Vodafone Idea: కొత్త ప్లాన్లను విడుదల చేసిన వీఐ.. రూ.701, రూ.901 ప్లాన్లతో ఎన్నో ప్రయోజనాలు

(ప్రతీకాత్మక చిత్రం)

వొడాఫోన్‌-ఇండియా(వీఐ) తమ యూజర్లకు ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తగా రూ.701, రూ.901 డిస్నీ ప్లస్ హాట్‌స

  • Share this:
భారత టెలికాం సంస్థలు డేటా ప్లాన్లతో వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంల సబ్‌స్క్రిప్షన్‌లను ఉచితంగా అందిస్తున్నాయి. ధర ఎక్కువగా ఉండే రీఛార్జ్ ప్లాన్లతో ఇలాంటి ఆఫర్లు అందిస్తున్నాయి. ఈ క్రమంలో వొడాఫోన్‌-ఇండియా(వీఐ) తమ యూజర్లకు ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తగా రూ.701, రూ.901 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ రీఛార్జ్ ప్లాన్‌లు లాంచ్ చేసిన వీఐ.. వీటితో అదిరిపోయే బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ రెండు రీఛార్జ్ ప్లాన్‌లతో ఇకపై యూజర్లు 3జీబీ డేటా, డిస్నీ+హాట్‌స్టార్ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌, అపరిమిత వాయిస్ కాల్‌లతో సహా మరెన్నో ఆఫర్స్ పొందొచ్చు.

కొత్తగా ప్రారంభించిన రూ.701, రూ.901 ప్లాన్‌లు రోజుకు 3GB డేటా, వారాంతపు డేటా రోల్‌ఓవర్(data rollover), రాత్రంతా (12 AM-6 AM వరకు) అదనపు ఖర్చు లేకుండా ఇంటర్నెట్ ఉచితంగా అందిస్తాయి. అంతేకాదు, వీఐ మూవీస్, వీఐ టీవీలలోని ప్రీమియం సినిమాలను, ఒరిజినల్స్, లైవ్ టీవీ, వార్తలు ఉచితంగా యాక్సెస్ చేయొచ్చు. ఈ కొత్త ప్లాన్స్ జియో ఎయిర్‌టెల్ ప్యాక్‌లకు పోటీగా అందుబాటులోకి వచ్చాయి.

వీఐ రూ. 701 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్లాన్:
రూ. 701 ప్యాక్ రోజుకు 3GB డేటా, రోజుకు 100 SMS, ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత కాలింగ్ అందిస్తుంది. ఈ ప్యాక్ వాలిడిటీ 56 రోజులు. ఈ ప్లాన్ లో వారాంతపు డేటా రోల్‌ఓవర్ కూడా లభిస్తుంది. అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకూ యూజర్లు వాడకుండా మిగిలిపోయిన డైలీ డేటా శని, ఆదివారాల్లో మళ్లీ లభిస్తుంది. అలాగే రాత్రంతా డేటాను అపరిమితంగా వినియోగించవచ్చు. వీఐ సినిమాలు, వీఐ టీవీకి యాక్సెస్‌తో పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తుంది. వీఐ వెబ్‌సైట్ ద్వారా రీఛార్జ్ చేస్తే 32జీబీ అదనపు డేటాను పొందొచ్చు.

వీఐ రూ. 901 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్లాన్:
వీఐ రూ. 901 ప్యాక్ రూ. 701 ప్లాన్ లాగానే రోజుకు 3జీబీ డేటాతో సహా ఇతర బెనిఫిట్స్ అందిస్తుంది. వీఐ వెబ్‌సైట్ ద్వారా అదనంగా 48GB డేటాను పొందొచ్చు. ప్లాన్ రీఛార్జ్ చేసుకునే యూజర్లు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్‌లు చేసుకోవచ్చు. ఉచితంగా వీఐ సినిమాలు, వీఐ టీవీ యాక్సెస్, డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ఈ ప్లాన్ అందిస్తుంది. ఈ ప్యాక్ కి వారాంతపు డేటా రోల్‌ఓవర్ వంటి బెనిఫిట్స్ కూడా వర్తిస్తాయి. వీఐ వెబ్‌సైట్ ద్వారా రీఛార్జ్ చేయడానికి కొత్త ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి.

ఇప్పటికే వీఐ డిస్నీ+ హాట్‌స్టార్‌తో రూ. 501, రూ. 601 రూ.2595 రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తుంది. రూ.501 ప్యాక్ 3జీబీడేటా, అపరిమిత కాల్‌లు, 28 రోజుల వాలిడిటీ, వీఐ సినిమాలు, టీవీ, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, వీఐ వెబ్‌సైట్ ద్వారా రీఛార్జ్ చేసినప్పుడు 16జీబీ అదనపు డేటాను అందిస్తుంది. వీఐ 2595 ప్లాన్ రోజుకు 1.5GB డేటాతో 365 రోజుల వాలిడిటీతో వస్తుంది. రూ. 601 ప్యాక్ 56 రోజుల వాలిడిటీతో 75జీబీ డేటా యాడ్-ఆన్ ప్యాక్ తో వస్తుంది.
Published by:Krishna Adithya
First published: