హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Ravana Dahanam: స్మార్ట్‌ఫోన్‌తో రావణ దహనం... వైరల్ వీడియో ఇక్కడ చూడండి

Ravana Dahanam: స్మార్ట్‌ఫోన్‌తో రావణ దహనం... వైరల్ వీడియో ఇక్కడ చూడండి

Ravana Dahanam: స్మార్ట్‌ఫోన్‌తో రావణ దహనం... వైరల్ వీడియో ఇక్కడ చూడండి
(image: ANI)

Ravana Dahanam: స్మార్ట్‌ఫోన్‌తో రావణ దహనం... వైరల్ వీడియో ఇక్కడ చూడండి (image: ANI)

Ravana Dahanam | బీటెక్ విద్యార్థులు స్మార్ట్‌ఫోన్‌తో రావణ దహనం చేయడం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఈ వీడియో వైరల్‌గా మారింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

దసరా రోజున రావణ దహనం (Ravana Dahanam) ఊరూరా చేస్తుంటారు. చాలాచోట్ల ఈ కార్యక్రమాన్ని ఓ వేడుకలా నిర్వహిస్తుంటారు. దసరా సందర్భంగా గోరఖ్‌పూర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (ITM) బీటెక్ విద్యార్థులు వినూత్నంగా ఆలోచించారు. స్మార్ట్ పద్ధతిలో రావణ దహనం చేయాలనుకున్నారు. స్మార్ట్‌ఫోన్ ద్వారా రావణ దహనాన్ని చేసి ఆశ్చర్యపర్చారు. ఇలాంటి సాంకేతిక ఆవిష్కరణలు మనందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇది కూడా అంతే. న్యూస్ ఏజెన్సీ అయిన ఏఎన్ఐ ఈ వీడియోను ట్వీట్ చేసింది. ఈ విడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

విద్యార్థులు ప్రొఫెసర్లు కలిసి ఈ ప్రయోగం చేశారు. సుమారు మూడు ఫీట్ల రావణుడి దిష్టిబొమ్మను తయారు చేశారు విద్యార్థులు. స్మార్ట్‌ఫోన్‌తో ఇలా క్లిక్ చేయగానే కొన్ని సెకండ్లలో రావణుడి దిష్టిబొమ్మ దగ్ధమైంది. స్మార్ట్‌ఫోన్ నుంచి రావణుడి దిష్టిబొమ్మకు ఓ వైర్ కనెక్ట్ చేసి, ఆ తర్వాత డివైజ్ ఆపరేట్ చేయగానే రావణుడి దిష్టిబొమ్మ దహనమైంది. పెద్ద శబ్దం కూడా వచ్చింది. ఇప్పటి వరకు ఈ వీడియోకు 43 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. విద్యార్థుల ప్రయోగంపై ప్రశంసలు కూడా వస్తున్నాయి. ఆ వీడియో ఇక్కడ చూడొచ్చు.

Smart Watch Free: స్మార్ట్‌ఫోన్ కొంటే రూ.4,999 విలువైన స్మార్ట్ వాచ్ ఉచితం... వెంటనే కొనేయండి

దసరా రోజున రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయడం సంప్రదాయంగా వస్తోంది. అసలు దసరా పేరు కూడా దీని నుంచే వచ్చింది. సంస్కృతంలో దశ అంటే పది, హర అంటే ఓడించడం. పది తలలు ఉన్న రావణుడిని ఇదే రోజున హరించారు కాబట్టి దశహర అనే పేరు వచ్చింది. ఆ పేరు కాస్తా దసరాగా మారింది. దీపావళి పండుగకు 20 రోజుల ముందు దసరా రోజు నుంచే ఏర్పాట్లు జరుగుతాయని కూడా అంటారు. దసరా రోజున రాముడి జీవిత చరిత్రను రామ్‌లీలా పేరుతో నాటక ప్రదర్శన కూడా వేస్తారు. ఆ తర్వాతే రావణ దహనం కార్యక్రమం జరుగుతుంది.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Dussehra 2022

ఉత్తమ కథలు