Home /News /technology /

VALENTINES DAY 2021 OPPO RENO 5 PRO 5G KNOW ABOUT INDIAN PRICE SPECIAL FEATURES MK

Valentines day 2021: మీ ప్రేయసికి గిఫ్ట్ ఇస్తున్నారా...కేవలం రూ.1700లకే 5G ఫోన్ కొనండిలా...

(image: Oppo)

(image: Oppo)

Valentines Day 2021: మీరు అతి తక్కువ ధరలో మీ ప్రేయసికి కానుకగా ఇచ్చేందుకు సులభ వాయిదాల్లో 5G ఫోన్ సిద్ధంగా ఉంది. ఈ కానుక ద్వారా మీ ప్రేయసికి గిఫ్ట్ గా ఇవ్వొచ్చు.

    Valentines Day 2021:  ప్రేమికుల దినోత్సవం' వాలెంటైన్స్ డే. ప్రేమికులంతా ఉద్వేగంగా ఎదురుచూసే రోజు.. కొందరు ఇదే రోజున ప్రేమ వ్యక్తపరిచే రోజుగా ఎదురుచూస్తుంటారు. ప్రేమికులు ఈ రోజున తమ ప్రేమను నచ్చిన వ్యక్తి కి తెలియజేయడానికి ఒక ముహూర్తంగా ఎంచుకుంటారు. దీన్ని క్యాష్ చేసుకొని ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల బిజినెస్ సాగుతుందంటే అతిశయోక్తి కాదు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆన్‌లైన్‌ కామర్స్‌, డిజిటల్‌ వాలెట్‌ సేవల కంపెనీలు ప్రేమికులను ఆకట్టుకునేందుకు పలు ఆఫర్లను ప్రకటించాయి. స్మార్ట్‌ఫోన్లు నుంచి.. ఫ్యాషన్‌ ఉత్పత్తులు, నగలు, విమాన టిక్కెట్ల వరకు అన్నింటిపైనా రాయితీలు కల్పిస్తున్నాయి. అంతేకాకుండా డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు ద్వారా ఆర్డర్‌ చేసేవారికి రివార్డ్ పాయింట్స్ అందించనున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థలు షావోమి, సామ్‌సంగ్‌ ఆసక్తికరమైన ఆఫర్లు ప్రకటించాయి. అయితే మీ ప్రేయసికి ఈ Valentines Day 2021కి మంచి కానుక ఇవ్వాలని చూస్తున్నారా. అయితే మీకు అతి తక్కువ ధరలో మీ ప్రేయసికి కానుకగా ఇచ్చేందుకు సులభ వాయిదాల్లో 5G ఫోన్ సిద్ధంగా ఉంది. ఈ కానుక ద్వారా మీ ప్రేయసికి గిఫ్ట్ గా ఇవ్వొచ్చు.

    OPPO Reno5 Pro 5G:

    ఒప్పో తన కొత్త సిరీస్ OPPO Reno5 Pro 5G మొబైల్ ని భారతదేశంలో లాంచ్ చేసింది. దీని ఫీచర్ల విషయానికి వస్తే ఒప్పో రెనో 5ప్రో 5జీ 6.5-అంగుళాల 1080p అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిఫ్రెష్ రేటు 90 హెర్ట్జ్‌గా ఉంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్‌ను అందించనున్నారు. రెనో 5ప్రో 5జీలో 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా, 2 ఎంపీ పోర్ట్రెయిట్ లెన్స్ కెమెరా ఉంది. ఇందులో సెల్ఫీ కోసం 32 ఎంపీ కెమెరాను అందించారు. దీనిలో 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేసే 4,350 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్ 11 బేస్డ్ కలర్ ఓఎస్ 11.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, గ్లోనాస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 4300 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. ఈ ఫోన్ ప్రస్తుతం అమెజాన్ లో 35,990 రూపాయలకు అందుబాటులో ఉండగా, కేవలం 1,694 రూపాయలకే అతి తక్కువ ఈఎంఐతో ఈ ఫోనును సొంతం చేసుకోవచ్చు.

    మరికొన్ని కొత్త మోడల్స్ ఇవే...
    అలాగే షియోమీ సబ్‌బ్రాండ్ పోకో M3 స్మార్ట్‌ఫోన్‌ను ఫిబ్రవరి 2న విడుదల చేసింది.ఇప్పటికే పలు దేశాల్లో ఈ ఫోన్‌ విడుదల కాగా భారత్‌లో ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఫోన్లను విక్రయిస్తున్నారు. చనున్నారు. బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో రియల్‌మీ 6, రియల్‌మీ నార్జో 20, మోటో జీ9 పవర్‌కు పోటీఇవ్వనుంది. ఈ ఫోన్‌ కూల్‌ బ్లూ, పోకో ఎల్లో, పవర్‌ బ్లాక్‌ కలర్లలో అందుబాటులో ఉండనున్నట్లు తెలిసింది. 4జీ ర్యామ్‌+64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.11వేలు, 4జీబీ ర్యామ్‌+128జీబీ స్టోరేజ్‌ ధర రూ.12,500 వరకు ఉండొచ్చు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: 5G Smartphone, Valentines day, Valentines Day 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు