Video: మీ ఫోన్ స్విచ్ఛాఫ్ చేయమంటున్న వివో... గుండెల్ని కదిలించేలా యాడ్

Vivo Smartphone | డిసెంబర్ 22న యాడ్ రిలీజైతే ఈ స్టోరీ ఫైల్ చేసే సమయానికి 36 మిలియన్లు అంటే 3.60 కోట్ల మంది ఈ యాడ్ చూడటం విశేషం.

news18-telugu
Updated: December 24, 2019, 9:17 AM IST
Video: మీ ఫోన్ స్విచ్ఛాఫ్ చేయమంటున్న వివో... గుండెల్ని కదిలించేలా యాడ్
Video: మీ ఫోన్ స్విచ్ఛాఫ్ చేయమంటున్న వివో... గుండెల్ని కదిలించేలా యాడ్ (image: Vivo India)
  • Share this:
మీ స్మార్ట్‌ఫోన్ స్విచ్చాఫ్ చేయండి. ఈ మాట అంటున్నది ఎవరో తెలుసా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో ఇలా అడ్వర్టైజ్‌మెంట్ రిలీజ్ చేసింది. ఇది వివో లేటెస్ట్ బ్రాండ్ ప్రమోషన్. చాలావరకు కంపెనీలు మా ఫోన్ కొనండి... మా ఫోన్‌లో ఆ ఫీచర్లు ఉన్నాయి... ఈ ఫీచర్లు ఉన్నాయి అంటూ తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తుంటాయి. కానీ వివో కాస్త కొత్తగా అడ్వర్టైజ్‌మెంట్ రూపొందించింది. మీ స్మార్ట్‌ఫోన్ స్విచ్చాఫ్ చేయండి అనే మెసేజ్‌తో ఈ యాడ్ రూపొందించింది. స్మార్ట్‌ఫోన్లు మానవ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో కళ్లకు కట్టేలా యాడ్‌లో చూపించింది. ఆమీర్ ఖాన్ నటించిన ఈ యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డిసెంబర్ 22న యాడ్ రిలీజైతే ఈ స్టోరీ ఫైల్ చేసే సమయానికి 36 మిలియన్లు అంటే 3.60 కోట్ల మంది ఈ యాడ్ చూడటం విశేషం. అసలు ఏముంది ఆ యాడ్‌లో? ఎందుకు అంతలా ఆకట్టుకుంది? మీరే ఆ వీడియో చూడండి ఇక్కడ.


స్మార్ట్‌ఫోన్ వచ్చిననాటి నుంచి మనుషుల మధ్య దూరాలు పెరుగుతున్నాయన్న మాట వాస్తవం. మానవ సంబంధాలు బలహీనపడుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌కు అతుక్కుపోయి చుట్టూ ఉన్నవాళ్లని మర్చిపోతున్నారు. ఇంట్లో అందరిమధ్య ఉన్నా ఒంటరిగానే గడుపుతున్నారు. ఈ దృశ్యాలు మనకు ప్రతీచోటా కనిపిస్తాయి. అందుకే కుటుంబం కోసం, భార్యాపిల్లలతో గడిపేందుకు మీ ఫోన్ స్విచ్ఛాఫ్ చేయాలన్న మెసేజ్‌తో వివో రూపొందించిన ఈ యాడ్ ఆకట్టుకుంటోంది. కొత్త సంవత్సర వేడుకలు సమీపిస్తున్న సందర్భంగా వివో ఈ యాడ్ రూపొందించింది. #SwitchOff హ్యాష్ ట్యాగ్‌తో బాగా ప్రమోట్ చేస్తోంది. సో... మీరు కూడా మీ ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఈ న్యూ ఇయర్ వేడుకలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా మీ కుటుంబంతో గడపండి.

Redmi K20 Pro: తక్కువ ధర, అదిరిపోయిన ఫీచర్స్... రెడ్‌మీ కే20, రెడ్‌మీ కే20 ప్రో ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

EPF Withdrawal: మీ ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయండి ఇలాSukanya Samriddhi Rules 2019: సుకన్య సమృద్ధి యోజన రూల్స్ ప్రకటించిన ప్రభుత్వం

IRCTC: సంక్రాంతికి రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు
Published by: Santhosh Kumar S
First published: December 24, 2019, 9:14 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading