హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Vivo V19: ఈ ఫోన్ ధర రూ.4,000 తగ్గింది... ఇప్పుడు ఎంతంటే

Vivo V19: ఈ ఫోన్ ధర రూ.4,000 తగ్గింది... ఇప్పుడు ఎంతంటే

Vivo V19: ఈ ఫోన్ ధర రూ.4,000 తగ్గింది... ఇప్పుడు ఎంతంటే
(image: Vivo India)

Vivo V19: ఈ ఫోన్ ధర రూ.4,000 తగ్గింది... ఇప్పుడు ఎంతంటే (image: Vivo India)

Vivo V19 | మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? రెండు నెలల క్రితం రిలీజైన వివో వీ19 ధర రూ.4,000 తగ్గింది. లేటెస్ట్ ధరతో పాటు స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

  వివో నుంచి ఇటీవల రిలీజైన వివో వీ19 స్మార్ట్‌ఫోన్ ధర ఏకంగా రూ.4,000 తగ్గింది. ఈ ఏడాది మేలో వివో వీ19 స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది కంపెనీ. రిలీజ్ చేసినప్పుడు 8జీబీ+256జీబీ ధర రూ.31,990. కానీ ఇప్పుడు ఈ ఫోన్ ధరను రూ.4,000 తగ్గించింది. ప్రస్తుతం రూ.27,990 ధరకే కొనొచ్చు. ఇక మరో వేరియం 8జీబీ+128జీబీ ధర రూ.27,990 ఉండేది. ఈ వేరియంట్ ధర రూ.3,000 తగ్గింది. ప్రస్తుత ధర రూ.24,990. అమెజాన్, ఫ్లిప్‌కర్ట్ ప్లాట్‌ఫామ్స్‌తో పాటు వివో ఇ-స్టోర్‌లో వివో వీ19 స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. వివో వీ19 స్మార్ట్‌ఫోన్‌లో పంచ్ హోల్ డ్యూయెల్ సెల్ఫీ కెమెరా, వెనుక వైపు క్వాడ్ కెమెరా, ఇన్‌డిస్‌ఫ్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 33 వాట్ వివో ఫ్లాష్‌ఛార్జ్ 2.0 సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి.

  Samsung Galaxy M31s: భారీ బ్యాటరీతో సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ రిలీజ్... ధర ఎంతో తెలుసా?

  WhatsApp: వాట్సప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్... ఇక ఆ చికాకు లేనట్టే

  వివో వీ19 స్పెసిఫికేషన్స్

  డిస్‌ప్లే: 6.44 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే

  ర్యామ్: 8 జీబీ

  ఇంటర్నల్ స్టోరేజ్: 128 జీబీ, 256 జీబీ

  ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 712

  రియర్ కెమెరా: 48+8+2+2 మెగాపిక్సెల్

  ఫ్రంట్ కెమెరా: 32+8 మెగాపిక్సెల్

  బ్యాటరీ: 4,500 ఎంఏహెచ్

  ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10

  సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్

  కలర్స్: పియానో బ్లాక్, మిస్టిక్ సిల్వర్

  ధర:

  8జీబీ+128జీబీ- రూ.24,990

  8జీబీ+256జీబీ- రూ.27,990

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Android 10, Smartphone, Vivo

  ఉత్తమ కథలు