స్మార్ట్ ఫోన్ లవర్స్‌కు చైనా మొబైల్ కంపెనీ వివో (Vivo) నుంచి గుడ్ న్యూన్ రాబోతోంది. ఈ విషయాన్ని టెక్ వర్గాలు కూడా ధ్రువీకరిస్తున్నాయి. బడ్జెట్ రేంజ్లో ఆరు కొత్త మోడల్స్‌ను (New Smartphones) వచ్చే నెలలో ఇండియన్ మార్కెట్లోకి వివో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ రిపోర్ట్ ప్రకారం.. వివో కంపెనీ ఆరు బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల లాంచ్‌తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. వివో Y02S, వివో Y16, వివో Y35, వివో Y22, విపో Y22ఎస్, వివో Y01A వంటి పేర్లతో ఆరు మోడల్స్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. అయితే.. ఈ మోడల్స్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, ధరలను టిప్ స్టర్ వెల్లడించలేదు. వివో Y22S(Vivo Y22S)కు సంబంధించిన ఫొటోలు, స్పెసిఫికేషన్లను ప్రైస్‌బాబా రివీల్ చేసింది. ఇది గతేడాది ఇండోనేషియాలో ప్రారంభించిన వివో Y21Sకి సక్సెసర్‌గా రానుందని తెలిపింది.
వివో Y22S కలర్స్
ప్రైస్‌బాబా ప్రకారం.. Vivo Y22S వెనుక భాగంలో డ్యుయల్ కెమెరా సెటప్ ఉండనుంది. డార్క్ బ్లూ, స్కై బ్లూ కలర్స్‌లో ఈ వేరియంట్ అందుబాటులోకి రానుంది. వీవో (Vivo) బ్రాండింగ్ ఫోన్ ముందు భాగంలో ఉండనుంది.
Free Smartphone : ప్రభుత్వం కొత్త స్కీమ్..మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు,ఫ్రీ ఇంటర్నెట్
స్పెసిఫికేషన్స్
వివో Y22S స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ ఇంటర్ నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. 6.55-అంగుళాల వాటర్-డ్రాప్ నాచ్ డిస్ప్లేతో వివో Y22S వస్తుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. HD రిజల్యూషన్‌తో కూడిన LCD ప్యానెల్ దీని స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్ కావచ్చు. కెమెరా విషయానికొస్తే.. 50MP మెయిన్ లెన్స్, 2MP సెకండరీ సెన్సార్‌తో వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్‌తో రానున్నట్లు సమాచారం. ఈ సెన్సార్‌ను డెప్త్ లేదా మాక్రో షాట్స్ కోసం వినియోగించి ఉండవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ 8GB RAM అండ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ ఉండవచ్చు. క్వాల్కమ్ ష్నాప్ డ్రాగన్ 680 SoC ద్వారా ఇది ఫవర్ పొందుతుంది.
Realme GT Neo 3T: రియల్‌మి నుంచి నయా ఫోన్.. Realme GT Neo 3T లాంచ్ ఎప్పుడంటే..
అడిషనల్ స్టోరేజ్ కోసం మైక్రో SD కార్డ్ స్లాట్ ఆప్షన్ కూడా ఇందులో ఉండనున్నట్లు సమాచారం. వివో Y22S మోడల్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో రానుందని భావిస్తున్నారు. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత Funtouch OS 12తో ఈ స్మార్ట్‌ఫోన్ బూట్ అవుతుంది.
వివో Y22S ధర (అంచనా )
ఈ మోడల్ స్మార్ట్ ఫోన్ ధరకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడికాలేదు. అయితే ఇది బడ్జెట్ రేంజ్లో భారతదేశంలో లాంచ్ అవుతున్నందున.. దీని ప్రారంభ ధర రూ.15,000 లోపు ఉండవచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, వివో కంపెనీ ఇటీవల మిడ్-రేంజ్లో Vivo V25 ప్రో పేరుతో స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. 120Hz డిస్ప్లే, డైమెన్సిటీ 1300 SoC, 66W ఫాస్ట్ ఛార్జింగ్ వంటివి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g smart phone, Vivo