Home /News /technology /

VIVO T1 5G INDIA LAUNCH MARCH SPECIFICATIONS RAM STORAGE CONFIGURATIONS 5G CONNECTIVITY SNAPDRAGON 778G GH VB

Vivo T15G: భారత్​లో వివో వై సిరీస్​కు బదులు టీ సిరీస్ ఫోన్లు.. ధర, ఫీచర్ల వివరాలిలా.. 

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Vivo T15G: ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ వివో నుంచి మరో కొత్త సిరీస్​​ మార్కెట్​లోకి రానుంది. ఇప్పటివరకు వివో వై సిరీస్​ (Vivo Y Series) పేరుతో భారత్​లో స్మార్ట్​ఫోన్లు విడుదలవుతుండగా.. వీటిని Vivo T-Series భర్తీ చేయనుంది.

ప్రముఖ స్మార్ట్​ఫోన్(Smartphone)​ తయారీ సంస్థ వివో నుంచి మరో కొత్త సిరీస్​​ మార్కెట్​లోకి రానుంది. ఇప్పటివరకు వివో వై సిరీస్​ (Vivo Y Series) పేరుతో భారత్​లో స్మార్ట్​ఫోన్లు విడుదలవుతుండగా.. వీటిని Vivo T-Series భర్తీ చేయనుంది. వివో T1 పేరుతో మార్చి(March) నెలలో తొలి టీ సిరీస్​ ​ఫోన్​ రిలీజ్(T Series Phone Release) కానుంది. టిప్‌స్టర్ ముకుల్​ శర్మ (@stufflistings) ప్రకారం, దేశంలో ప్రస్తుతం లభిస్తున్న వివో వై -సిరీస్‌ను(Vivo Y Series) వివో టీ -సిరీస్ భర్తీ చేయనుంది. వివో టీ1 స్మార్ట్‌ఫోన్‌ మొత్తం రెండు ర్యామ్(Ram)​ + స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. 8GB ర్యామ్​ + 128GB స్టోరేజ్, 8GB ర్యామ్​ + 256GB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 12 జీబీ వేరియంట్ కూడా ఉండవచ్చని ముకుల్​ శర్మ తెలిపారు.

Amazon Offers: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్​లో యాపిల్​ ప్రొడక్ట్స్‌పై బంపరాఫర్లు.. ఐఫోన్​ 12పై భారీ డిస్కౌంట్..


వివో T1 స్మార్ట్​ఫోన్​ స్పెసిఫికేషన్లు
వివో T1, వివో T1ఎక్స్​ రెండు స్మార్ట్​ఫోన్లు గత అక్టోబర్‌లోనే చైనా మార్కెట్​లోకి విడుదలయ్యాయి. అక్కడ మంచి స్పందన వచ్చింది. దీంతో, భారత్​లో సైతం దీన్ని విడుదల చేసేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. ఇండియన్ వేరియంట్​లో కూడా చైనా వేరియంట్‌తో సమానమైన స్పెసిఫికేషన్‌లు ఉండే అవకాశం ఉంది. వివో టీ 1 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్​ 11 ఆధారిత ఆరిజన్​ ఎస్​1.0 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌ ఓఎస్​పై పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల ఫుల్​ హెచ్​డీ ప్లస్​ డిస్‌ప్లేతో వస్తుంది. వివో T1 క్వాల్​కామ్​ స్నాప్​డ్రాగన్​ 778G SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. 12GB ర్యామ్​, 256GB వరకు స్టోరేజ్‌తో వస్తుంది.

కెమెరా విషయానికి వస్తే.. వివో T1 డివైజ్ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 -మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్, 2 -మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. దీని ముందు భాగంలో 16 -మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా అందించనుంది.

Amazon Great Republic Day Sale 2022: వాటిపై భారీ డిస్కౌంట్.. రూ. 2,799 ధరకే ఆ ప్రొడక్ట్ సొంతం..


వివో T1లో 5G, 4G LTE, వైఫై 6, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS, యూఎస్​బీ టైప్- సీ, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటి కనెక్టింగ్​ ఫీచర్లను చేర్చనుంది. ఆన్‌బోర్డ్ సెన్సార్లలో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఉండనున్నాయి. వివో T1 5,000mAh బ్యాటరీ ప్యాక్​తో వస్తుంది. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్​కు సపోర్ట్​ ఇస్తుంది.
Published by:Veera Babu
First published:

Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Smartphone, Vivo

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు