హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Location Sharing: ఇన్‌స్టాగ్రామ్ వాడితే మీ లొకేషన్‌ అందరికీ తెలుస్తుందా..? కంపెనీ రెస్పాన్స్ ఇదే..

Location Sharing: ఇన్‌స్టాగ్రామ్ వాడితే మీ లొకేషన్‌ అందరికీ తెలుస్తుందా..? కంపెనీ రెస్పాన్స్ ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇన్‌స్టాగ్రామ్ లేటెస్ట్ అప్‌డేట్‌తో ఫోన్ లొకేషన్ దానంతట అదే ఆన్‌ పోతుందని కొన్ని పోస్టులు వైరల్‌గా మారాయి. అయితే ఈ పుకార్లను ఇన్‌స్టాగ్రామ్ కొట్టిపారేసింది. తమ యూజర్ల ఎగ్జాక్ట్ లొకేషన్ షేర్ చేయమని స్పష్టం చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Location Sharing : సోషల్ మీడియా సైట్స్‌లో పోస్టులను షేర్ చేసేటప్పుడు లొకేషన్ ట్యాగ్(Location Tag) చేసే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే బైడిఫాల్ట్‌గా ఈ లొకేషన్ ఇన్ఫో అనేది మరీ కచ్చితంగా ఉండదు. ఈ లొకేషన్ సమీపంలోని ఏదైనా పబ్లిక్ ప్రదేశానికి దగ్గరగా ఉంటుంది. కానీ లేటెస్ట్ iOS అప్‌డేట్ లేదా ఇన్‌స్టాగ్రామ్(Instagram) అప్‌డేట్ వల్ల యూజర్ల "కచ్చితమైన లొకేషన్ (Precise Location)" అందరికీ తెలిసిపోతుందని.. దీనివల్ల వారికి ప్రమాదం వాటిల్లుతోందని తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. లేటెస్ట్ iOS అప్‌డేట్ లేదా ఇన్‌స్టాగ్రామ్ అప్‌డేట్ వల్ల ఫోన్‌లో కచ్చితమైన లొకేషన్ దానంతట అదే ఆన్‌ పోతుందని, తద్వారా వారు దొంగలు, నేరస్థుల బారిన పడే ప్రమాదం పెరుగుతుందని కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. వీటిలో కొన్ని పోస్టులు వైరల్‌గా మారాయి. అయితే ఈ పుకార్లను ఇన్‌స్టాగ్రామ్ కొట్టిపారేసింది. తమ యూజర్ల ఎగ్జాక్ట్ లొకేషన్ షేర్ చేయమని ఇన్‌స్టాగ్రామ్ స్పష్టం చేసింది.


ఇన్‌స్టాగ్రామ్ తన ట్విటర్ అఫీషియల్ అకౌంట్ ద్వారా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక పుకారుపై స్పందించింది. "మేం మీ లొకేషన్ ఇతరులతో షేర్ చేయం. పబ్లిక్‌గా కూడా ఉంచం. ఇతర సోషల్ మీడియా కంపెనీల మాదిరిగానే.. లొకేషన్ ట్యాగ్స్‌, మ్యాప్‌ వంటి ఫీచర్ల కోసం కచ్చితమైన లొకేషన్ ఉపయోగిస్తాం. యూజర్లు తమ డివైజ్ సెట్టింగ్స్‌ ద్వారా లొకేషన్ సర్వీసులను మేనేజ్ చేయవచ్చు. ఆ సమాచారాన్ని షేర్ చేయాలనుకుంటే వారి పోస్ట్‌లలో లొకేషన్లను ట్యాగ్ చేయవచ్చు." అని ఇన్‌స్టాగ్రామ్ వెల్లడించింది.


ఏం మాయ చేశాడో : నావాడంటే నావాడంటూ ప్రియుడి కోసం బస్టాండ్ లోనే కొట్టుకున్న ఇద్దరమ్మాయిలు


కచ్చితమైన లొకేషన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇతరులకు తెలిసిపోతుందని మొదటగా బ్రాండ్‌లు, బిజినెస్ కోచ్‌లు పోస్ట్‌లు చేశారు. ఆపై ఇన్‌ఫ్లూయన్సర్లు ఆ ప్రచారాన్ని మరింత వైరల్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఐఫోన్ "కచ్చితమైన లొకేషన్" ఫీచర్‌ ద్వారా యూజర్లు కచ్చితంగా ఎక్కడ ఉన్నారో అందరికీ షేర్ చేస్తుందనేది ఆ పోస్టుల సారాంశం. "కొత్త అప్‌డేట్ నుంచి కొందరు దొంగలు, నేరగాళ్లు ఇన్‌స్టాగ్రామ్ నుంచి యూజర్ల కచ్చితమైన లొకేషన్‌ను కనుగొనగలరు. దొంగతనం, వెంబడించడం మొదలైన నేరాలకు పాల్పడానికి వ్యక్తులు దీనిని ఉపయోగిస్తున్నారు" అని ఆ వైరల్ పోస్టులు పేర్కొన్నాయి.అయితే కచ్చితమైన లొకేషన్ ఫీచర్ అనేది కొత్తది కాదు. యాపిల్ దీన్ని 2020లోనే తీసుకొచ్చింది. గూగుల్ దీన్ని ఆండ్రాయిడ్ 12తో ప్రారంభించింది. యూజర్లు స్టెప్-బై-స్టెప్ డైరెక్షన్స్ పొందాలనుకున్నప్పుడు లేదా వారు ఏదైనా రెస్టారెంట్‌ను సూచించాలని అకున్నప్పుడు కచ్చితమైన లొకేషన్ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇక సోషల్ మీడియా యాప్‌లు ఈ ఫీచర్‌ సాయంతో యూజర్లు తమ పోస్ట్‌లలో లొకేషన్ ట్యాగ్ చేయడానికి వారికి మరింత సంబంధిత లొకేషన్లను యాప్స్ అందిస్తాయి. తమ లొకేషన్ ఎవరికీ తెలియకూడదు అనుకునేవారు ఫోన్‌లలో సెట్టింగ్స్‌ మార్చడానికి ఒక ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. ఆ ఆప్షన్‌తో కొన్ని యాప్‌లు తమ ఇంచుమించు లొకేషన్‌ను మాత్రమే ఇతరులకు కనిపించేలా ఎంచుకోవచ్చు. అయితే గూగుల్ మ్యాప్స్, ఉబెర్ వంటి యాప్‌ల కోసం కచ్చితమైన లొకేషన్‌ను ఆఫ్ చేయడం వల్ల ఆ సర్వీస్‌ల్లో సమస్యలు ఎదురుకావచ్చు.


Published by:Venkaiah Naidu
First published:

Tags: Instagram, Location

ఉత్తమ కథలు