Vivo Z1x: వివో జెడ్1ఎక్స్ రిలీజ్... జియో యూజర్లకు రూ.6,000 విలువైన బెనిఫిట్స్

Vivo Z1x | వివో జెడ్1ఎక్స్ కొన్నవారికి లాంఛ్ ఆఫర్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో కొనేవారికి రూ.1,000 తగ్గింపు లభిస్తుంది.

news18-telugu
Updated: September 6, 2019, 4:04 PM IST
Vivo Z1x: వివో జెడ్1ఎక్స్ రిలీజ్... జియో యూజర్లకు రూ.6,000 విలువైన బెనిఫిట్స్
Vivo Z1x: వివో జెడ్1ఎక్స్ రిలీజ్... జియో యూజర్లకు రూ.6,000 విలువైన బెనిఫిట్స్ (image: Vivo)
  • Share this:
రియల్‌మీ, షావోమీ, సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లకు పోటీగా వివో జెడ్1ఎక్స్ మోడల్‌ను ఇండియాకు పరిచయం చేసింది వివో. జెడ్ సిరీస్‌లో వివో రిలీజ్ చేసిన రెండో ఫోన్ ఇది. ఇంతకుముందు వివో జెడ్1 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది వివో. వాటర్ డ్రాప్ నాచ్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, స్నాప్‌డ్రాగన్ 712 ప్రాసెసర్, టైప్ సీ పోర్ట్, 22వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌తోపాటు వివో వెబ్‌సైట్‌లో సెప్టెంబర్ 13న సేల్ మొదలుకానుంది. లాంఛ్ ఆఫర్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో కొనేవారికి రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డులపై ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే అదనంగా రూ.250 తగ్గింపు లభిస్తుంది. ఇక జియో యూజర్లకు రూ.6,000 విలువైన బెనిఫిట్స్ పొందొచ్చు.



వివో జెడ్1ఎక్స్ స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.38 అంగుళాల సూపర్ అమొలెడ్ డిస్‌ప్లేర్యామ్: 6జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 712
రియర్ కెమెరా: 48+8+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 32 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,500 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై + ఫన్ టచ్ ఓఎస్ 9.1
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్-నానో
కలర్స్: ఫ్యూజన్ బ్లూ, ఫాంటమ్ పర్పుల్
ధర:
6జీబీ+64జీబీ- రూ.16,990
6జీబీ+128జీబీ- రూ.18,990

అదిరిపోయే ఫీచర్లతో రిలీజైన వివో జెడ్1ఎక్స్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Infinix Hot 8: ట్రిపుల్ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ... ధర రూ.6,999 మాత్రమే

JioFiber: రూ.699 నుంచి జియోఫైబర్ ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే

Loan: ఏ లోన్ అయినా జస్ట్ 59 నిమిషాల్లోనే... అప్లై చేయండి ఇలా
Published by: Santhosh Kumar S
First published: September 6, 2019, 3:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading