Vivo Y35 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో (Vivo).. మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. కంపెనీ Y సిరీస్‌లో తాజాగా 5G మోడల్‌ను పరిచయం చేసింది. వివో Y35 5G (Vivo Y35 5G) పేరుతో కొత్త డివైజ్‌ను చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఏడాది ఆగస్టులో కంపెనీ Y35 4G వెర్షన్‌ను పరిచయం చేసింది. కొన్ని ఆసియా మార్కెట్లలో దీన్ని లాంచ్ చేసింది. తాజాగా లేటెస్ట్ కనెక్టివిటీ టెక్నాలజీతో ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసింది. కొత్త మోడల్ ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ప్రత్యేకతలు చూడండి.
శామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్‌లో కొత్త మోడల్స్.. 2023లో రానున్న లగ్జరీ డివైజెస్ ఇవే
వివో Y35 5G ఫోన్ డైమెన్సిటీ 700 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 4 GB, 6 GB, 8 GB LPDDR4x RAM వేరియంట్లలో వస్తుంది. ఈ మూడు మోడల్స్ 128 GB UFS 2.2 స్టోరేజ్‌తో లభిస్తాయి. 18W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీ ఈ ఫోన్‌లో ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 OS, OriginOS ఓషన్ UIతో ఫోన్ రన్ అవుతుంది. మైక్రో SD కార్డ్ స్లాట్‌తో స్టోరేజ్ పొడిగించుకోవచ్చు. ఇది బ్లాక్, బ్లూ, గోల్డ్ కలర్స్‌లో లభిస్తుంది.
ఫీచర్లు
వివో Y35 5G డివైజ్ 88.99 శాతం స్క్రీన్ స్పేస్‌ను అందిస్తుంది. ఇది టియర్‌డ్రాప్ నాచ్‌తో, 6.51 అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఫోన్‌లో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. వెనుకవైపు 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, LED ఫ్లాష్ ఉన్నాయి. సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యుయల్ సిమ్, 5G, Wi-Fi 802.11ac, బ్లూటూత్ 5.2, GPS, USB-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లతో డివైజ్ లాంచ్ అయింది. ఈ ఫోన్ 720 x 1600 పిక్సెల్స్ HD+ రిజల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 1500:1 కాంట్రాస్ట్ రేషియో, 269 ppi పిక్సెల్ డెన్సిటీ, 60Hz రిఫ్రెష్ రేట్, 120Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను అందిస్తుంది.
ధర ఎంత?
చైనాలో వివో Y35 5G ఫోన్ 4 GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర 1,199 యువాన్ ($172), 6 GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర 1,399 యువాన్ ($201), 8 GB RAM + 128 GB ఎడిషన్‌ల ధర 1,499 యువాన్($215)గా ఉంది. ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదల అవుతుందా లేదా అనే విషయంపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g technology, Smart phone, Technology, Vivo