Vivo S1 Pro: అదిరిపోయే ఫీచర్లతో వివో ఎస్1 ప్రో... రేపే రిలీజ్

Vivo S1 Pro | వివో ఎస్1 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో సూపర్ అమొలెడ్ డిస్‌‌ప్లే, ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 48 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, టైప్ సీ పోర్ట్ ఉండటం విశేషం.

news18-telugu
Updated: January 3, 2020, 1:00 PM IST
Vivo S1 Pro: అదిరిపోయే ఫీచర్లతో వివో ఎస్1 ప్రో... రేపే రిలీజ్
Vivo S1 Pro: అదిరిపోయే ఫీచర్లతో వివో ఎస్1 ప్రో... రేపే రిలీజ్ (image: Vivo India)
  • Share this:
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. అదిరిపోయే ఫీచర్లతో వివో ఎస్1 ప్రో స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. జనవరి 4న కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేయనుంది వివో. ఈ ఏడాది వివో రిలీజ్ చేస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే. కొంతకాలంగా వివో ఎస్1 ప్రో మోడల్‌ను బాగా ప్రమోట్ చేస్తోంది వివో. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్‌పై అంచనాలు పెరిగాయి. వెనుకవైపు నాలుగు కెమెరాలు ఉండటం ఈ స్మార్ట్‌ఫోన్ విశేషం. ఇప్పటికే వివో ఎస్1 ప్రో ఫిలిప్పీన్స్‌లో రిలీజైంది. స్పెసిఫికేషన్స్ అందరికీ తెలిసినవే. సూపర్ అమొలెడ్ డిస్‌‌ప్లే, ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 48 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, టైప్ సీ పోర్ట్ ఉండటం విశేషం.



వివో ఎస్1 ప్రో స్పెసిఫికేషన్స్డిస్‌ప్లే: 6.38 సూపర్ అమొలెడ్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే
ర్యామ్: 6జీబీ, 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 665
రియర్ కెమెరా: 48+8+2+2 మెగాపిక్సెల్ ఏఐ క్వాడ్ కెమెరా
ఫ్రంట్ కెమెరా: 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
బ్యాటరీ: 4,500 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్:
సిమ్ సపోర్ట్: డ్యుయెల్ సిమ్
కలర్స్: క్రిస్టల్ బ్లూ, డ్రీమీ వైట్, నైట్ బ్లాక్
ధర: సుమారు రూ.19,990

రూ.8,199 ధరకే నోకియా 2.3 సేల్... ఫోన్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Realme: రియల్‌మీ ఫోన్లు వాడుతున్నవారికి షాకిచ్చిన కంపెనీ

Reliance Jio Jobs: రిలయెన్స్ జియోలో ఉద్యోగాల కోసం ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

ATM: ఎస్‌బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా? ఈ కొత్త రూల్ తెలుసా?
Published by: Santhosh Kumar S
First published: January 3, 2020, 1:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading