Home /News /technology /

Vivo Offer: కొత్త ఫోన్ కొనాలా? కేవలం రూ.101 చెల్లించి ఈ స్మార్ట్‌ఫోన్స్ సొంతం చేసుకోవచ్చు

Vivo Offer: కొత్త ఫోన్ కొనాలా? కేవలం రూ.101 చెల్లించి ఈ స్మార్ట్‌ఫోన్స్ సొంతం చేసుకోవచ్చు

Vivo Offer: కొత్త ఫోన్ కొనాలా? కేవలం రూ.101 చెల్లించి ఈ స్మార్ట్‌ఫోన్స్ సొంతం చేసుకోవచ్చు
(image: Vivo India)

Vivo Offer: కొత్త ఫోన్ కొనాలా? కేవలం రూ.101 చెల్లించి ఈ స్మార్ట్‌ఫోన్స్ సొంతం చేసుకోవచ్చు (image: Vivo India)

Vivo Offer | వివో ఇండియా ఫెస్టివల్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.101 చెల్లించి వివో స్మార్ట్‌ఫోన్లను (Vivo Smartphones) కొనే అవకాశం కల్పిస్తోంది కంపెనీ. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.

    దీపావళి ఫెస్టివల్ ఆఫర్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ (New Smartphone) కొనాలనుకుంటున్నారా? ఇప్పటికిప్పుడు కొత్త మొబైల్ కొనడానికి కావాల్సినన్ని డబ్బులు లేవా? కేవలం రూ.101 చెల్లించి వివో స్మార్ట్‌ఫోన్స్ (Vivo Smartphone) సొంతం చేసుకోవచ్చు. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ఈ ఆఫర్ ప్రకటించింది వివో. వివో ఎక్స్70 సిరీస్, వివో వీ21 మోడల్స్, వివో వై73, వివో వై33ఎస్ లాంటి మోడల్స్‌పై ఈ ఆఫర్ ప్రకటించింది వివో ఇండియా. కేవలం రూ.101 ధరకే స్మార్ట్‌ఫోన్ అందించేందుకు బజాజ్ ఫైనాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది వివో. ఈ ఆఫర్ నవంబర్ 9 వరకు అందుబాటులో ఉంటుంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై 10 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. వైన్ టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఆఫర్ కూడా ఉంది. దీంతో పాటు జియో నుంచి రూ.10,000 వరకు బెనిఫిట్స్ లభిస్తాయి.

    Google Pixel 4A: ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,000 తగ్గింది... ఎస్‌బీఐ కార్డుతో మరో 10 శాతం డిస్కౌంట్



    వివో ఎక్స్70 సిరీస్ స్మార్ట్‌ఫోన్ కొంటే 10 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. సిటీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కస్టమర్లు ఈ క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. వన్ టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్, జెస్ట్ మనీ ఈఎంఐ నుంచి ఒక ఏడాది ఎక్స్‌టెండెడ్ వారెంటీ, జియో నుంచి రూ.10,000 విలువైన బెనిఫిట్స్ లభిస్తాయి. వివో ఎక్స్70 ప్రో స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.46,990 కాగా, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,990. హైఎండ్ వేరియంట్ ధర 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.52,990. ఇక వివో ఎక్స్70 ప్రో+ స్మార్ట్‌ఫోన్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.79,990.

    Flipkart Big Diwali Sale: రూ.10,000 లోపు స్మార్ట్‌ఫోన్ కొనాలా? ఇవే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

    వివో వై73 స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,990. వివో వై33ఎస్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ రూ.18,990. వివో వీ21 ధర రూ.29,990, వివో వీ21ఈ ధర రూ.24,990. ఈ స్మార్ట్‌ఫోన్లు కొంటే రూ.2,500 క్యాష్‌బ్యాక్ ప్రకటించింది వివో. ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్‌డీబీ ఫైనాన్స్ కార్డులపై ఈ ఆఫర్ వర్తిస్తుంది.

    కస్టమర్లు ఈ మొబైల్స్‌ని కేవలం రూ.101 చెల్లించి సొంతం చేసుకోవచ్చు. ఆ తర్వాత మిగతా మొత్తాన్ని ఈఎంఐ ద్వారా చెల్లించాలి. వివో ఇండియా స్టోర్, ఇ-కామర్స్ వెబ్‌సైట్స్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఈ ఆఫర్స్ పొందొచ్చు. ఈ ఆఫర్స్ నవంబర్ 7 వరకే లభిస్తాయి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: 5G Smartphone, Diwali 2021, Mobile News, Mobiles, Smartphone, Vivo

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు