హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

New car technology: కారులో ప్రయాణిస్తే కారుతో మాట్లాడినట్లే.. అందుబాటులోకి కొత్త టెక్నాలజీ.. హైదరాబాద్​లోనే ప్రయోగం

New car technology: కారులో ప్రయాణిస్తే కారుతో మాట్లాడినట్లే.. అందుబాటులోకి కొత్త టెక్నాలజీ.. హైదరాబాద్​లోనే ప్రయోగం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏదైనా వాహనంలో మనం వెళుతున్నపుడు మన కారు మనకు సూచనలు ఇస్తే ఎలా ఉంటుంది? ముందుగా రాబోయే ట్రాఫిక్​ విషయాలను మనకు తెలియజేస్తే.. మనకు పక్క వాహనం కారణంగా ప్రమాదం జరిగే సూచనలు ఉన్నట్లు వాహనం తెలిపితే..  దీన్నే వీ2ఎక్స్​ టెక్నాలజీ అంటారు. ఇలాంటి టెక్నాలజీ ఇపుడు రాబోతుంది.

ఇంకా చదవండి ...

(K. veeranna, News 18, Medak)

ఏదైనా వాహనంలో మనం వెళుతున్నపుడు మన కారు మనకు సూచనలు ఇస్తే ఎలా ఉంటుంది? ముందుగా రాబోయే ట్రాఫిక్​ విషయాలను మనకు తెలియజేస్తే.. మనకు పక్క వాహనం కారణంగా ప్రమాదం జరిగే సూచనలు ఉన్నట్లు వాహనం తెలిపితే..  దీన్నే వీ2ఎక్స్​ టెక్నాలజీ అంటారు. ఇలాంటి టెక్నాలజీ ఇపుడు రాబోతుంది. వి2ఎక్స్  (V2X) కమ్యూనికేషన్‌కు సంబంధించిన భారతదేశపు మొదటి (1st) పరిశోధనను సుజుకి, మారుతీ సుజుకీ,  ఐఐటి హైదరాబాద్ సంయుక్తంగా ప్రదర్శించాయి. హైదరాబాద్ పరిశ్రమలో సుజుకి మోటార్ కార్పొరేషన్, జపాన్ (SMC), మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ (MSIL) మరియు ఐఐటి హైదరాబాద్ (IITH) ఫ్యూచరిస్టిక్ V2X  కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆధారంగా భారతదేశ-నిర్దిష్ట వాహన వినియోగ పరిస్థితులను పరిశోధించేందుకు జతకట్టాయి. దీని ద్వారా రహదారిపై రద్దీని తగ్గించేందుకు సాధ్యమవుతుంది. ఈ అప్లికేషన్‌లను ప్రదర్శించే మొదటి ప్రోటోటైప్‌లను  ఐఐటి హైదరాబాద్ క్యాంపస్‌లో ప్రదర్శించారు.

అంబులెన్స్ హెచ్చరిక వ్యవస్థ..

కారుకు చేరువ అవుతున్న ఎమర్జెన్సీ వాహనం , దాని ప్రయాణ మార్గానికి సంబంధించి డ్రైవర్లను V2X కమ్యూనికేషన్ అప్రమత్తం చేస్తుంది. డ్రైవర్ సురక్షితంగా తమ మార్గానికి సంబంధించిన ప్రణాళిక రూపొందించుకుని అత్యవసరంగా వెళ్లవలసిన వాహనానికి మార్గాన్ని కల్పించేందుకు అవకాశం కలుగుతుంది. అలర్ట్ సిస్టమ్ రియల్ టైమ్ ప్రాతిపదికన వాహనాల మధ్య ఎన్ని నిమిషాల దూరం తదితర నిమిషాల వివరాలను కూడా పంచుకుంటుంది.

రాంగ్-వే డ్రైవర్ అలెర్టింగ్ సిస్టమ్..

తప్పు మార్గంలో వస్తూ తమకు ఎదురుగా వచ్చే డ్రైవర్ ఉనికికి సంబంధించి V2X కమ్యూనికేషన్‌ని ముందస్తు హెచ్చరికలు చేస్తుంది.

పాదచారుల హెచ్చరిక వ్యవస్థ

V2X కమ్యూనికేషన్‌ని ఉపయోగించి, కారుకు అడ్డుగా వచ్చి ఢీకొనే అవకాశం ఉన్న సమీపంలోని పాదచారుల గురించి డ్రైవర్‌లకు ఈ అలర్ట్ అప్రమత్తం చేస్తుంది. పాదచారులను ఢీకొట్టకుండా డ్రైవర్లు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు ఇది సహకరిస్తుంది.

మోటార్‌సైకిల్ అలర్ట్ సిస్టమ్..

కారు డ్రైవర్‌లు బ్లైండ్ స్పాట్ నుంచి వేగంగా వచ్చి ఢీకొనే అవకాశం ఉన్న, 2-వీలర్ల గురించి V2X కమ్యూనికేషన్ ద్వారా తెలుసుకుంటారు.  ఆ వాహనం దూరం,  దిశకు సంబంధించిన విధానాల గుర్తించి డ్రైవర్‌ రియల్-టైమ్‌లో షేర్ చేయబడుతుంది.

