ని లాంఛ్ చేస్తున్నాయి. వివో ఇండియా నుంచి భారతదేశంలో మరో స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. వివో వీ25 సిరీస్‌లో వివో వీ25 5జీ (Vivo V25 5G) మొబైల్ లాంఛైంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో వివో వీ25 ప్రో (Vivo V25 Pro) ఉంది. ఇప్పుడు వివో వీ25 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ఇందులో కలర్ ఛేంజింగ్ బ్యాక్ ప్యానెల్ ఉండటం విశేషం. దీంతో పాటు 50MP ఐ ఏఎఫ్ సెల్ఫీ కెమెరా, 64MP ఓఐఎస్ నైట్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్, అమొలెడ్ డిస్‌ప్లే లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

వివో వీ25 ధర, ఆఫర్స్

వివో వీ25 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లాంఛ్ అయింది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999. సెప్టెంబర్ 20న సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ , వివో ఇండియా ఇ-స్టోర్, ఇతర రీటైల్ స్టోర్లలో కొనొచ్చు. ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్‌లో ఎస్‌బీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ , డెబిట్ కార్డులతో ప్రీ-బుక్ చేస్తే రూ.2,500 ఇన్‌స్టాంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అడిషనల్ ఎక్స్‌ఛేంజ్ బోనస్ రూ.2,000 లభిస్తుంది.

Nothing Phone 1: రూ.12,000 లోపే నథింగ్ ఫోన్ 1... బిగ్ బిలియన్ సేల్‌లో ఇలా కొనండి

వివో వీ25 5జీ స్పెసిఫికేషన్స్

వివో వీ25 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.44 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. బ్యాక్ ప్యానెల్‌కు కలర్ ఛేంజింగ్ ఫ్లోరైట్ ఏజీ గ్లాస్ టెక్నాలజీ ఉంది. సూర్యకాంతి లేదా యూవీ కిరణాలు పడ్డప్పుడు బ్యాక్ ప్యానెల్ కలర్ మారుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ, సాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ మొబైల్స్‌లో కూడా ఉంది.

Xiaomi 11i HyperCharge: ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయిన డిస్కౌంట్... బిగ్ బిలియన్ ఆఫర్ వివరాలివే

వివో వీ25 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 50మెగాపిక్సెల్ ఐ ఆటోఫోకస్ సెల్ఫీ కెమెరా ఉండటం విశేషం. వెనుకవైపు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో 64మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ యాంగిల్ కెమెరా + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. లిక్విడ్ కూల్ సిస్టమ్, గేమ్ బూస్ట్ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్‌తో అదనంగా 8జీబీ వరకు ర్యామ్ ఉపయోగించుకోవచ్చు.

వివో వీ25 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 44వాట్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ లభిస్తుంది. స్మార్ట్ ఛార్జింగ్ ఇంజిన్ ఫీచర్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 + ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. సర్ఫింగ్ బ్లూ, ఎలిగెంట్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: 5G Smartphone, Smartphone, Vivo

ఉత్తమ కథలు