Vivo V20 2021: వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ధర ఎంతంటే

Vivo V20 2021: వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ధర ఎంతంటే

Vivo V20 2021 | రెండు నెలల క్రితం ఇండియాలో రిలీజ్ అయిన వివో వీ20 అప్‌గ్రేడ్ వర్షన్ వివో వీ20 2021 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

  • Share this:
    కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. వివో నుంచి కొత్త మోడల్ ఇండియాలో రిలీజ్ అయింది. వివో వీ20 2021 పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. కొంతకాలంగా ఈ ఫోన్ గురించి పుకార్లు వినిపిస్తున్నాయి. అక్టోబర్‌లో ఇండియాలో వివో వీ20 రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొన్ని మార్పులతో వివో వీ20 2021 స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది కంపెనీ. పాత మోడల్ కన్నా కొత్త మోడల్‌ను కాస్త అప్‌గ్రేడ్ చేసింది కంపెనీ. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్ బదులు స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ను రూపొందించింది. అమొలెడ్ డిస్‌ప్లే, 4,000ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ట్రిపుల్ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి. కెమెరాలో మోషన్ ఆటో ఫోకస్, ఐ ఆటో ఫోకస్, బాడీ అండ్ ఆబ్జెక్ట్ ఫోకస్, సూపర్ నైట్ మోడ్, సూపర్ వైడ్ యాంగిల్ నైట్ మోడ్, ట్రైపాడ్ నైట్ మోడ్, అల్ట్రా స్టేబుల్ వీడియో లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇక సెల్ఫీ కెమెరా 44 మెగాపిక్సెల్ కావడం విశేషం. స్మార్ట్‌ఫోన్స్‌లో ఇంత భారీ సెల్ఫీ కెమెరా ఉండటం అరుదు. సెల్ఫీ కెమెరా ఆటో ఫోకస్ సపోర్ట్ చేస్తుంది.

    WhatsApp: అలర్ట్... ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు... మీ దగ్గర ఈ మోడల్ ఉందా?

    Top 10 Apps: 2020 లో ఎక్కువగా డౌన్‌లోడ్స్ చేసిన టాప్ 10 యాప్స్ ఇవే

    వివో వీ20 2021 స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్‌లో రిలీజైంది. ధర రూ.24,990. అక్టోబర్‌లో రిలీజైన వివో వీ20 ధర కూడా రూ.24,990 కావడం విశేషం. ఈ ఫోన్ ఇతర వేరియంట్లలో రిలీజ్ అవుతుందో లేదో ఇంకా స్పష్టత లేదు. ఆఫ్‌లైన్ స్టోర్లలో లభిస్తుందా లేదా అన్న క్లారిటీ కూడా లేదు. వివో వీ20 2021 స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం అమెజాన్‌లో కొనొచ్చు. సేల్ కూడా మొదలైంది. రూ.13,500 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ప్రకటించింది అమెజాన్. నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుతో కొనేవారికి 10 శాతం తగ్గింపు లభిస్తుంది.

    Redmi 9 Power: ఈ మోడల్ ఫోన్లన్నీ 30 సెకన్లలో అమ్ముడుపోయాయి... ప్రత్యేకత ఏంటో తెలుసుకోండి

    Smartphones under Rs 15000: కొత్త ఫోన్ కొనాలా? రూ.15,000 లోపు బెస్ట్ 10 స్మార్ట్‌ఫోన్స్ ఇవే

    వివో వీ20 2021 స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.44 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే, 1,080x2,400 పిక్సెల్స్
    ర్యామ్: 8జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ
    ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ
    రియర్ కెమెరా: 64 మెగాపిక్సెల్ ప్రమైరీ కెమెరా + 8 మెగాపిక్సెల్ మల్టీ ఫంక్షనల్ కెమెరా + 2 మెగాపిక్సెల్ మోనో కెమెరా
    ఫ్రంట్ కెమెరా: 44 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 4,000ఎంఏహెచ్ (33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11 + ఫన్ టచ్ ఓఎస్ 11
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ నానో సిమ్
    కలర్స్: మిడ్‌నైట్ జాజ్, సన్‌సెట్ మెలొడీ
    ధర: రూ.24,990
    Published by:Santhosh Kumar S
    First published: