Vivo V19: వివో వీ19 స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే

Vivo V19 Smartphone | వివో వీ19 స్మార్ట్‌ఫోన్‌లో పంచ్ హోల్ డ్యూయెల్ సెల్ఫీ కెమెరా, వెనుక వైపు క్వాడ్ కెమెరా, ఇన్‌డిస్‌ఫ్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 33 వాట్ వివో ఫ్లాష్‌ఛార్జ్ 2.0 సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి.

news18-telugu
Updated: April 7, 2020, 5:03 PM IST
Vivo V19: వివో వీ19 స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే
Vivo V19: వివో వీ19 స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే (image: Vivo)
  • Share this:
వివో నుంచి మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. వాస్తవానికి ఈ ఫోన్ గత నెలలోనే రిలీజ్ కావాల్సింది. కానీ... కరోనావైరస్ సంక్షోభం కారణంగా రిలీజ్ వాయిదా పడింది. మొత్తానికి ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది వివో. గ్లోబల్ సైట్‌లో స్పెసిఫికేషన్స్ వెల్లడించింది కానీ... ధర గురించి ఎలాంటి వివరాలు చెప్పలేదు. ఈ ఫోన్ మార్కెట్‌లోకి ఎప్పుడు వస్తుందో కూడా వెల్లడించలేదు. ఇండియాలో త్వరలో వివో వీ19 రిలీజ్ కానుంది. పంచ్ హోల్ డ్యూయెల్ సెల్ఫీ కెమెరా, వెనుక వైపు క్వాడ్ కెమెరా, ఇన్‌డిస్‌ఫ్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 33 వాట్ వివో ఫ్లాష్‌ఛార్జ్ 2.0 సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి.

వివో వీ19 స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6.44 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే
ర్యామ్: 8 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128 జీబీ, 256 జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 712
రియర్ కెమెరా: 48+8+2+2 మెగాపిక్సెల్ఫ్రంట్ కెమెరా: 32+8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,500 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: స్లీక్ సిల్వర్, గ్లీమ్ బ్లాక్

ఇవి కూడా చదవండి:

Coronavirus Effect: వాట్సప్ మెసేజెస్ ఫార్వర్డ్ చేసేవారికి షాక్

Good News: మొబైల్ యూజర్లకు శుభవార్త... రీఛార్జ్ చేయొచ్చు ఇలా

Aarogya Setu: ఆరోగ్య సేతు యాప్ నిఘా పెడుతోందా? నిజమేంటీ?
Published by: Santhosh Kumar S
First published: April 7, 2020, 5:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading