Home /News /technology /

VALENTINES DAYS SALE BUY RED MI SMARTPHONE UNDER RS 7000 ONLY HERE OFFER DETAILS NS

వాలంటైన్స్ డే ఆఫర్.. రూ.7 వేలలోపే Redmi 9A Sport స్మార్ట్ ఫోన్.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వాలంటైన్స్ డే సందర్భంగా రెడ్‌మి 9ఏ స్పోర్ట్ స్మార్ట్ ఫోన్ పై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేను జరుపుకోవడానికి ప్రేమికులంతా సిద్ధమయ్యారు. చాలా మంది తమ ప్రియమైన వారికి ఎలాంటి బహుమతులు ఇవ్వాలన్న అంశంపై కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ స్మార్ట్ ఫోన్ కంపెనీలు భారీ ఆఫర్లు అందిస్తున్నాయి. Mi నిర్వహిస్తున్న Valentine & Me సేల్‌లో చాలా మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. రెడ్‌మి 9ఏ సేల్ లో మంచి ఆఫర్లు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. సేల్‌లో రెడ్‌మి 9ఏ స్పోర్ట్ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.6,569కే సొంతం చేసుకునే అవకాశం ఉ:ది. సిటీ బ్యాంక్ కార్డ్ మరియు ఈఎంఐ కింద ఫోన్‌పై రూ.1,000 తగ్గింపు లభిస్తోంది. ఇది కాకుండా, Mi Exchange కింద రూ. 6,500 వరకు తగ్గింపు కూడా పొందవచ్చు.

    ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. 5000mAh బ్యాటరీ, 6.53 అంగుళాల HD + డిస్ప్లే మరియు 13 మెగాపిక్సెల్ వెనుక కెమెరా ఉన్నాయి. Redmi 9A Sport ఫీచర్ల గురించి మాట్లాడితే.. ఇది 6.53 అంగుళాల HD + LCD డాట్ డ్రాప్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇంకా 720×1600 పిక్సెల్ రిజల్యూషన్‌తో ఈ ఫోన్ వస్తుంది. ఇది 20: 9 యాస్పెక్ట్ రేషియోతో లభిస్తుంది. Redmi 9 Sport Android 10 ఆధారిత MIUI 12 ఆపరేటింగ్ సిస్టమ్ పై రన్ అవుతుంది. Octa-core MediaTek Helio G25 ప్రాసెసర్‌ని ఫోన్‌లో ఉపయోగించారు. ఈ ఫోన్లో 3 GB వరకు RAM ఉంటుంది.
    Valentine's day special Offer: మీ ప్రియమైన వారికి రూ.549కే 5G స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ గా ఇవ్వండి.. వెంటనే Flipkartలో బుక్ చేయండిలా..

    ఈ ఫోన్లో 5,000 mAh బ్యాటరీ ఉంది. ఇది 10 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. కనెక్టివిటీ కోసం, ఇందులో 3.5mm ఆడియో జాక్, 4G LTE, Wi-Fi మరియు మైక్రో-USB పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో AI ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ అందించబడింది. కెమెరా విషయానికి వస్తే.. ఈ ఫోన్ వెనుక భాగంలో 13-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీని ఎపర్చరు F/2.2. సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం, ఫోన్ F / 2.2 ఎపర్చర్‌తో 5 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ లో స్టోరేజ్ 32 GB వరకు ఉంది. మీరు 512 GB వరకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ తో స్టోరేజ్ ను పొడిగించుకోవచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Redmi, Smartphone, Valentines day, Xiomi

    తదుపరి వార్తలు