ఇండియాలో రిలీజైన వివో వీ11

వివో కంపెనీ వీ11 స్మార్ట్‌ఫోన్‌‌ను ఇండియాలో లాంఛ్ చేసింది కంపెనీ. ధర రూ.22,990.

news18-telugu
Updated: September 25, 2018, 5:54 PM IST
ఇండియాలో రిలీజైన వివో వీ11
వివో కంపెనీ వీ11 స్మార్ట్‌ఫోన్‌‌ను ఇండియాలో లాంఛ్ చేసింది కంపెనీ. ధర రూ.22,990.
  • Share this:
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో... ఇటీవలే ఇండియాలో వివో వీ11 ప్రో రిలీజ్ చేసింది. కొన్ని రోజుల్లోనే వివో వీ11 తీసుకొచ్చింది. అంతే కాదు... వివో వీ9 ప్రో కూడా సెప్టెంబర్ 26న లాంఛ్ కానుంది. ఇలా వరుసగా ఫోన్లు లాంఛ్ చేస్తూ ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పై పట్టు కోసం ప్రయత్నిస్తోంది వివో. వివో వీ11 సెప్టెంబర్ 27 నుంచి ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. వాటర్ నాచ్ డిస్‌ప్లే ఈ ఫోన్ ప్రత్యేకత. 3315 ఎంఏహెచ్ బ్యాటరీ డ్యూయెల్ ఇంజిన్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. 25 మెగాపిక్సెల్ ఆర్టిఫిషియల్ సెల్ఫీ కెమెరా మరో అట్రాక్షన్.

హెచ్‌‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డులపై వివో వీ11 కొన్నవారికి రూ.2,000 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఆఫ్‌లైన్ స్టోర్లల్లో పేటీఎం మాల్ క్యూఆర్ కోడ్‌తో కొంటే రూ.2,000 క్యాష్ బ్యాక్ కూపన్ లభిస్తుంది. క్యాపిటల్ ఫస్ట్‌తో కంటే 5 శాతం లాభం. రిలయెన్స్ జియో నుంచి రూ.4,050 విలువైన లాభాలుంటాయి. మొదటిసారి జియో సిమ్ ఉపయోగిస్తున్నవారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది. సిమ్ ఫోన్‌లో వేసిన తర్వాత రూ.198 రీఛార్జ్ చేయాలి. వొడాఫోన్ ఐడియా నుంచి ఫిజికల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్ ఉంది.

వివో వీ11 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+, సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే, 19:9 యాస్పెక్ట్ రేషియో
ర్యామ్: 6జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 660రియర్ కెమెరా: 16+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 25 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3315 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1, ఫన్‌టచ్ ఓఎస్ 4.5
కలర్స్: స్టేరీ నైట్, న్యూబెల్లా పర్పుల్
ధర: రూ.22,990

ఇవి కూడా చదవండి:

ఇండియాలో లాంఛైన సాంసంగ్ గెలాక్సీ ఏ7

గ్రాండ్‌గా లాంఛైన 'మోటోరోలా వన్ పవర్'

సాంసంగ్ నుంచి మరో రెండు ఫోన్లు!

ఇండియాలో లాంఛైన నోకియా 5.1 ప్లస్

యూత్ కోసం మరో రెండు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్!
Published by: Santhosh Kumar S
First published: September 25, 2018, 5:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading