Home /News /technology /

VIVO V21A SMARTPHONE LAUNCHED IN INDIA UNDER RS 15000 KNOW SPECIFICATIONS SS

Vivo V21A: వివో నుంచి మరో బడ్జెట్ మొబైల్... ఫీచర్స్ ఇవే

Vivo V21A: వివో నుంచి మరో బడ్జెట్ మొబైల్... ఫీచర్స్ ఇవే

Vivo V21A: వివో నుంచి మరో బడ్జెట్ మొబైల్... ఫీచర్స్ ఇవే

Vivo V21A | రూ.15,000 లోపు స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారి కోసం వివో ఇండియా (Vivo India) మరో మొబైల్‌ను పరిచయం చేసింది. వివో వీ21ఏ మోడల్‌ను రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్స్ తెలుసుకోండి.

    కొత్త సంవత్సరంలో వివో ఇండియా (Vivo India) దూకుడుగా స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తోంది. ఈ నెలలోనే వివో వై53ఎస్, వివో వై21టీ, వివో వై21ఏ, వివో వీ23 సిరీస్, వివో వై21ఈ, వివో వై33టీ మోడల్స్‌ని రిలీజ్ చేసింది. ఇప్పుడు బడ్జెట్ సెగ్మెంట్‌లో వివో వీ21ఏ (Vivo V21A) మోడల్‌ను పరిచయం చేసింది. వీ21 సిరీస్‌లో వచ్చిన మరో మొబైల్ ఇది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.15,000 లోపు బడ్జెట్‌లో (Smartphone Under Rs 15000) విడుదల చేయడం విశేషం. కేవలం 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. ధర రూ.13,990. వివో ఇండియా ఇ-స్టోర్‌తోపాటు రీటైల్ స్టోర్లలో కొనొచ్చు. ఇప్పటికే ఈ బడ్జెట్‌లో మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2, రియల్‌మీ నార్జో 30, రెడ్‌మీ నోట్ 10, మోటో జీ51 లాంటి మోడల్స్ ఉన్నాయి. వీటికి వివో వీ21ఏ గట్టి పోటీ ఇవ్వనుంది.

    వివో వీ21ఏ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఈ స్మార్‌ఫోన్ చూడ్డానికి వివో వీ21ఈ మోడల్ లాగానే ఉంది. ఇందులో 6.51 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ నోకియా 3.1, సాంసంగ్ గెలాక్సీ ఎం01ఎస్, టెక్నో స్పార్క్ 8 లాంటి మోడల్స్‌లో ఉంది. 4జీబీ+64జీబీ వేరియంట్‌తో వివో వీ21ఏ రిలీజ్ అయింది. మైక్రోఎస్‌డీ కార్డుతో స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఇక ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్‌తో మరో 1జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు. అంటే మొత్తం 5జీబీ ర్యామ్ వాడుకోవచ్చు.

    WhatsApp Group: నగల దొంగల్ని పట్టిచ్చిన వాట్సప్ గ్రూప్... ఎలాగో తెలిస్తే షాకవ్వాల్సిందే

    వివో వీ21ఏ స్మార్ట్‌ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. కెమెరాలో ఫోటో, పోర్ట్‌రైట్, వీడియో, పనో, లైవ్ ఫోటో, టైమ్ ల్యాప్స్, ప్రో, డాక్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే డ్యూయెల్ బ్యాంక్ వైఫై, బ్లూటూత్ 5, టైప్‌సీ పోర్ట్, 4జీ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. వివో వీ21ఏ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మిడ్‌నైట్ బ్లూ, డైమండ్ గ్లో కలర్స్‌లో కొనొచ్చు.

    Tata Sky: టాటా స్కై యూజర్లకు గుడ్ న్యూస్... కొత్తగా టాటా ప్లే సేవలు

    మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా వివో ఇండియా వివో వీ21ఏ స్మార్ట్‌ఫోన్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఉన్న ఫ్యాక్టరీలో తయారు చేయనుంది. వివో వీ21ఏ స్మార్ట్‌ఫోన్‌తో పాటు మరిన్ని మొబైల్స్ ఇక్కడే తయారుకానున్నాయి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Mobile News, Mobiles, Smartphone, Vivo

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు