హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Vivo T1X: రూ.10,999 ధరకే వివో టీ1ఎక్స్ వచ్చేసింది... 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీ, 6GB వరకు ర్యామ్

Vivo T1X: రూ.10,999 ధరకే వివో టీ1ఎక్స్ వచ్చేసింది... 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీ, 6GB వరకు ర్యామ్

Vivo T1X: రూ.10,999 ధరకే వివో టీ1ఎక్స్ వచ్చేసింది... 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీ, 6GB వరకు ర్యామ్
(image: Vivo India)

Vivo T1X: రూ.10,999 ధరకే వివో టీ1ఎక్స్ వచ్చేసింది... 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీ, 6GB వరకు ర్యామ్ (image: Vivo India)

Vivo T1X | స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్ ఆడేవారి కోసం గేమింగ్ ఫీచర్స్‌లో వివో ఇండియా వివో టీ1ఎక్స్ (Vivo T1X) స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీ, 6GB వరకు ర్యామ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

వివో ఇండియా మరో స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంఛ్ చేసింది. వివో టీ సిరీస్‌లో వివో టీ1ఎక్స్ (Vivo T1X) మోడల్‌ను పరిచయం చేసింది. ఇప్పటికే వివో టీ సిరీస్‌లో వివో టీ1, వివో టీ1 ప్రో, వివో టీ1 44W మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు వివో టీ1ఎక్స్ మొబైల్ లాంఛ్ అయింది. బ్యాంక్ ఆఫర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,999 నుంచే ప్రారంభం అవుతుంది. ఇది 4జీ స్మార్ట్‌ఫోన్. ఇందులో 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీ, 6GB వరకు ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఇందులో ఫోర్ లేయర్ కూలింగ్ సిస్టమ్ ఫీచర్ ఉండటం విశేషం. గేమింగ్ లవర్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ స్మార్ట్‌ఫోన్ రూపొందించింది వివో ఇండియా.

వివో టీ1ఎక్స్ ధర, ఆఫర్స్


వివో టీ1ఎక్స్ మూడు వేరియంట్లలో రిలీజైంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999 కాగా, 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. ఇక హైఎండ్ వేరియంట్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.14,999. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో వివో టీ1ఎక్స్ 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.10,999 ధరకు, 4జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.11,999 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.13,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. గ్రావిటీ బ్లాక్, స్పేస్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో జూలై 27న సేల్ ప్రారంభం అవుతుంది.

Xiaomi Smart TV: రూ.12,499 ధరకే షావోమీ స్మార్ట్ టీవీ... FHD డిస్‌ప్లే, 24W స్పీకర్స్

వివో టీ1ఎక్స్ స్పెసిఫికేషన్స్


వివో టీ1ఎక్స్ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ మోటో జీ52, రెడ్‌మీ 10 పవర్, రియల్‌మీ 9 4జీ, ఒప్పో కే10, రెడ్‌మీ 10, రెడ్‌మీ నోట్ 11, వివో వై33టీ, రియల్‌మీ 9ఐ స్మార్ట్‌ఫోన్లలో ఉంది.

వివో టీ1ఎక్స్ స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్‌తో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కెమెరాలో సూపర్ హెచ్‌డీఆర్, మల్టీ లేయర్ పోర్ట్‌రైట్, స్లో మోషన్, పనోరమా, లైవ్ ఫోటో, సూపర్ నైట్ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

40 inch Smart TV: రూ.16,000 లోపే 40 అంగుళాల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ... ఈఎంఐ రూ.590 మాత్రమే

వివో టీ1ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌లో ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్‌తో ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి అదనంగా ర్యామ్ పెంచుకోవచ్చు. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 12 + ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. వైఫై, బ్లూటూత్ 5.0, మల్టీ టర్బో 5.0, టైప్ సీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: 5G Smartphone, Flipkart, Mobile News, Mobiles, Smartphone, Vivo

ఉత్తమ కథలు