Home /News /technology /

VACCINATION STATUS KNOW EASILY COWIN LAUNCHES NEW API EVK

CoWIN New API : కోవిన్ యాప్ కొత్త ఫీచర్.. వ్యక్తుల వ్యాక్సినేషన్ స్టేటస్ తెలుసుకోవడం సులభం

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వ‌హిస్తున్న కోవిన్ యాప్‌లో మ‌రో ప్ర‌త్యేక‌మైన ఫీచ‌ర్‌ను అందించ‌నుంది. Know Your Customer’s/Client’s Vaccination Status లేదా KYC-VS పేరుతో ఈ అప్ డేట్(Update) ను తీసుకొచ్చారు. దీని ద్వారా.. ఒక వ్యక్తి వ్యాక్సిన్ వేసుకున్నాడా? లేదా? అని తెలుసుకోవచ్చు.

ఇంకా చదవండి ...
    కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వ‌హిస్తున్న కోవిన్ యాప్‌లో మ‌రో ప్ర‌త్యేక‌మైన ఫీచ‌ర్‌ను అందించ‌నుంది. ఇప్ప‌టిదాకా కోవిన్ యాప్ లో వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ తో లాగిన్ అయితే వ్యాక్సినేషన్ కు సంబంధించిన మొదటి, రెండో డోస్ సర్టిఫికెట్లు ఉంటాయి. వాట్సప్(Whatsapp) ద్వారా కూడా కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ ను తీసుకోవచ్చు. ఇక మీద Know Your Customer’s/Client’s Vaccination Status లేదా KYC-VS పేరుతో ఈ అప్ డేట్ ను తీసుకొచ్చారు. దీని ద్వారా.. ఒక వ్యక్తి వ్యాక్సిన్ వేసుకున్నాడా? లేదా? అని తెలుసుకోవచ్చు.
    ఎందుకోసం ఈ ఫీచ‌ర్‌..
    మ‌నం ఎక్క‌డిక‌న్నా వెళ్లినా.. కంపెనీలలో, మాల్స్ లో, ఇతర ప్రదేశాల్లో డిజిటల్(Digital) సర్టిఫికెట్ అవసరం లేకుండా.. సంబంధిత వ్యక్తి వ్యాక్సిన్ వేసుకున్నాడా? లేడా? అని మాత్రమే తెలుసుకోవడం కోసం ఈ ఫీచ‌ర్‌ను వాడొచ్చు. ఒక కంపెనీ తన ఉద్యోగుల వ్యాక్సినేషన్ స్టేటస్ తెలుసుకోవాలన్నా.. ఇండియన్(Indian) రైల్వేస్ తమ ప్రయాణికుల వ్యాక్సిన్ స్టేటస్ తెలుసుకోవాలన్నా.. ఈ ఫీచర్ ను ఉపయోగించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎవ‌రైన వ్య‌క్తులు హోటల్స్, టూరిస్టు ప్రాంతాలు, ఎయిర్ పోర్ట్స్, బస్ట్ స్టేషన్స్, మెట్రో స్టేషన్స్.. ఇలా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ప్రాంతాల్లో కూడా ప్రయాణికుల వ్యాక్సినేషన్ స్టేటస్‌ను ఈ యాప్ ద్వారా తెలుసుకోవ‌చ్చు.

    Gmail Features: జీమెయిల్ యాప్‌లో అదిరిపోయే ఫీచ‌ర్‌.. నేరుగా వాయిస్ కాల్ చేసుకోవ‌చ్చు


    ఎలా వినియోగిస్తారంటే.. 
    వ్యాక్సిన్ సమయంలో రిజిస్టర్ చేసుకున్న మొబైల్(Mobile) నెంబర్, పేరు ఎంటర్ చేస్తే.. ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే.. కోవిన్(CoWin).. ఆ వ్యక్తి వ్యాక్సిన్ స్టేటస్(Vaccine Status) ను వెరిఫై చేసే ఎంటిటీకి వ్యాక్సిన్ కు సంబంధించిన వివరాలను పంపిస్తుంది. ఎలాగంటే ప‌రిశీలించిన‌ వ్యక్తి వ్యాక్సిన్ వేసుకోకపోతే.. Person is not vaccinated అని.. ఒక డోస్ మాత్రమే వేసుకుంటే Person is partially vaccinated అని.. రెండు డోస్ లు వేసుకుంటే.. Person is fully vaccinated అనే మెసేజ్ లను కోవిన్ ఎంటిటీకి పంపిస్తుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 72 కోట్ల వ్యాక్సిన్ డోస్ లను వేసినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది.

    ప‌లు సంస్థ‌లు, కంపెనీలు వ్యాక్సిన్ వేసుకొన్న వారిని మాత్ర‌మే అనుమ‌తిస్తుంది. ఏదైనా టూరిస్ట్ ప్రాంతాల‌కు వెళ్లాల‌న్నా అక్క‌డ అంద‌రి సేఫ్టీని దృష్టిలో పెట్లుకొని వ‌చ్చిన వాళ్లు వ్యాక్సిన్ వేసుకొన్నారా తెలిస్తే బాగుంటుంది. ఈ నేప‌థ్యంలోన కోవిన్ యాప్ తీసుకొచ్చిన ఈ ఫీచ‌ర్ ద్వారా ఎవ‌రు వ్యాక్సిన్ వేసుకొన్నారో లేదో తెలుసుకోవ‌డం చాలా సుల‌భం అవుతుంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Cowin Portal, Vaccination

    తదుపరి వార్తలు