Home /News /technology /

Vivo V23e: వివో వీ సిరీస్​లో మరో మిడ్​రేంజ్​ స్మార్ట్​ఫోన్​ రిలీజ్... ధర, ఫీచర్ల వివరాలివే

Vivo V23e: వివో వీ సిరీస్​లో మరో మిడ్​రేంజ్​ స్మార్ట్​ఫోన్​ రిలీజ్... ధర, ఫీచర్ల వివరాలివే

Vivo V23e: వివో వీ సిరీస్​లో మరో మిడ్​రేంజ్​ స్మార్ట్​ఫోన్​ రిలీజ్... ధర, ఫీచర్ల వివరాలివే

Vivo V23e: వివో వీ సిరీస్​లో మరో మిడ్​రేంజ్​ స్మార్ట్​ఫోన్​ రిలీజ్... ధర, ఫీచర్ల వివరాలివే

Vivo V23e | వివో నుంచి మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. వివో వీ సిరీస్‌లో వీ23ఈ మోడల్ గ్లోబల్ మార్కెట్‌లో లాంఛ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తెలుసుకోండి.

చైనీస్​ స్మార్ట్ బ్రాండ్​ వివో వరుసగా స్మార్ట్​ఫోన్లను లాంచ్​ చేస్తూ తన మార్కెట్​ను విస్తరిస్తోంది. వివో వి సిరీస్​లో తాజాగా ఓ కొత్త మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​ను లాంచ్​ చేసింది. వివో V23e పేరుతో ఇది విడుదలైంది. వివో V21eకి అప్‌గ్రేడ్‌ వెర్షన్​గా ఇది వియత్నాం మార్కెట్​లోకి వస్తుంది. ఏప్రిల్​ నెలలో వివో వి సిరీస్​లో విడుదలైన వివో వి21 5జీ, వివో వి21 సరసన ఈ కొత్త స్మార్ట్​ఫోన్​ చేరనుంది. వివో V23e సింగిల్ 8 జీబీ ర్యామ్​ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్​లో లభిస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్​ వియత్నాం మార్కెట్​లోకి VND 8,490,000 (దాదాపు రూ. 27,800) ధర వద్ద విడుదలైంది. ఈ ఫోన్ ప్రస్తుత వివో వియత్నాం వెబ్‌సైట్‌లో లభిస్తుంది. బ్లాక్​, బ్లూ రోజ్ కలర్​ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అయితే, భారత్​తో సహా ఇతర మార్కెట్లలో దీని లభ్యత గురించి ఇంకా స్పష్టత లేదు.

Lava Agni 5G: మేడ్ ఇన్ ఇండియా 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన లావా మొబైల్స్

వివో V23e స్పెసిఫికేషన్లు


వివో V23e స్మార్ట్​ఫోన్​ ఆండ్రాయిడ్​ 11 ఆధారిత ఫన్​టచ్​ ఎస్​ 12 ఓస్​పై పనిచేస్తుంది. ఇది 6.44- అంగుళాల ఫుల్​-హెచ్​డీ ప్లస్​ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 8 జీబీ ర్యామ్​తో జతచేసిన ఆక్టా-కోర్ మీడియాటెక్​ హీలియో G96 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్​ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్​ను కలిగి ఉంటుంది. ఇది 8- మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్‌, 64- మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ కెమెరాలతో వస్తుంది. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం దీని ముందు భాగంలో 50 -మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను చేర్చింది.

Google Account: జీమెయిల్ యూజర్లకు అలర్ట్... ఇక లాగిన్ చేయాలంటే ఈ రూల్ పాటించాల్సిందే

వివో V23e 128 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్​తో వస్తుంది. మైక్రో ఎస్​డీ కార్డ్ సహాయంతో స్టోరేజ్​ను విస్తరించుకోవచ్చు. కనెక్టివిటీ ఆప్షన్లను పరిశీలిస్తే.. 4జీ ఎల్​టీఈ, వైఫై, బ్లూటూత్ v5.2, జీపీఎస్​, యూఎస్​బీ టైప్-సీ పోర్ట్ వంటివి చేర్చింది. దీనిలో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్​ను కూడా అందించింది. ఈ స్మార్ట్​ఫోన్​ 4,050mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కేవలం బ్లాక్ కలర్ వేరియంట్​లో మాత్రమే లభిస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Mobile News, Mobiles, Smartphone, Vivo

తదుపరి వార్తలు