హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Free Laptops: ఉచిత ల్యాప్‌టాప్స్‌ అంటూ లింక్.. పొరపాటున ఓపెన్ చేశారంటే అంతే సంగతులు..!

Free Laptops: ఉచిత ల్యాప్‌టాప్స్‌ అంటూ లింక్.. పొరపాటున ఓపెన్ చేశారంటే అంతే సంగతులు..!

ఉచిత  ల్యాప్‌టాప్స్‌ అంటూ వైరల్ .. పొరపాటున ఓపెన్ చేశారంటే అంతే సంగతులు..!

ఉచిత ల్యాప్‌టాప్స్‌ అంటూ వైరల్ .. పొరపాటున ఓపెన్ చేశారంటే అంతే సంగతులు..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక మెసేజ్ విపరీతంగా చక్కర్లు కొడుతోంది. భారత ప్రభుత్వ విద్యా శాఖ విద్యార్థులకు 5 లక్షల ల్యాప్‌టాప్స్‌ (Laptops) ఉచితంగా అందజేస్తోందనేది ఆ మెసేజ్ సారాంశం. అప్లై ఆన్‌లైన్ (Apply Online) అనే లింక్‌తో కూడిన ఈ మెసేజ్ నిజమో కాదో తెలుసుకోవడం కొందరికి అసాధ్యంగా మారింది.

ఇంకా చదవండి ...

ప్రస్తుతం సోషల్ మీడియా(Social media)లో ఒక మెసేజ్ విపరీతంగా చక్కర్లు కొడుతోంది. భారత ప్రభుత్వ విద్యా శాఖ విద్యార్థులకు 5 లక్షల ల్యాప్‌టాప్స్‌ (Laptops) ఉచితంగా అందజేస్తోందనేది ఆ మెసేజ్ సారాంశం. అప్లై ఆన్‌లైన్ (Apply Online) అనే లింక్‌తో కూడిన ఈ మెసేజ్ నిజమో కాదో తెలుసుకోవడం కొందరికి అసాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) నిజ-నిర్ధారణ (Fact-checking) విభాగం ఈ ప్రకటనపై స్పందించింది. ఫ్రీ ల్యాప్‌టాప్ స్కీమ్ అని వైరల్ అవుతున్న ఈ టెక్స్ట్ మెసేజ్ పూర్తిగా ఫేక్ అని.. అలాంటి స్కీమ్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టలేదని వెల్లడించింది.

తాజాగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ డిపార్ట్‌మెంట్‌ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వైరల్ పోస్ట్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ ఇది ఫేక్ అని తెలిపింది. "భారత విద్యా మంత్రిత్వ శాఖ 5,00,000 మంది విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లను అందజేస్తోందని పేర్కొంటూ వెబ్‌సైట్ లింక్‌తో కూడిన టెక్స్ట్ మెసేజ్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. సర్క్యులేట్ అవుతున్న ఈ లింక్ ఫేక్. ప్రభుత్వం అలాంటి పథకం అమలు చేయడం లేదు." అని PIB క్లారిటీ ఇచ్చింది. టెక్నాలజీ వాడకం బాగా పెరిగిన ఈ రోజుల్లో ప్రభుత్వం కొన్ని పథకాలను డిజిటల్ పద్ధతిలోనే ప్రజలకు చేరువ చేస్తోంది. సైబర్ నేరగాళ్లు దీన్ని ఆసరాగా చేసుకొని ప్రభుత్వం ప్రారంభించని పథకాల గురించి ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తూ అమాయకులను మోసగిస్తున్నారు.

ఇదీ చదవండి:  Sexual Health: శృంగారం కోసం ఈ మందులు వాడుతున్నారా ? అంతే సంగతులు .. ఎలాంటి నష్టాలు ఉంటాయంటే..?

సైబర్(Cyber) కేటుగాళ్లు ప్రజల వ్యక్తిగత విషయాలను తస్కరించేందుకు ఫ్రీ ల్యాప్‌టాప్ స్కీమ్ అంటూ ఓ మెసేజ్‌ను సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ పథకానికి అర్హతను చెక్ చేయడానికి (Check Eligibility) ఓ లింక్‌ను ఓపెన్ చేయాలని కోరుతున్నారు. ఇది ఫేక్ అని గుర్తించకుండా లింక్ పై క్లిక్ చేసి వివరాలను అందిస్తే నిండా మోసపోయినట్లే అవుతుంది. యూజర్ల వ్యక్తిగత వివరాలను ఫిషింగ్ టెక్నాలజీతో కొల్లగొట్టేందుకు కూడా ఇది ఒక వల కూడా అవ్వచ్చు. అందుకే ఉచితంగా ప్రభుత్వం ల్యాప్‌టాప్‌లను అందిస్తోందని చెప్పే మెసేజ్ లోని ఎలాంటి లింక్స్ క్లిక్ చేయకూడదని హెచ్చరించింది.

సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ ప్రచారం జరగడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది ఆగస్టులో కూడా ఇలాంటి ఒక ఫేక్ మెసేజ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. PIB ఫాక్ట్ చెక్ ఈ వార్త కూడా నకిలీదని, మోసపోకండి అని అప్పుడు ప్రజలను హెచ్చరించింది. ఇలాంటి ఫేక్ మెసేజెస్ వల్ల అమాయకులు మోసపోయే ప్రమాదం ఉంది. ఇలాంటివి ఎక్కువగా ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా చాలా మందికి షేర్ అవుతుంటాయి. అయితే నిజ నిజాలు ఏమిటో తెలుసుకోకుండా యూజర్లు మెసేజ్‌లను ఇతరులకు షేర్ చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటివి షేర్ చేయడం వల్ల ఎక్కువ మంది మోసపోయే అవకాశం ఉంది.

Published by:Mahesh
First published:

Tags: Fact Check, Laptops, Social Media, VIRAL NEWS

ఉత్తమ కథలు