వివో ఇండియా టీ సిరీస్‌లో మరో రెండు స్మార్ట్‌ఫోన్లను లాంఛ్ చేసింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో వచ్చిన వివో టీ1 5జీ స్మార్ట్‌ఫోన్ బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వివో టీ1 ప్రో 5జీ (Vivo T1 Pro 5G), వివో టీ1 44W (Vivo T1 44W) మోడల్స్‌ని లాంఛ్ చేసింది. వివో టీ1 ప్రో 5జీ మోడల్‌లో పాపులర్ ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ఉండటం విశేషం. ఇక వివో టీ1 44W మోడల్‌లో స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలోని ఫీచర్స్ కొద్ది రోజుల క్రితం రిలీజైన ఐకూ జెడ్ 6, ఐకూ జెడ్ 6 ప్రో లాగానే ఉన్నాయి. వివో టీ1 ప్రో 5జీ మొబైల్ రూ.25,000 లోపు సెగ్మెంట్‌లో రిలీజైతే, వివో టీ1 44W రూ.15,000 బడ్జెట్‌లో వచ్చింది. మే 31 లోగా ఈ స్మార్ట్‌ఫోన్లు కొనేవారికి డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి.
వివో టీ1 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999. టర్బో బ్లాక్, టర్బో సియాన్ కలర్స్‌లో కొనొచ్చు. మే 5న ప్రీ బుకింగ్ ప్రారంభం అవుతుంది. ఎస్‌బీఐ కార్డుతో కొంటే రూ.2,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
వివో టీ1 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.44 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 64మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 8మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ కెమెరా + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇందులో 4,700ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా 66వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
Smartphone Offer: ఎస్‌బీఐ కార్డ్ ఉందా? ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.7,000 డిస్కౌంట్
The ultimate upgrade is on its way.
Get ready for the #vivoT1Pro
Pre-booking starts on 5th of May, 12pm at an effective price of ₹21,499* (Inclusive of bank offers)
Know More: https://t.co/KykDVpW2bN#vivoSeriesT #vivoT1 44W #GetSetTurbo#TurboPerformance
*TnC Apply pic.twitter.com/RnA5F2Ytvq
— Vivo India (@Vivo_India) May 4, 2022
వివో టీ1 44W
వివో టీ1 44W స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.17,999. ఐస్ డాన్, మిడ్‌నైట్ గెలాక్సీ, స్టారీ స్కై కలర్స్‌లో కొనొచ్చు. మే 8న ప్రీ బుకింగ్ ప్రారంభం అవుతుంది. ఎస్‌బీఐ కార్డుతో కొంటే రూ.1,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
Xiaomi Offer: ఇలాంటి ఆఫర్ మళ్లీమళ్లీ రాదు... ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.10,000 డిస్కౌంట్
వివో టీ1 44W స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.44 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ + 2మెగాపిక్సెల్ పోర్ట్‌రైట్ లెన్స్‌లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా 44వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Smartphone, Vivo