Vivo V17 Pro: వివో సంచలనం... ప్రపంచంలోనే తొలి పాప్ అప్ డ్యూయెల్ సెల్ఫీ కెమెరాతో స్మార్ట్‌ఫోన్

Vivo V17 Pro | రెండు సెల్ఫీ కెమెరాలు, నాలుగు రియర్ కెమెరాలు ఉండటం ఈ ఫోన్ ప్రత్యేకత. అంటే మొత్తం 6 కెమెరాల స్మార్ట్‌ఫోన్ ఇది.

news18-telugu
Updated: September 20, 2019, 3:57 PM IST
Vivo V17 Pro: వివో సంచలనం... ప్రపంచంలోనే తొలి పాప్ అప్ డ్యూయెల్ సెల్ఫీ కెమెరాతో స్మార్ట్‌ఫోన్
Vivo V17 Pro: వివో సంచలనం... ప్రపంచంలోనే తొలి పాప్ అప్ డ్యూయెల్ సెల్ఫీ కెమెరాతో స్మార్ట్‌ఫోన్ (image: Vivo)
  • Share this:
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మరో సంచలనానికి తెరతీసింది వివో. ఏకంగా రెండు సెల్ఫీ కెమెరాలతో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. అది కూడా పాప్ అప్ సెల్ఫీ కెమెరా. వివో కొత్తగా రిలీజ్ చేసిన వివో వీ17 ప్రో స్మార్ట్‌ఫోన్‌లోని అద్భుతమైన ఫీచర్ ఇది. వివో వీ సిరీస్‌లోని వివో వీ17 ప్రో గురించి కొంతకాలంగా ఊరిస్తోంది కంపెనీ. ఇండియాలో వివో వీ17 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. రెండు సెల్ఫీ కెమెరాలు, నాలుగు రియర్ కెమెరాలు ఉండటం ఈ ఫోన్ ప్రత్యేకత. అంటే మొత్తం 6 కెమెరాల స్మార్ట్‌ఫోన్ ఇది. 48 మెగాపిక్సెల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. వివో వీ17 ప్రో స్మార్ట్‌ఫోన్‌ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో సెప్టెంబర్ 27న ప్రారంభం అవుతుంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ-బుకింగ్ ప్రారంభమైంది.

వివో వీ17 ప్రో స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6.4 అంగుళాల సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే
ర్యామ్: 8 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128 జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 675
రియర్ కెమెరా: 48+13+8+2 మెగాపిక్సెల్ఫ్రంట్ కెమెరా: 32+8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,100 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 + ఫన్ టచ్ ఓఎస్ 9.1
కలర్స్: మిడ్‌నైట్ ఓషియన్, గ్లేసియర్ ఐస్
ధర:
8 జీబీ + 128 జీబీ- రూ.29,990.

ప్రపంచంలోనే తొలి పాప్ అప్ డ్యూయెల్ సెల్ఫీ కెమెరాతో స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Redmi 8A: షావోమీ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్... రెడ్‌మీ 8ఏ వచ్చేస్తోంది

Amazon Prime: అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ రూ.499... ఎలా పొందాలో తెలుసుకోండి

Amazon: అమెజాన్‌లో స్మార్ట్‌ఫోన్లపై 40% డిస్కౌంట్... ఎస్‌బీఐ నుంచి 10% తగ్గింపు
Published by: Santhosh Kumar S
First published: September 20, 2019, 2:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading