ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి మరో 5జీ మొబైల్ రిలీజ్ అయింది. వివో నుంచి వివో వీ21ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ఇటీవల కాలంలో ఇండియాలో వరుసగా 5జీ స్మార్ట్ఫోన్లు రిలీజ్ అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం పోకో ఎం3 ప్రో 5జీ, రియల్మీ ఎక్స్ 7 మ్యాక్స్, ఐకూ జెడ్3 5జీ, వన్‌ప్లస్ నార్డ్ సీఈ రిలీజ్ అయ్యాయి. లేటెస్ట్గా రియల్మీ నార్జో 30 5జీ మోడల్ కూడా వచ్చింది. ఇప్పుడు వివో నుంచి వీ21ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. వివో వీ21 సిరీస్‌లో వచ్చిన మరో మడోల్ ఇది. వివో వీ21ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 6.4 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 64 మెగాపిక్సెల్ డ్యూయెల్ రియర్ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి. వివో వీ21ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ కేవలం 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే రిలీజ్ అయింది. ధర రూ.24,990. వివో ఇండియా వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ మొదలైంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొంటే రూ.2,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
Mi 11 Lite: కాసేపట్లో ఎంఐ 11 లైట్ ప్రీ-ఆర్డర్ సేల్... రూ.3,000 డిస్కౌంట్
JioPhone Next: జియో ఆవిష్కరించిన జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఇవే
Own every moment like @imVkohli!
Make every moment stylish with the all-new #vivoV21e just like our Camera Xperience Officer!
Buy now: https://t.co/Uk5AjIIF1a#DelightEveryMoment #MostStylish5G pic.twitter.com/gushvYxPan
— Vivo India (@Vivo_India) June 25, 2021
వివో వీ21ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ చిప్సెట్ 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. వెనుకవైపు 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్లతో డ్యూయలె కెమెరా సెటప్ ఉంది. ముందువైపు సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. కెమెరా యాప్‌లో పోర్ట్రైట్, స్లో మో, టైమ్ ల్యాప్స్, నైట్, ఏఆర్ స్టిక్కర్స్, డబుల్ ఎక్స్పోజర్, డ్యూయెల్ వ్యూ వీడియో లాంటి ఫీచర్స్ ఉన్నాయి. వివో వీ21ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 4,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 44వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కేవలం 30 నిమిషాల్లో 72 శాతం ఛార్జింగ్ చేయొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 + ఫన్‌టచ్ ఓఎస్ 11.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. సన్‌సెట్ జాజ్, బ్లాక్ పెరల్ కలర్స్‌లో కొనొచ్చు.
Realme X7 Max: రియల్మీ ఎక్స్7 మ్యాక్స్ కొత్త వేరియంట్ వచ్చింది... ఈరోజే సేల్
Redmi Note 10: ఈ స్మార్ట్‌ఫోన్ ధర పెరిగింది... లేటెస్ట్ రేట్ ఎంతంటే
Presenting the world of the #MostStylish5G where every moment can be made stylish! pic.twitter.com/xWXHqn2AT6
— Vivo India (@Vivo_India) June 24, 2021
ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రూ.25,000 లోపు సెగ్మెంట్లో 5జీ స్మార్ట్‌ఫోన్స్ చాలానే ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ సీఈ, సాంసంగ్ గెలాక్సీ ఎం42 5జీ, ఎంఐ 10ఐ లాంటి స్మార్ట్ఫోన్లకు వివో వీ21ఈ 5జీ పోటీ ఇవ్వనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Mobile, Mobile News, Mobiles, Smartphone, Smartphones, Vivo