రోడ్ కండిషన్ అలర్ట్ సిస్టమ్..

పాడైన రహదారి పరిస్థితుల గురించి కారు డ్రైవర్ హెచ్చరికను అందుకుంటాడు మరియు ప్రయాణంలో జాగ్రత్తగా ముందుకు వెళ్లమని డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది.

కారును కంప్యూటర్‌గా..

ఇది పూర్తిగా భారతీయ అవసరాలకు V2X కమ్యూనికేషన్ టెక్నాలజీతో కలిగే ప్రయోజనాలను అధ్యయనం చేసేందుకు ఒక ఆవిష్కారాత్మక ప్రాజెక్ట్ . భవిష్యత్తులో వినూత్న సాంకేతికతలపై సాధ్యమయ్యే పరిష్కారాలు మరియు వినియోగ కేసుల శ్రేణిని ఈ డెమోన్​స్ట్రేషన్​ అందించింది. ఈ పరిశోధన ప్రాజెక్ట్‌కు ప్రస్తుతం కంపెనీ ఉత్పత్తి ప్రణాళికతో ఎలాంటి సంబంధం లేదు. అంతేకాదు మన తెలుగమ్మాయి తమ్మినేని ప్రత్యూష తన పరిశోధనల్ని news 18 షేర్ చేసుకున్నారు. మనం పక్క కార్లతో ముచ్చట్లాడినట్లే ఉంటుంది. ఇదేం వెటకారం కాదు.  సాంకేతిక పరిభాషలో దీనిని వీటూ ఎక్స్ టెక్నాలజీ అంటారు. ఇందులో అగ్రగామిగా ఉన్న సుజీకి సంస్థ సాంకేతిక బృందాన్ని నడిపిస్తోందని అంటున్నారు నిపుణులు.

ఇక ప్రత్యూష దీనిపై స్పందిస్తూ.. ‘‘వాటి చుట్టూ ఉండే టవర్లూ, పరికరాలు, ఇతర కార్లతో అనుసంధానం అవడం వల్ల చాలా ప్రయోజనాలుంటాయి. వాటిలో రహదారి భద్రత, ఇంధనం ఆదా, ట్రాఫిక్ నియంత్రణ వంటివి ప్రధానమైనవి. అంబులెన్స్లు వస్తుంటే డ్రైవర్​కి చెప్పి దారిని సూచిస్తాయి. ఎవరైనా రాంగు రూట్ లో వస్తుంటే ప్రమాదం జరగకుండా నివారిస్తాయి. అవసరం అయితే వాహన వేగాన్ని తగ్గిస్తాయి.ఈ పరిజ్ఞానంతో కార్లు ఈ పనులన్నీ చేస్తాయి. ఈ పరిజ్ఞానాన్ని వీటూ ఎక్స్ అంటారు. ఈ రంగం వైపు నేను అడుగులు వేయడానికి కారణం మా నాన్నగారే. పరిశోధనా రంగాన్ని ఎంచుకుంటే సమాజానికి అవసరమైన ఆవిష్కరణలు చేయొచ్చు. అవి ఎంతోమందికి ఉపయోగపడతాయి' అని చిన్నప్పటి నుంచి నాన్న చెప్పిన మాటలు నా మనసులో బలంగా నాటుకున్నాయి. అందుకే ఈ రంగాన్ని ఎంచుకున్నా.

మాది నెల్లూరు జిల్లా కావలి దగ్గరున్న కమ్మవారిపాలెం. నాన్న వెంకయ్య ఫార్మా పరిశ్రమలో మేనేజర్, అమ్మ దేవతి. నాకో తమ్ముడు. నాన్న హైదరాబాద్లో ఉద్యోగం చేయడంతో తొమ్మిదో తరగతి వరకు ఇక్కడే చదువుకున్నా. ఆయనకు విశాఖపట్నం బదిలీ కావడంతో ఇంటర్ అక్కడ చదివా తర్వాత ఐఐటీ హైదరాబాద్లో సీటొచ్చింది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ తీసుకున్నా ఐఐటీలో ఉన్న నాలుగేళ్లలో | (ఐవోటీ)పై పనిచేశా. ఇవి తర్వాత నేనెంచుకున్న కెరియర్ బాగా కలిసొచ్చింది. ఇంజినీరింగ్ పూర్తయ్యాక ఒక స్టార్టప్ పెట్టాలని ఎంతో ప్రయత్నించాను. స్మార్ట్ స్ట్రీట్ లైట్లపై పరిశోధనలు చేశా ఏడునెలలు దీనికోసం పనిచేశా. జపాన్లో ఎంఎస్ చేసేందుకు అవకాశం వచ్చినా ఈ స్టార్టప్ కోసం వదులుకున్నా. కానీ ఆ ఉత్పత్తులని పూర్తిస్థాయిలో మార్కె ల్లోకి తీసుకురావడానికి చాలా కష్టలు ఎదురయ్యాయి” అన్నారు.

First published:

Tags: CAR, Hyderabad, IIT Hyderabad, New technology

ఉత్తమ కథలు