కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. వివో నుంచి మరో స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. వివో వీ20 సిరీస్‌లో వివో వీ20 ఎస్ఈ మోడల్‌ను పరిచయం చేసింది కంపెనీ. ఇప్పటికే వివో వీ20 రిలీజైన సంగతి తెలిసిందే. వివో వీ20 ప్రో కూడా త్వరలో రిలీజ్ కానుంది. ఇటీవల రిలీజైన వివో వీ20 కన్నా కాస్త తక్కువ స్పెసిఫికేషన్స్‌తో వివో వీ20 ఎస్ఈ మోడల్‌ను తీసుకొచ్చింది కంపెనీ. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్, 4,100ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఇప్పటికే వివో వీ20 ఎస్ఈ స్మార్ట్‌ఫోన్ మలేషియాలో రిలీజైంది. ఇప్పుడు ఇండియన్ మార్కెట్లోకి వచ్చింది. 8జీబీ+128జీబీ వేరియంట్లో మాత్రమే వివో వీ20 ఎస్ఈ రిలీజైంది. ధర రూ.20,990. వివో ఇండియా ఇ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇతర ఇ-కామర్స్ సైట్లలో నవంబర్ 3న సేల్ ప్రారంభం అవుతుంది. కస్టమర్లకు లాంఛ్ ఆఫర్స్ ప్రకటించింది వివో. బజాజ్ ఫిన్సర్వ్, హోమ్ క్రెడిట్ నుంచి ఫైనాన్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఐసీఐసీఐ, కొటక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇతర బ్యాంకు కార్డులపై 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. వివో వీ20 ఎస్ఈ కొన్నవారికి ఒకసారి స్క్రీన్ రీప్లేస్మెంట్ ఉచితం. ఇక కస్టమర్లు జియో నుంచి రూ.10,000 విలువైన బెనిఫిట్స్ పొందొచ్చని కంపెనీ ప్రకటించింది. వీఐ కస్టమర్లకు బండిల్ ఆఫర్స్ ఉన్నాయి. 12 నెలల వరకు నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఎక్స్ఛేంజ్ ద్వారా వివో వీ20 ఎస్ఈ కొంటే అదనంగా రూ.2,000 తగ్గింపు లభిస్తుంది.
Vivo: రూ.9,990 విలువైన వివో స్మార్ట్‌ఫోన్‌ను రూ.3,096 ధరకే సొంతం చేసుకోండి
Samsung galaxy m51: రూ.22,499 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.3099 ధరకే... కొనండి ఇలా
వివో 20 ఎస్ఈ స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6.44 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్
ర్యామ్: 8 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128 జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665
రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్
ఫ్రంట్ కెమెరా: 32 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,100ఎంఏహెచ్ (33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్)
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 + ఫన్‌టచ్ ఓఎస్ 11
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: ఆక్వామెరైన్, గ్రావిటీ బ్లాక్
ధర: రూ.20,990