Valentine's Day special: ప్రేమ పెళ్లికి దారితీసిన పబ్‌జీ మొబైల్ గేమ్

Valentine's Day special | పబ్‌జీ మొబైల్ గేమ్‌లో ఓ అమ్మాయితో పరిచయం స్నేహంగా మారింది. ఇద్దరూ కలిసి చాలా గేమ్స్ ఆడారు. ఆ స్నేహంలో ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఎంగేజ్‌మెంట్ చేసుకొని ఫోటోలను ట్వీట్ చేశారు.

news18-telugu
Updated: February 14, 2019, 5:58 PM IST
Valentine's Day special: ప్రేమ పెళ్లికి దారితీసిన పబ్‌జీ మొబైల్ గేమ్
Valentine's Day special: ప్రేమ పెళ్లికి దారితీసిన పబ్‌జీ మొబైల్ గేమ్ (image: @Nourhanlhashish/Twitter)
news18-telugu
Updated: February 14, 2019, 5:58 PM IST
పబ్‌జీ... ఈ గేమ్ సంచలనాలు సృష్టించడం మాత్రమే కాదు... గేమింగ్ లవర్స్‌కు వ్యసనంగా మారిపోయిందన్నది వాస్తవం. పబ్‌జీ కోసం భార్యాపిల్లల్ని వదిలేసినవాళ్లున్నారు. పబ్‌జీ కోసం మొబైల్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్నవాళ్లున్నారు. ఇలాంటి ఘటనలు పెరిగిపోతుండటంతో పబ్‌జీని నిషేధించాలన్న డిమాండ్లూ పెరుగుతున్నాయి. అయితే ఇలాంటి నెగిటీవ్ వార్తలు మాత్రమే కాదు... పబ్‌జీ గేమ్ చుట్టూ ఆసక్తికరమైన కథలున్నాయి. అందులో ఓ ప్రేమకథ కూడా ఉండటం విశేషం. పబ్‌జీ మొబైల్ ఇద్దరు ప్లేయర్స్ మధ్య ప్రేమ చిగురించేందుకు కారణమైందంటే మీరు నమ్ముతారా? అదే జరిగింది.

Read this: #Jobs: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2019 నోటిఫికేషన్ విడుదల... వివరాలివే

అతని పేరు నౌర్హాన్-అల్-హషీష్. పబ్‌జీ మొబైల్ గేమ్ అంటే పిచ్చి. చాలాకాలంగా ఆడుతున్నాడు. తన స్క్వాడ్‌లో చివరకు తన జీవిత భాగస్వామి దొరుకుతుందని అస్సలు ఊహించలేకపోయాడు. ఓ అమ్మాయితో పరిచయం స్నేహంగా మారింది. ఇద్దరూ కలిసి చాలా గేమ్స్ ఆడారు. ఆ స్నేహంలో ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఎంగేజ్‌మెంట్ చేసుకొని ఫోటోలను ఇలా ట్వీట్ చేశారు.



ఈ జంటకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో లేదు. కానీ నౌర్హాన్ ఈజిప్ట్‌వాసి అని అతని అకౌంట్ ద్వారా తెలుస్తోంది. అతని ట్వీట్‌కు ఇప్పటివరకు 13,724 లైక్స్ వచ్చాయి. ఇప్పటి వరకు పబ్‌జీ మొబైల్ కాపురాలను కూల్చేస్తున్న ఘటనలను చూశాం కానీ... ఇలా ప్రేమ పెళ్లికి దారితీసిన ఘటన ఇదే.
Photos: సముద్రం మధ్యలో సూపర్ మార్కెట్... ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

మీకు LIC నుంచి SMS వచ్చిందా? రాకపోతే ఇలా చేయండి...

SBI Alert: కార్డు మోసాలు జరుగుతున్నాయి... ఇలా జాగ్రత్తపడండి

PAN-AADHAR link: పాన్ కార్డుతో ఆధార్ లింక్... డెడ్‌లైన్ మార్చి 31

PAN Card: మీ పాన్ కార్డులో తప్పులున్నాయా? ఇలా చేయండి
First published: February 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...