VALENTINES DAY OFFER SAMSUNG GALAXY WATCH 4 PRICE CUT ANNOUNCED GH VB
Valentine’s Day Offer: వాలెంటైన్స్ డే ఆఫర్‌తో ముందుకొచ్చిన శామ్సంగ్.. భారీగా తగ్గిన వాటి ధరలు..
ప్రతీకాత్మక చిత్రం (Photo: Samsung)
వాలెంటైన్స్ డే ఆఫర్లో భాగంగా గెలాక్సీ వాచ్ 4 కొనుగోలుపై ఏకంగా రూ. 9,249 తగ్గింపును పొందవచ్చు. అంతేకాదు, అదనంగా రూ. 3000 విలువైన క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తోన్న వాలెంటైన్స్ వీక్ ప్రారంభమైంది. ఈ వాలెంటైన్స్ వీక్‌లో ప్రేమికులు ఒకరికొకరు బహుమతులు(Gifts) ఇచ్చి పుచ్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే, ప్రేమికులను ఆకట్టుకునేందుకు శామ్సంగ్(Samsung) సంస్థ అదిరిపోయే ఆఫర్ (Offer) తీసుకొచ్చింది. శామ్సంగ్ గెలాక్సీ వాచ్4పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. వాలెంటైన్స్ డే ఆఫర్లో భాగంగా గెలాక్సీ వాచ్ 4 కొనుగోలుపై ఏకంగా రూ. 9,249 తగ్గింపును పొందవచ్చు. అంతేకాదు, అదనంగా రూ. 3000 విలువైన క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. ఇప్పటికే ప్రారంభమైన ఆఫర్ సేల్ ఫిబ్రవరి 28న ముగుస్తుంది. Samsung.com/inవెబ్సైట్ లేదా శామ్సంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, రిటైల్ స్టోర్లలో ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
శామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4 ధర..
శామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4 రెండు కనెక్టివిటీ ఆప్షన్లతో వస్తుంది. బ్లూటూత్, 4జీ కనెక్టివిటీ వెర్షన్లలో లభిస్తుంది. మరోవైపు, 40 ఎంఎం, 42ఎంఎం, 44 ఎంఎం, 46 ఎంఎం డయల్ సైజ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఏ మోడళ్ల ధరను పరిశీలిద్దాం.
4G కనెక్టివిటీ గల గెలాక్సీ వాచ్ 4..
వాచ్ 4 (40 ఎంఎం) - రూ. 28,990, వాచ్ 4 (42 ఎంఎం) క్లాసిక్ రూ. 36,990, వాచ్ 4 (44 ఎంఎం) రూ. 31,990, 4 (46 ఎంఎం) క్లాసిక్ రూ. 39,999 ధర వద్ద అందుబాటులో ఉంటాయి.
ఆఫర్ వివరాలు..
వాలైంటైన్స్ డే ఆఫర్లో భాగంగా శామ్సంగ్ వాచ్ 4పై రూ. 9,249 డిస్కౌంట్‌తో పాటు ఇతర ప్రయోజనాలు కూడా పొందవచ్చు. డిస్కౌంట్‌తో పాటు రూ.3999 విలువైన హైబ్రిడ్ లెదర్ బ్యాండ్, రూ. 3249 విలువైన ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ బ్యాండ్లను కేవలం రూ. 999 వద్ద కొనుగోలు చేయవచ్చు. 4జీ కనెక్టివిటీతో కూడిన శామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4 బ్లాక్, వైట్, గ్రీన్ అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీ మోడల్లో గ్రీన్ కలర్‌కి బదులుగా సిల్వర్ కలర్ ఆప్షన్‌ను పొందుతారు.
ఫీచర్ల విషయానికి వస్తే.. శామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4 బ్లూటూత్ వెర్షన్ 5.0 వేర్ ఓఎస్‌పై పనిచేస్తుంది. బాడీ కంపోజిషన్, స్లీప్ ప్యాటర్న్, డైలీ యాక్టివిటీ, ఫిట్నెస్ ట్రాకింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ వంటివి ట్రాక్ చేయడానికి దీనిలో హెల్త్, వెల్నెస్ ఫీచర్లను అందించింది. మరోవైపు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ గల సూపర్ అమోలెడ్ డిస్ప్లేను చేర్చింది. కరోనా- విజృంభిస్తున్న ప్రస్తుతం తరుణంలో హెల్త్, ఫిట్నెస్ ట్రాక్ చేసుకోవడం ప్రతి ఒక్కరికి అవసరంగా మారింది. అందుకే, స్మార్ట్‌వాచ్‌లకు, ఫిట్‌నెట్ పరికరాలకు డిమాండ్ అమాంతం పెరిగింది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.