హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

ViewSonic: హోమ్‌, ఆఫీస్‌ల కోసం వ్యూసోనిక్‌ బడ్జెట్‌ మానిటర్లు.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే..!

ViewSonic: హోమ్‌, ఆఫీస్‌ల కోసం వ్యూసోనిక్‌ బడ్జెట్‌ మానిటర్లు.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మానిటర్లు, ప్రొజెక్టర్ల తయారీలో ప్రసిద్ధి చెందిన వ్యూసోనిక్‌ సంస్థ ఇండియన్‌ మార్కెట్‌లోకి తమ రెండు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. ఇళ్లు, ఆఫీసుల్లో వినియోగించుకొనేలా అత్యాధునిక ఫీచర్లతో రెండు బడ్జెట్‌ మానిటర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇంకా చదవండి ...

మానిటర్లు(Monitors), ప్రొజెక్టర్ల(Projectors) తయారీలో ప్రసిద్ధి చెందిన వ్యూసోనిక్‌ సంస్థ ఇండియన్‌ మార్కెట్‌లోకి(Indian Market) తమ రెండు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. ఇళ్లు, ఆఫీసుల్లో(Offices) వినియోగించుకొనేలా అత్యాధునిక ఫీచర్లతో రెండు బడ్జెట్‌ మానిటర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. VA2210-MH, VA2205-MH మానిటర్లు వినియోగదారులకు కచ్చితంగా నచ్చుతాయని వ్యూసోనిక్‌ చెబుతోంది. VA2210-MH, VA2205-MH అనే బడ్జెట్ హోమ్, ఆఫీస్ మానిటర్‌లను కొత్తగా విడుదల చేసింది. మానిటర్లు, ప్రొజెక్టర్‌(Projectors)ల తయారీకి వ్యూసోనిక్‌ సంస్థ ప్రసిద్ధి చెందింది. స్లిమ్ బెజెల్స్‌, ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్‌తో రూపొందించిన కొత్త డిస్‌ప్లేలు ఆధునిక కార్యాలయాలకు అనువుగా ఉంటాయని సంస్థ చెబుతోంది. అంతేకాకుండా VA2210-MH, VA2205-MH మానిటర్‌లకు ఇన్‌బిల్ట్‌ డ్యుయల్‌ స్పీకర్ సెటప్‌ ఇస్తున్నారు. వీటి ద్వారా ఎంటర్‌ట్రైన్‌మెంట్‌ కంటెంట్‌ను చక్కగా ఎంజాయ్‌ చేయవచ్చని చెబుతోంది.

ఈ రెండు మానిటర్‌లకు HDMI, VGA పోర్ట్‌ల కనెక్టివిటీ ఆప్షన్‌ కూడా ఉంది. ViewSonic VA2205-MH మానిటర్‌ హై కాంట్రాస్ట్‌ ప్యానల్‌ ద్వారా స్పష్టమైన ఇమేజ్‌లను చూడవచ్చు. ఇది హోల్‌ సమ్‌ వ్యూయింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. అదే విధంగా VA2210-MH మానిటర్‌ IPS డిస్‌ప్లే టెక్నాలజీ ద్వారా మరింత కలర్‌ అక్యురసీ, వైడర్‌ వ్యూయింగ్‌ యాంగిల్స్‌ అందిస్తోంది.

Interest Rates: కొత్త ఆర్థిక సంవత్సరంలో PPF, NSC వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి.. ఇతర పథకాల వడ్డీ రేట్లను పరిశీలించండి..


ఇండియాలో వ్యూసోనిక్‌ VA2210-MH, VA2205-MH మానిటర్ల ధరలు

వ్యూసోనిక్‌ VA2210-MH మానిటర్ ఎంఆర్‌పీ ధర భారతదేశంలో రూ. 17,500గా, ఎమ్‌ఓపీ ధర రూ. 12,950గా ఉంది. వ్యూసోనిక్‌ VA2205-MH మానిటర్ ఎంఆర్‌పీ రూ.16,300గా, ఎమ్‌ఓపీ రూ.12,250తో అందుబాటులో ఉంది. భారతదేశంలోని అన్ని ఐటీ రిటైల్ అవుట్‌లెట్‌లలో ఈ రెండూ మానిటర్‌లను కొనుగోలు చేయవచ్చు.

వ్యూసోనిక్ VA2210-MH, VA2205-MH స్పెసిఫికేషన్‌లు

వ్యూసోనిక్‌ VA2210-MH, VA2205-MH మానిటర్లు రెండూ డిజైన్ పరంగా ఒకేలా కనిపిస్తాయి. రెండు మానిటర్లలో IPS టెక్నాలజీతో పని చేసే 22 అంగుళాల స్క్రీన్‌ అందుబాటులో ఉంది. IPS సిబ్లింగ్‌ ఫీచర్‌ VA డిస్ప్లే టెక్నాలజీని కలిగి ఉంది. రెండు వ్యూసోనిక్ డిస్‌ప్లేలు వెసా మౌంట్‌లకు కూడా అనుకూలంగా ఉంటాయి. ఎక్కువ సేపు మానిటర్లను చూసినా కళ్లకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బంది కలగకుండా 220 ఇంచెస్‌ స్క్రీన్‌లు ఐ కేర్ టెక్నాలజీతో అందుబాటులో ఉన్నాయి.

ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కువ కాలం చూసేందుకు వీలు కల్పిస్తాయి. వివిధ రకాల అప్లికేషన్లను వినియోగించే సమయంలో ఆప్టిమైజ్డ్‌ స్క్రీన్‌ పెర్‌ఫార్మెన్స్‌ పొందేలా వ్యూసోనిక్‌ వ్యూమోడ్‌ ఫంక్షన్‌ను పొందుపరిచారు. ఇతర ప్రధాన ఫీచర్లు ఎనర్జీ సేవింగ్‌ ఎకో మోడ్‌, HDMI పోర్ట్, బడ్జెట్ మానిటర్‌లలో చాలా ప్రామాణికమైన 60Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ఈ నెల ప్రారంభంలో ViewSonic తన మొదటి ఎక్స్‌పీరియన్స్ జోన్‌ను న్యూ ఢిల్లీలో ఆవిష్కరించింది. వినియోగదారులకు ఆకర్షణీయమైన, లీనమయ్యే అనుభవాన్ని అందించడానికి.. దాని అన్ని AV, IT ఉత్పత్తులు, సేవలను యాక్సెస్‌ చేసుకొనే సదుపాయం కల్పించింది.

Published by:Veera Babu
First published:

Tags: Budget, Features, Monitors, Projectors

ఉత్తమ కథలు