Vivo Z1 Pro: ట్రిపుల్ కెమెరాతో వివో జెడ్1 ప్రో... ధర రూ.14,990

Vivo Z1 Pro | బడ్జెట్ సెగ్మెంట్‌లో గేమింగ్‌ను టార్గెట్ చేస్తూ వివో జెడ్1 ప్రో రూపొందించింది కంపెనీ. ఈ ఫోన్‌ను మూడు వేరియంట్లలో రిలీజ్ చేసింది.

news18-telugu
Updated: July 3, 2019, 3:46 PM IST
Vivo Z1 Pro: ట్రిపుల్ కెమెరాతో వివో జెడ్1 ప్రో... ధర రూ.14,990
Vivo Z1 Pro: ట్రిపుల్ కెమెరాతో వివో జెడ్1 ప్రో... ధర రూ.14,990
  • Share this:
బడ్జెట్ సెగ్మెంట్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. వివో నుంచి మరో కొత్త ఫోన్ వివో జెడ్1 ప్రో రిలీజైంది. ట్రిపుల్ కెమెరాతో పాటు పంచ్ హోల్ సెల్ఫీ డిస్‌ప్లే ఈ ఫోన్ ప్రత్యేకత. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా జెడ్ సిరీస్‌లో వివో జెడ్1 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలోనే తయారుచేసి అమ్ముతోంది కంపెనీ. బడ్జెట్ సెగ్మెంట్‌లో గేమింగ్‌ను టార్గెట్ చేస్తూ వివో జెడ్1 ప్రో రూపొందించింది కంపెనీ. ఈ ఫోన్‌ను మూడు వేరియంట్లలో రిలీజ్ చేసింది. వివో జెడ్1 ప్రో ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజీవ్‌గా లభిస్తుంది. సేల్ జూలై 11న ప్రారంభం కానుంది. ధర రూ.14,990 నుంచి ప్రారంభమవుతుంది. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులతో కొన్నవారికి రూ.750 తగ్గింపు లభిస్తుంది.



Loading...
వివో జెడ్1 ప్రో స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ ఫుల్ హెచ్‌డీ+, 19.5:9 యాస్పెక్ట్ రేషియో
ర్యామ్: 4జీబీ, 6జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 712
రియర్ కెమెరా: 16+8+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 32 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై
సిమ్ సపోర్ట్: డ్యుయెల్ నానో సిమ్
కలర్స్: సోనిక్ బ్లూ, సోనిక్ బ్లాక్, మిర్రర్ బ్లాక్
ధర:
4జీబీ+64జీబీ- రూ.14,990
6జీబీ+64జీబీ- రూ.16,990
6జీబీ+128జీబీ- రూ.17,990

Motorola One Vision: మోటోరోలా వన్ విజన్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Samsung: రెడ్‌మీ 7ఏ ఎఫెక్ట్... రూ.1,000 తగ్గిన సాంసంగ్ గెలాక్సీ ఎం10

Realme X: బీ రెడీ... 'రియల్‌మీ ఎక్స్' ఇండియాకు వచ్చేస్తోంది

Redmi 7A: షావోమీ నుంచి 'స్మార్ట్ దేశ్ కా స్మార్ట్‌ఫోన్'
First published: July 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...