Home /News /technology /

Vivo V23e 5G: వివో వి23ఈ 5జీ స్మార్ట్​ఫోన్​ లాంచ్.. అద్భుతమైన ఫీచర్లతో మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్

Vivo V23e 5G: వివో వి23ఈ 5జీ స్మార్ట్​ఫోన్​ లాంచ్.. అద్భుతమైన ఫీచర్లతో మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్

వివో మొబైల్ ఫోన్

వివో మొబైల్ ఫోన్

Vivo V23e 5G: కొత్త వివో వి23ఈ 5జీ థాయిలాండ్‌ మార్కెట్​లో సింగిల్​ వేరియంట్​లో లభిస్తుంది. దీని ఏకైక 8 జీబీ ర్యామ్​ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ THB 12,999 (దాదాపు రూ. 29,200) వద్ద లభిస్తుంది. ఇది -సన్‌షైన్ కోస్ట్, మూన్‌లైట్ షాడో అనే రెండు విభిన్న కలర్​ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

ఇంకా చదవండి ...
ప్రముఖ మొబైల్​ తయారీ సంస్థ వివో (Vivo) నుంచి మరో మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​ రిలీజైంది. వివో వి23ఈ 5జీ (Vivo V23e 5G)  పేరుతో మంగళవారం థాయ్‌లాండ్‌లో ఈ స్మార్ట్​ఫోన్​ను ఆవిష్కరించింది. మలేషియా మార్కెట్లో వివో వై76 5జీ లాంచ్ అయిన కొద్ది గంటలకే ఈ స్మార్ట్‌ఫోన్ విడుదలకావడం గమనార్హం. వివో వి -సిరీస్​లో రిలీజైన ఈ వివో వి23ఈస్మార్ట్​ఫోన్​ మీడియాటెక్​ డైమెన్సిటీ 810 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఇది 8 జీబీ ర్యామ్​ ర్యామ్​తో వస్తుంది. దీనిలో 44W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్‌ను అందించింది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్​ టచ్​ ఓఎస్​12పై రన్ అవుతుంది. వివో వి23ఈ 5జీ మొత్తం రెండు కలర్​ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

వివో వి23ఈ 5జీ ధర

కొత్త వివో వి23ఈ 5జీ థాయిలాండ్‌ మార్కెట్​లో సింగిల్​ వేరియంట్​లో లభిస్తుంది. దీని ఏకైక 8 జీబీ ర్యామ్​ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ THB 12,999 (దాదాపు రూ. 29,200) వద్ద లభిస్తుంది. ఇది -సన్‌షైన్ కోస్ట్, మూన్‌లైట్ షాడో అనే రెండు విభిన్న కలర్​ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే దీని ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 1 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

6G Technology : 5G కన్నా ముందే వస్తున్న 6G.. ప్రత్యేకత ఏంటి..? ఇండియాకు ఎప్పుడు వస్తుంది..

వివో వి23ఈ 5జీ స్పెసిఫికేషన్లు

స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే.. వివో వి 23ఈ 5జీ ఫన్​ టచ్​ ఓఎస్​12పై పనిచేస్తుంది. ఇది 6.44- అంగుళాల ఫుల్​ హెచ్​డీ ప్లస్​ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. దీనిలో 8 జీబీ ర్యామ్​ జత చేసిన మీడియాటెక్​ డైమెన్సిటీ 810 SoC ప్రాసెసర్​ను అందించింది. దీనిలో 128 జీబీ స్టోరేజ్​ను అందించింది. మైక్రో ఎస్​డీ కార్డ్ సహాయంతో స్టోరేజ్​ను 1 టీబీ వరకు విస్తరించుకోవచ్చు. వివో వి23ఈ 5జీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50- మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ కెమెరా, 8-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ కెమెరా, 2- మెగాపిక్సెల్ కెమెరాలను అందించింది. దీని ముందు భాగంలో సెల్ఫీల కోసం ప్రత్యేకంగా 44-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా చేర్చింది.

instagram: ఇన్‌స్టాలో రీల్స్ చేస్తున్నారా.. ఈ ఫీచ‌ర్ తెలుసుకోండి

వివో వి23ఈ 5జీ బ్యాటరీ విషయానికొస్తే.. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ గల 4,050mAh బ్యాటరీతో వస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్ల పరంగా చూస్తే.. యూఎస్​బీ టైప్- సీ పోర్ట్, బ్లూటూత్ v5.1, జీపీఎస్​, డ్యూయల్-సిమ్ స్లాట్స్​, డ్యూయల్ వైఫై సపోర్ట్ వంటివి అందించింది. ఇందులో ఆన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Smart phone, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు