Vivo T1 Series: వివో T1 సిరీస్​లో కొత్తగా రెండు 5జీ స్మార్ట్​ఫోన్లు లాంచ్​.. ధర, ఫీచర్ల వివరాలివే!

(image: Vivo India)

ప్రముఖ మొబైల్​ తయారీ సంస్థ వివో నుంచి కొత్తగా రెండు 5 జీ స్మార్ట్​ఫోన్లు విడుదలయ్యాయి. వివో టి 1 (Vivo T1), వివో టి 1 ఎక్స్ (Vivo T1x) పేరుతో చైనా మార్కెట్​లోకి లాంచ్​ అయ్యాయి.

  • Share this:
ప్రముఖ మొబైల్​ తయారీ సంస్థ వివో నుంచి కొత్తగా రెండు 5 జీ స్మార్ట్​ఫోన్లు విడుదలయ్యాయి. వివో టి 1 (Vivo T1), వివో టి 1 ఎక్స్ (Vivo T1x) పేరుతో చైనా మార్కెట్​లోకి లాంచ్​ అయ్యాయి. ప్రస్తుతానికి చైనా మార్కెట్లోనే విడుదలైన ఈ స్మార్ట్​ఫోన్లు భారత్​లో ఎప్పుడు విడుదలవుతాయనే దానిపై స్పష్టత లేదు. ఈ రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు 120Hz వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌ డిస్‌ప్లేతో వస్తాయి. వివో టీ1లో డ్యుయల్ రియర్ కెమెరా సెటప్​ను అందించగా.. వివో టి1 ఎక్స్​లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్​ను చేర్చింది. వివో టి1 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778G SoC ప్రాసెసర్​తో వస్తుంది. వివో T1x మీడియాటెక్ డైమెన్సిటీ 900 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది.

వివో టి 1, వివో టి 1 ఎక్స్ ధర

వివో టి1 బేస్​ వేరియంట్​ (8GB ర్యామ్​ + 128GB స్టోరేజ్) చైనాలో CNY 2,199 (సుమారు రూ. 25,800) ధర వద్ద లభిస్తుంది. 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్​ CNY 2,399 (సుమారు రూ. 28,100) వద్ద, 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్​ CNY 2,599 (సుమారు రూ. 30,400) వద్ద అందుబాటులో ఉంటాయి. వివో టి1 ఎక్స్​ ధరల విషయానికి వస్తే.. 6 జీబీ ర్యామ్​ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ CNY 1,699 (సుమారు రూ. 19,900), 8 జీబీ ర్యామ్​ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్​ CNY 1,799 (సుమారు Rs. 21,100), 8 జీబీ ర్యామ్​ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ CNY 1,999 (సుమారు రూ. 23,400) వద్ద లభిస్తాయి. వివో T1, వివో T1x రెండింటి ప్రీబుకింగ్స్​ చైనాలో ప్రారంభమయ్యాయి. నవంబర్ 1 నుంచి ఇవి అమ్మకానికి వస్తాయి.

వివో టి 1 స్పెసిఫికేషన్లు

వివో టి 1 ఆండ్రాయిడ్ 11 ఆరిజినోస్ 1.0 ఓఎస్​పై పనిచేస్తుంది. ఇది 6.67 అంగుళాల ఫుల్-హెచ్‌డి ప్లస్​ డిస్​ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్​ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778G SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఫోటోలు, వీడియోల కోసం వివో T1లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ని అందించింది. ఇందులో 64 -మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరాలను చేర్చింది. ఈ ఫోన్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది.

Whatsapp: ఈ స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. లిస్ట్‌లో మీ ఫోన్ ఉందమో చెక్ చేసుకోండి


Nokia C30: భారత మార్కెట్​లోకి నోకియా సి 30 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్​..  జియో ఎక్స్​క్లూజివ్​ ఆఫర్​తో రూ.10 వేలలోపే లభ్యం

Published by:Krishna Adithya
First published: