హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Recharge Offer: 5 జీబీ డేటా ఫ్రీ.. డిస్నీ హాట్‌స్టార్ ఏడాది ఉచితం! జనవరి 15 వరకే ఆఫర్!

Recharge Offer: 5 జీబీ డేటా ఫ్రీ.. డిస్నీ హాట్‌స్టార్ ఏడాది ఉచితం! జనవరి 15 వరకే ఆఫర్!

Recharge Offer: 5 జీబీ డేటా ఫ్రీ.. డిస్నీ హాట్‌స్టార్ ఏడాది ఉచితం! జనవరి 15 వరకే ఆఫర్!

Recharge Offer: 5 జీబీ డేటా ఫ్రీ.. డిస్నీ హాట్‌స్టార్ ఏడాది ఉచితం! జనవరి 15 వరకే ఆఫర్!

Vodafone Idea | మీరు మొబైల్ ఫోన్ రీచార్జ్ చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే శుభవార్త. మీకోసం అదిరే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. పలు ప్లాన్స్‌పై అదనపు బెనిఫిట్స్ పొందొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Vi Offer | మీరు వొడాఫోన్ ఐడియా సిమ్ కార్డు వాడుతున్నారా? అయితే గుడ్ న్యూస్. కంపెనీ 5 జీబీ డేటాను ఉచితంగా అందిస్తోంది. స్పెషల్ ఆఫర్ (Offer) కింద ఈ బెనిఫిట్ కల్పిస్తోంది. ఈ ఆఫర్ జనవరి 15 వరకే అందుబాటులో ఉంటుంది. ఎవరైతే వొడాఫోన్ ఐడియా యాప్ ద్వారా ప్రిపెయిడ్ ప్లాన్ రీచార్జ్ (Recharge) చేసుకుంటారో వారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇక్కడ మరో బెనిఫిట్ కూడా ఉంది. కంపెనీ ఉచితంగానే డిస్నీ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఆఫర్ చేస్తోంది. కొన్ని రూ. 500లోపు ధరలోని ప్లాన్స్‌పై ఏడాది పాటు ఈ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందొచ్చు.

కంపెనీ 28 రోజుల వాలిడిటీతో ఒక ప్లాన్ అందిస్తోంది. రూ.499 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకోవాలి. ఇందులో కస్టమర్లకు రోజూ 2 జీబీ డేటా వస్తుంది. యాప్ ఓన్లీ ఆఫర్‌లో భాగంగా కస్టమర్లకు ఇప్పుడు 5 జీబీ డేటా ఉచితంగా వస్తోంది. అలాగే ఉచితంగా డిస్నీ హాట్‌స్టార్ ఏడాది సబ్‌స్క్రిప్షన్ కూడా వస్తోంది. వీఐ మూవీస్ అండ్ టీవీ యాప్ యాక్సెస్, బింగ్ ఆల్ నైట్, వీకెండ్ డేటా రోలోవర్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.

అబ్బా.. ఆఫర్ అంటే ఇది.. రూ.33,000 టీవీ రూ.6,999కే!

మరో 28 రోజుల ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 2.5 జీబీ డేటా వస్తుంది. దీని కోసం రూ.399 పెట్టి రీచార్జ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు వీరికి కూడా 5 జీబీ డేటా వస్తుంది. అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్ ఫ్రీగా పంపొచ్చు. ఇంకా ప్లాన్ కింద డిస్నీ హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ మూడు నెలల పొందొచ్చు. ఇక వొడాఫోన్ మూవీ అండ్ టీవీ యాప్ సబ్‌స్కిప్షన్, వీకెండ్ డేటా రోలోవర్, బింగ్ ఆల్ నైట్ వంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

శాంసంగ్ 200MP పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ .. రూ.1,999తో బుక్ చేసుకోండిలా!

అలాగే మరో వొడాఫోన్ ఐడియా ప్లాన్ కూడా 28 రోజుల వాలిడిటీని కలిగి ఉంది. దీని కోసం రూ.200 పెట్టి రీచార్జ్ చేయాలి. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 1.5 జీబీ డేటా వస్తుంది. యాప్ ఓన్లీ ఆఫర్ కింద ఇప్పుడు వీరికి కూడా 5 జీబీ డేటా వస్తుంది. అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎంఎస్ఎం బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఈ ప్లాన్ కింద ఎలాంటి హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ మాత్రం లేదు. కొత్తగా ఫోన్ రీచార్జ్ చేసుకునే వారికి మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఇప్పటికే రీచార్జ్ చేసుకొని ఉంటే మాత్రం ఈ బెనిఫిట్స్ ఉండవు. అదనపు డేటా, ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ పొందాలని భావించే వారు ఈ ప్లాన్స్‌ను ఒకసారి పరిశీలించొచ్చు. అదనపు ప్రయోజనాల సొంతం చేసుకోవచ్చు.

First published:

Tags: Disney plus hotstar, Mobile recharge, Recharge, Smartphone, VODAFONE, Vodafone Idea

ఉత్తమ కథలు