హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Vivo Y16 4G: వివో నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. అదిరే ఫీచర్లు దీని సొంతం..

Vivo Y16 4G: వివో నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. అదిరే ఫీచర్లు దీని సొంతం..

Vivo Y16 4G: వివో నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. అదిరే ఫీచర్లు దీని సొంతం..

Vivo Y16 4G: వివో నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. అదిరే ఫీచర్లు దీని సొంతం..

Vivo Y16 4G: వివో వై16 4G ఫోన్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.51-అంగుళాల 720p+ IPS LCD డిస్‌ప్లేతో వస్తుంది. వాటర్‌డ్రాప్ నాచ్‌ డిజైన్ ఇందులో అందించారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో (Vivo) వై-సిరీస్‌లో సరికొత్త మొబైల్స్ (New Mobiles) నిత్యం పరిచయం చేస్తూనే ఉంది. తాజాగా ఈ కంపెనీ చైనాలో వివో వై16 (Vivo Y16) పేరుతో కొత్త Y-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇదొక 4G స్మార్ట్‌ఫోన్ కాగా ఇందులో 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ, మీడియాటెక్ హీలియో ప్రాసెసర్, వాటర్-డ్రాప్ నాచ్ వంటి మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.


సోమవారం నాడు హాంకాంగ్‌లో ఆవిష్కృతమైన Vivo Y16 ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అఫీషియల్ వివో వెబ్‌సైట్ (https://www.vivo.com/hk/en/products/param/y16) ప్రకారం, ఈ ఫోన్ డ్రిజ్లింగ్ గోల్డ్, స్టెల్లార్ బ్లాక్ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ మొబైల్ అక్టోబర్‌లో భారతదేశంలో రూ.14,999 ధరతో లాంచ్ అవుతుందని ఒక నివేదిక తెలిపింది.


* వివో వై16 4G ఫీచర్లు
వివో వై16 4G ఫోన్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.51-అంగుళాల 720p+ IPS LCD డిస్‌ప్లేతో వస్తుంది. వాటర్‌డ్రాప్ నాచ్‌ డిజైన్ ఇందులో అందించారు. 13 MP ప్రైమరీ కెమెరా సెన్సార్, 2 MP సెకండరీ కెమెరా సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా సెటప్ ఆఫర్ చేశారు. స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సైడ్‌లో డ్యూయల్ కెమెరా సెటప్‌ను రింగ్స్ లాంటి రెండు పెద్ద కటౌట్లలో మీరు చూడవచ్చు. ఇక వీడియో కాల్స్‌, సెల్ఫీలకు 5 MP ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.లుక్స్ పరంగా వై16 4జీ (Y16 4G) వివో వై35 (Vivo Y35) వలె కనిపిస్తుంది. కాకపోతే Vivo Y35 గోల్డ్ వేరియంట్‌ ఫోన్ వెనుక స్క్వేర్ కెమెరా మాడ్యూల్‌ బ్లాక్‌గా ఉంటే.. వై16 4జీ గోల్డ్ వేరియంట్‌ వెనుక మాత్రం కెమెరా మాడ్యూల్‌ గోల్డెన్ కలర్‌లోనే ఉంది. ఇవి రెండూ దాదాపు ఒకే సైజు, బరువుతో వస్తున్నాయి. వాటర్‌డ్రాప్ IPS టచ్ డిస్‌ప్లే కూడా అచ్చుగుద్దినట్టు రెండిట్లో ఒకేలాగా ఉన్నాయి.


ఇది కూడా చదవండి : చైనా బడ్జెట్ ఫోన్లపై కేంద్రం కీలక ప్రకటన.. వారికి ఇక పండుగే..


వివో వై16 4G ఫోన్ ఎంట్రీ-లెవల్ MediaTek Helio P35 ప్రాసెసర్ తో నడుస్తుంది. ఇందులో 4 GB RAM + 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు. మైక్రో SD కార్డ్ కోసం డెడికేటెడ్ ఎక్స్‌పాండబుల్ మెమరీ స్లాట్‌ ఆఫర్ చేయడం విశేషం. ఈ ఫోన్ ఎక్స్‌టెండ్ ర్యామ్ 2.0కి సైతం సపోర్ట్ ఇస్తుంది.


దీనివల్ల యూజర్లు 1 GB ఎడిషనల్ RAMని పొందవచ్చు. ముందుగా చెప్పుకున్నట్లు డ్రిజ్లింగ్ గోల్డ్, స్టెల్లార్ బ్లాక్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులోకి వస్తుంది. ఫోన్‌ బరువు 183గ్రాములు కాగా పాలికార్బోనేట్ ఫ్రేమ్‌తో రానుంది. ఇది ఆండ్రాయిడ్ 12-ఆధారిత Funtouch OS 12పై రన్ అవుతుంది. ఫోన్ 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB టైప్ C కోసం ప్రత్యేక పోర్ట్‌, బ్లూటూత్ 5.0, GPS, Wi-Fi, 4G LTE వంటి కనెక్టివిటీ ఫీచర్లను ఆఫర్ చేస్తోంది.

First published:

Tags: Smartphones, Tech news, Vivo

ఉత్తమ కథలు