Vivo U10: వివో నుంచి కొత్త ఫోన్ వివో యూ10 రిలీజ్... ధర రూ.8,990

Vivo U10 | అమెజాన్‌లో సెప్టెంబర్ 29న సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డుతో కొనేవారికి అదనంగా 10% డిస్కౌంట్ లభిస్తుంది.

news18-telugu
Updated: September 24, 2019, 3:03 PM IST
Vivo U10: వివో నుంచి కొత్త ఫోన్ వివో యూ10 రిలీజ్... ధర రూ.8,990
Vivo U10: వివో నుంచి కొత్త ఫోన్ వివో యూ10 రిలీజ్... ధర రూ.8,990 (image: Vivo India)
news18-telugu
Updated: September 24, 2019, 3:03 PM IST
ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి మరో కొత్త మోడల్‌ని వివో రిలీజ్ చేసింది. వివో యూ10 అధికారికంగా రిలీజైంది. బడ్జెట్ సెగ్మెంట్‌లోకి వచ్చిన కొత్త ఫోన్ ఇది. వివో యూ సిరీస్‌లో తొలి స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే. 3జీబీ+32జీబీ, 3జీబీ+64జీబీ, 4జీబీ+64జీబీ వేరియంట్లలో వివో యూ10 రిలీజైంది. వాటర్ డ్రాప్ నాచ్, స్నాప్‌డ్రాగన్ 655 ప్రాసెసర్, 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, ట్రిపుల్ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. అమెజాన్‌లో సెప్టెంబర్ 29న సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డుతో కొనేవారికి అదనంగా 10% డిస్కౌంట్ లభిస్తుంది. రిలయెన్స్ జియో నుంచి రూ.299 ప్లాన్‌పై రూ.6,000 విలువైన బెనిఫిట్స్ లభిస్తాయి.

వివో యూ10 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.35 అంగుళాల హెచ్‌డీ+

ర్యామ్: 3జీబీ, 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ, 64జీబీ


ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 655 ప్రాసెసర్
రియర్ కెమెరా: 13+8+2 మెగాపిక్సెల్
Loading...
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ (నానో)
కలర్స్: ఎలక్ట్రిక్ బ్లూ, థండర్ బ్లాక్
ధర:
3జీబీ+32జీబీ- రూ.8,990
3జీబీ+64జీబీ- రూ.9,990
4జీబీ+64జీబీ- రూ.10,990

Vivo U10: అదిరిపోయే ఫీచర్లతో వివో యూ10 రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Redmi Note 7 Pro: రెడ్‌మీ నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... కొత్త రేట్లు ఇవే

Amazon Sale: స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్లివే...

Smartphone: మీ ఫోన్ పోయిందా? బ్లాక్ చేయడానికి ఓ కాల్ చాలు...
First published: September 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...