Flipkart Sale | మీరు కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకని అనుకుంటున్నారా? మీకోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. భారీ తగ్గింపు లభిస్తోంది. వివో (Vivo) స్మార్ట్‌ఫోన్‌ను (Smartphone) ఏకంగా 90 శాతం డిస్కౌంట్‌తో సొంతం చేసుకోవచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ ఆఫర్ వివరాలు తెలసుకోవాల్సిందే.
దిగ్గజ ఈకామర్స్ సంస్థల్లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్ .. కస్టమర్ల కోసం బిగ్ దీపావళి సేల్ అందుబాటులో ఉంచింది. ఇందులో భాగంగా కస్టమర్లు పలు రకాల ప్రొడక్టులపై ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు. డిస్కౌంట్‌తోపాటు ఇతర తగ్గింపు ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ ఆఫర్ వంటివి సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్ అక్టోబర్ 16తో ముగియనుంది.
రూ.70 వేల టీవీ రూ.26 వేలకే.. ఈ ఒక్క రోజే ఆఫర్!
ఫ్లిప్‌కార్ట్‌లో వివో కంపెనీకి చెందిన టీ1 44డబ్ల్యూ ఫోన్‌పై కళ్లు చెదిరే ఆఫర్లు లభిస్తున్నాయి. ఈ ఫోన్‌ను భారీ తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చు. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉంది. ఇంకా 50 ఎంపీ కెమెరా ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్ పని చేస్తుంది.
32 అంగుళాల టీవీలపై భారీ డిస్కౌంట్.. రూ.5,800కే కొనేయండి!
అంతేకాకుండా ఈ ఫోన్‌లో 6.44 అంగుళాల ఫుల్ హెచ్‌డీ అమొలెడ్ డిస్‌ప్లే, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇలా ఫీచర్ల పరంగా చూస్తే ఫోన్ ఆకర్షణీయంగానే కనిపిస్తోంది. ఈ ఫోన్‌పై 90 శాతం డిస్కౌంట్ పొందొచ్చు.
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ రూ. 19,990తో లిస్ట్ అయ్యింది. అయితే బిగ్ దీపావళి సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌ను రూ. 14,499కు కొనొచ్చు. అంటే 27 శాతం తగ్గింపు లభిస్తోంది. అలాగే ఎస్‌బీఐ , కోటక్ బ్యాంక్ కార్డుల ద్వారా కొంటే అదనంగా రూ. 1000 వరకు తగ్గింపు వస్తుంది. ఇంకా ఈ ఫోన్‌పై ఎక్స్చేంజ్ ఆఫర్ రూపంలో రూ. 13,600 వరకు తగ్గింపు లభిస్తోంది. అంటే ఈ ఆఫర్లు అన్నింటినీ కలుపుకుంటే ఈ ఫోన్‌పై 90 శాతం వరకు తగ్గింపు లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ ఫోన్‌ను ఈఎంఐలో కూడా కొనుగోలు చేయొచ్చు. నెలవారీ ఈఎంఐ రూ.700 నుంచి ప్రారంభం అవుతోంది. 24 నెలలకు ఇది వర్తిస్తుంది. అదే 12 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 1300 కట్టాలి. ఇంకా నో కాస్ట్ ఈఎంఐ ప్రయోజనం కూడా పొందొచ్చు. 6 నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. నెలకు రూ. 2417 చెల్లించాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Flipkart, Flipkart Big Diwali Sale, Latest offers, Mobile offers, Vivo