Vivo S10: చైనాలో విడుదలైన వివో ఎస్ 10 సిరీస్.. భారత మార్కెట్లోకి ఎప్పుడంటే?

ఫ్రతీకాత్మక చిత్రం(Credit-Vivo)

ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ వివో నుంచి కొత్తగా రెండు స్మార్ట్​ఫోన్లు విడుదలయ్యాయి. ఈ రెండు స్మార్ట్​ఫోన్ల ధరలు, స్పెసిఫికేషన్లను పరిశీలిద్దాం.

  • Share this:
ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ వివో నుంచి కొత్తగా రెండు స్మార్ట్​ఫోన్లు విడుదలయ్యాయి. వివో ఎస్ 10, వివో ఎస్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు తాజాగా చైనా మార్కెట్​లోకి లాంచ్​ అయ్యాయి. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన వివో ఎస్ 9 లైనప్‌కు సీక్వెల్​గా వివో ఎస్ 10 సిరీస్ విడుదలైంది. ఇది వివో అప్పర్​ మిడ్​రేంజ్​లైనప్​లో వస్తోంది. ఈ రెండు స్మార్ట్​ఫోన్ల ధరలు, స్పెసిఫికేషన్లను పరిశీలిద్దాం.

వివో ఎస్ 10 సిరీస్​ ధరలు
వివో ఎస్ 10 స్మార్ట్​ఫోన్​ 8 జిబి + 128 జిబి మోడల్‌ CNY 2,799 (సుమారు రూ. 32,300), 12 జిబి + 256 జిబి మోడల్CNY 2,999 (సుమారు రూ .35,000) ధర వద్ద విడుదలైంది. ఇక, వివో ఎస్ 10 ప్రో 12 జిబి + 256 జిబి మోడల్​ CNY 3,399 (సుమారు రూ. 39,000) ధర వద్ద అందుబాటులో ఉంటుంది. చైనాలో వివో ఎస్ 10, వివో ఎస్ 10 ప్రో ప్రీఆర్డర్లు జూలై 15 నుండి ప్రారంభమయ్యాయి. జూలై 23 నుండి డెలివరీలు ప్రారంభమవుతాయి. అయితే, భారత మార్కెట్​లోకి ఇవి ఎప్పుడు విడుదలవుతాయనే విషయంపై ఎటువంటి స్పష్టత లేదు. భారత్​లో వివో ఎస్ 9 లైనప్‌ ఇంకా విడుదల కాలేదు. దీన్ని బట్టి చూస్తే వివో ఎస్​ 10 సిరీస్​ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

వివో ఎస్ 10 ప్రో స్పెసిఫికేషన్లు
వివో ఎస్ 10 ప్రో సూపర్ అమోలెడ్ ఎఫ్‌హెచ్‌డి + రిజల్యూషన్‌తో 6.44 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. దీనిలో రెండు ఫ్రంట్​ కెమెరాలను అందించింది. 44 ఎంపి ప్రైమరీ సెన్సార్, 8 ఎంపి అల్ట్రావైడ్ కెమెరాలను చేర్చింది. ఇక, ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్-కెమెరా సెటప్ ఉంటుంది. దీనిలో 108MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ సెన్సార్, 2MP మాక్రో లెన్స్ కెమెరాలను అందించింది. వివో ఎస్ 10 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 1100 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఇది ఫన్‌టచ్ OS 11.1 ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తుంది. దీనిలోని 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ 44W ఫాస్ట్​ ఛార్జింగ్​కు మద్దతు ఇస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్ల పరంగా చూస్తే.. దీనిలో రెండు సిమ్ కార్డులు, 5 జి, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై ఎసి, బ్లూటూత్ వి 5.1, జిపిఎస్, యూఎస్​బి టైప్-సి పోర్ట్​తో పాటు ఇన్-డిస్​ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటివి అందించారు.

వివో ఎస్ 10 స్పెసిఫికేషన్లు
వివో ఎస్ 10లోని ఫీచర్లన్నీ వివో ఎస్ 10 ప్రోతో సమానంగా ఉంటాయి. అయితే, వివో ఎస్ 10 ప్రో వెనుక భాగంలో 108 ఎంపి ప్రైమరీ కెమెరాతో ఉండగా, వివో ఎస్ 10 లో 64 ఎంపి ప్రైమరీ సెన్సార్ కెమెరా ఉంటుంది. ఇక, డిస్‌ప్లే, ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లు, బ్యాటరీ వంటి ఫీచర్లు వివో ఎస్ 10 ప్రో మాదిరిగానే ఉంటాయి.
Published by:Sumanth Kanukula
First published: