Vivo Y3s: వివో నుంచి రూ.10,000 లోపు స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే

Vivo Y3s: వివో నుంచి రూ.10,000 లోపు స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే (image: Vivo India)

Vivo Y3s | మీరు రూ.10,000 లోపు స్మార్ట్‌ఫోన్ (Smartphone under Rs 10,000) కొనాలనుకుంటున్నారా? వివో నుంచి వివో వై3ఎస్ స్మార్ట్‌ఫోన్ లాంఛ్ అయింది. స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తెలుసుకోండి.

  • Share this:
    తక్కువ బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. వివో నుంచి రూ.10,000 లోపు బడ్జెట్‌లో (Smartphone under Rs 10,000) కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. వివో వై3ఎస్ (Vivo Y3s) స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో రిలీజ్ చేసింది వివో. బేసిక్ స్మార్ట్‌ఫోన్ కోరుకునేవారికి ఈ స్మార్ట్‌ఫోన్ ఉపయోగపడుతుంది. వివో వై3ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. వివో వై3ఎస్ ధర రూ.9,490. ఇక ఇప్పటికే ఇండియన్ మార్కెట్‌లో రూ.10,000 లోపు బడ్జెట్‌లో మోటో ఇ40 (Moto e40), పోకో సీ31 (Poco C31), రెడ్‌మీ 9 ప్రైమ్ (Redmi 9 Prime), రియల్‌మీ నార్జో 50ఐ (Realme Narzo 50i), మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 (Micromax IN Note 1) లాంటి మోడల్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్లకు వివో వై3ఎస్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

    Poco F3 GT: తొలిసారి ఆఫర్‌లో పోకో ఎఫ్3 జీటీ... రూ.28,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.12,000 లోపే కొనండి ఇలా

    వివో ఇండియా ఇ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, టాటా క్లిక్, పేటీఎం, బజాజ్ ఫిన్‌సర్వ్ ఈఎంఐ స్టోర్, ఇతర రీటైల్ స్టోర్లలో కొనొచ్చు. మూడు నెలల నో-కాస్ట్ ఈఎంఐ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. వివో ఇండియా ఇ-స్టోర్‌లో వివో వై3ఎస్ సేల్ ప్రారంభమైంది. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.

    వివో వై3ఎస్ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఈ స్మార్ట్‌ఫోన్ 2జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో రిలీజ్ అయింది. మైక్రోఎస్‌డీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో వాటర్ డ్రాప్ నాచ్‌తో 6.51 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

    Realme GT Neo 2: రూ.31,000 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.9,999 ధరకే కొనండి ఇలా... ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్

    వివో వై3ఎస్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 గ్రో ఎడిషన్ + ఫన్‌టచ్ ఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 19 గంటల పాటు ఆన్‌లైన్ హెచ్‌డీ మూవీ చూడొచ్చని, 8 గంటలు గేమ్స్ ఆడొచ్చని కంపెనీ చెబుతోంది. ఈ వివో వై3ఎస్ స్మార్ట్‌ఫోన్‌కు రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం విశేషం. ఫేస్ అన్‌లాక్, డ్యూయెల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ 2.0 పోర్ట్, జీపీఎస్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

    వివో వై3ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో వెనుకవైపు 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటే, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కెమెరాలో బ్యూటీ మోడ్, టైమ్ ల్యాప్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. వివో వై3ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను స్టారీ బ్లూ, మింట్ గ్రీన్, పెరల్ వైట్ కలర్స్‌లో కొనొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published: