వాట్సప్... ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్. వాట్సప్ తమ యూజర్లకు ఎప్పుడూ కొత్తకొత్త ఫీచర్స్ అందిస్తూ ఉంటుంది. ఇటీవల కొన్ని కొత్త ఫీచర్స్‌ని రిలీజ్ చేసింది. మరిన్ని ఫీచర్స్‌ని రూపొందిస్తోంది. ఇక ఇటీవల రిలీజ్ చేసిన వాటిలో ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. యూజర్లు చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్స్ ఇప్పుడు వచ్చేశాయి. మరి ఆ ఫీచర్స్ గురించి మీకు తెలుసా? వాట్సప్ లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన కొత్త ఫీచర్స్ మీరు వాడుకుంటున్నారా? వాట్సప్ కొత్తగా రిలీజ్ చేసిన ఫీచర్స్‌లో ఆసక్తికరంగా ఏం ఉన్నాయి? ఆ ఫీచర్స్‌ని ఎలా ఉపయోగించాలి? తెలుసుకోండి.
View Once: వ్యూ వన్స్ ఫీచర్ స్నాప్‌చాట్‌లో బాగా పాపులర్. మీరు వాట్సప్‌లో ఏదైనా వీడియో లేదా ఫోటో పంపిస్తే అవతలివాళ్లు డౌన్‌లోడ్ చేసుకొని చూడాలి. అలా డౌన్‌లోడ్ చేసిన ఫైల్స్ కుప్పలుతెప్పలుగా వాట్సప్‌లో ఉంటాయి. వాటిని డిలిట్ చేయడానికి ప్రత్యేకంగా టైమ్ కేటాయించాల్సి వస్తుంది. ఈ సమస్యల్ని దృష్టిలో పెట్టుకున్న వాట్సప్ వ్యూ వన్స్ ఫీచర్ తీసుకొచ్చింది. మీరు ఈ ఫీచర్ ద్వారా ఏదైనా వీడియో, ఫోటో పంపిస్తే అవతలివాళ్లు ఒకసారి మాత్రమే ఆ ఫైల్ చూడొచ్చు. ఆ తర్వాత ఆ ఫైల్ ఆటోమెటిక్‌గా డిలిట్ అవుతుంది.
Realme X7 Max 5G: రూ.26,999 విలువైన ఈ స్మార్ట్‌ఫోన్ రూ.9,999 ధరకే కొనండి ఇలా
Smartphone: రూ.10,000 లోపు స్మార్ట్‌ఫోన్ కొనాలా? 5 బెస్ట్ మోడల్స్ ఇవే
Chat Transfer: ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ నుంచి యాపిల్ స్మార్ట్‌ఫోన్‌లోకి గతంలో వాట్సప్ ఛాట్స్ ట్రాన్స్‌ఫర్ చేయడం సాధ్యం కాదు. ఇప్పుడు ఆండ్రాయిడ్ నుంచి ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్లకు, ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్ల నుంచి ఆండ్రాయిడ్ మొబైల్స్‌కి వాట్సప్ ఛాట్స్ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.
Multi-Device Support: గతంలో ఒక వాట్సప్ అకౌంట్‌ను ఒక డివైజ్‌లో మాత్రమే వాడుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఒకే వాట్సప్ అకౌంట్‌ను ఎన్ని డివైజ్‌లలో అయినా ఉపయోగించుకోవచ్చు. మీ వాట్సప్ అకౌంట్‌ను స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్‌లో ఒకేసారి ఉపయోగించొచ్చు.
Paytm Cashback: పేటీఎం కొత్త ఆఫర్... కరెంట్ బిల్ కడితే క్యాష్‌బ్యాక్
BSNL Plan: బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్... ఒకసారి రీఛార్జ్ చేస్తే 365 రోజులు డేటా
Joinable Calls: ఇక వాట్సప్‌లో జాయినబుల్ కాల్స్ పేరుతో మరో ఫీచర్ వచ్చింది. గ్రూప్ కాల్స్ మిస్ అయినవారు మళ్లీ ఆ గ్రూప్ కాల్స్‌లో చేరేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
Payments: వాట్సప్ పేమెంట్స్‌లో కొత్తగా థీమ్స్‌ని తీసుకొచ్చింది వాట్సప్. మీరు ఎవరికైనా రెగ్యులర్‌గా పేమెంట్స్ చేస్తే ఆ పేమెంట్స్‌కి థీమ్ సెట్ చేసుకోవచ్చు.
Voice Message: వాట్సప్‌లో పంపే వాయిస్ మెసేజెస్‌ని ప్లే బ్యాక్ స్పీడ్‌తో వినొచ్చు. 1.5x, 2x స్పీడ్ సెట్ చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Whatsapp