Home /News /technology /

VALENTINES DAY OFFERS ANNOUNCED ON NOTHING EAR 1 DIZO WATCH FUJIFILM INSTAX MINI 11 AND MORE GH VB

Valentine's Day Offers: వాలెంటైన్స్​ డే సందర్భంగా ప్రముఖ కంపెనీల స్పెషల్​ ఆఫర్లు.. ఈ ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్​..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ కంపెనీలు ప్రేమికుల కోసం ప్రత్యేకంగా వాలెంటైన్స్​ డే సేల్స్​ను(Valentine's Day offers) ప్రారంభించాయి. శామ్​సంగ్, గార్మిన్​, విజయ్​ సేల్స్​, డిజో, నథింగ్​, ఐవా, అమెజాన్​ తమ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ ప్రకటించాయి.

ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తోన్న వాలెంటైన్స్ డే (Valentine's Day) సమీపిస్తోంది. వాలెంటైన్స్​ డే సందర్భంగా ప్రేయసి/ప్రియుడికి బహుమతి(Gift) ఇచ్చి సర్​ప్రైజ్ చేయడం ఆనవాయితీ. అందుకే ప్రముఖ కంపెనీలు ప్రేమికుల కోసం ప్రత్యేకంగా వాలెంటైన్స్​ డే సేల్స్​ను ప్రారంభించాయి. శామ్​సంగ్(Samsung), గార్మిన్​, విజయ్​ సేల్స్​, డిజో, నథింగ్​, ఐవా, అమెజాన్​(Amazon) తమ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్(Discount) ప్రకటించాయి. ఈ సేల్​లో టీడబ్ల్యూఎస్​ ఇయర్‌బడ్స్​(Earbuds), స్మార్ట్‌వాచ్‌లు, కెమెరాలను తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చాయి. డిజో గోపాడ్స్ నియో అసలు ధర రూ. 2,499 వద్ద ఉండగా.. దీన్ని కేవలం రూ. 1,799 వద్ద కొనుగోలు చేయవచ్చు.

ఇక, దీనితో పాటు డిజో వాచ్ 2, డిజో వాచ్​లపై కూడా డిస్కౌంట్ పొందవచ్చు. మరోవైపు, డిజో ట్రిమ్మర్ ప్లస్, హెయిర్ డ్రైయర్​లను వరుసగా రూ. 1,849, రూ. 1,949 ఆఫర్ ధరపై కొనుగోలు చేయవచ్చు. ఇక, రూ. 6,999 ధర గల నథింగ్ ఇయర్ (1) బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్​ను కేవలం రూ. 5,999 వద్ద కొనుగోలు చేయవచ్చు.

Villagers-Leopard: ఆ పులి పిల్లను దత్తత తీసుకున్న గ్రామస్థులు.. కారణం ఏంటో తెలుసా..?


అమెజాన్​ కెమెరా గిఫ్టింగ్​ డేస్​ సేల్​లో భారీ డిస్కౌంట్లు..
ఈ–కామర్స్​ దిగ్గజం అమెజాన్ 'కెమెరా గిఫ్టింగ్ డేస్' సేల్‌ను నిర్వహిస్తోంది. దీనిలో కెమెరాలను భారీ డిస్కౌంట్‌పై కొనుగోలు చేయవచ్చు. డిస్కౌంట్​కు అదనంగా, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్‌లపై 10 శాతం ఇన్​స్టంట్​ డిస్కౌంట్​ను పొందవచ్చు. ఈ సేల్​ ఈవెంట్​లో ఫ్యూజిఫిల్మ్​ ఇన్​స్టాక్స్​ మినీ11 ఇన్‌స్టంట్ కెమెరా క్యుపిడ్ బాక్స్‌ని రూ. 5,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇక, ఇన్​స్టాక్స్​ మినీ 11 కెమెరా, ఇన్​స్టాక్స్​ మినీ గ్లోసీ ఫిల్మ్​ ప్యాక్​ 10×2, ఇన్​స్టాక్స్​ ఫ్రిడ్జ్​ మ్యాగ్నట్​ (5/ప్యాక్​), ఇన్​స్టాక్స్​ ఎల్​ఈడీ బంటింగ్​లపై భారీ డిస్కౌంట్​ పొందవచ్చు. మరోవైపు, కెనాన్​ EOS 1500D డీఎస్​ఎల్​ఆర్​ కెమెరాను రూ. 36,499 వద్ద, డీజేఐ ఓఎమ్​ 4 SE హ్యాండ్‌హెల్డ్ 3- యాక్సిస్ స్మార్ట్‌ఫోన్ గింబాల్​ కెమెరాను రూ. 14,990 వద్ద, గోప్రో హీరో 10 యాక్షన్ కెమెరాను రూ. 52,990 వద్ద కొనుగోలు చేయవచ్చు.

Dream Comes True: ప్రాణాలు పోయే పరిస్థితి నుంచి.. ప్రాణాలు పోసే స్థితికి.. ఆమె కథ ఒక స్పూర్తిదాయకం..


ఇక, ఐవా SB-X350A పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్​ అసలు ధర రూ. 19,990 వద్ద ఉండగా.. దీన్ని రూ. 15,990 వద్ద కొనుగోలు చేయవచ్చు. మరోవైపు, SB-X350J పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ అసలు ధర రూ. 17,990 వద్ద ఉండగా.. ఇది రూ. 12,990 వద్ద లభిస్తుంది. అమెజాన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్‌ను కూడా నిర్వహిస్తోంది. దీనిలో అనేక స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీలు డిస్కౌంట్‌పై లభిస్తాయి. వన్​ప్లస్​ 9 ఆర్​, శామ్​సంగ్​ గెలాక్సీ S20 FE, ఐఫోన్​ 12పై డిస్కౌంట్​ పొందవచ్చు. ఇక, స్మార్ట్ టీవీల విషయానికొస్తే, ఎంఐ 40 -అంగుళాల హారిజన్ FHD TV, శామ్​సంగ్​ 43 -అంగుళాల క్రిస్టల్​ 4K ప్రో యూహెచ్​డీ టీవీలను తక్కువ ధరలోనే కొనుగోలు చేయవచ్చు.
Published by:Veera Babu
First published:

Tags: Amazon, Earbuds, Valentines day

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు