Home /News /technology /

USING WHATSAPP PLUS OR GB WHATSAPP WHATSAPP BANNING USERS FOR USING THIRD PARTY VERSION OF THE MESSAGING APP SS

GB WhatsApp: మీ జీబీ వాట్సప్ బ్లాక్ అయిందా? ఇలా చేయండి

WhatsApp Image Search: వాట్సప్‌లో కొత్త ఫీచర్... ఇక ఫేక్‌న్యూస్‌కు చెక్

WhatsApp Image Search: వాట్సప్‌లో కొత్త ఫీచర్... ఇక ఫేక్‌న్యూస్‌కు చెక్

మీరు వాట్సప్ ఓపెన్ చేయగానే “Temporarily banned” అనే మెసేజ్ వస్తే మీరు అధికారిక యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందే. ఇందుకోసం మీరు ముందుగానే ఛాట్ హిస్టరీ బ్యాకప్ చేసుకొని అధికారిక వాట్సప్ యాప్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది.

    మీరు ఒరిజినల్ వాట్సప్‌కు ప్రత్యామ్నాయంగా WhatsApp Plus, GB WhatsApp లాంటి థర్డ్ పార్టీ యాప్స్ వాడుతున్నారా? అయితే మీ అకౌంట్‌ను తాత్కాలికంగా నిషేధించే అవకాశముంది. మీరు అఫీషియల్ వాట్సప్ యాప్ మాత్రమే ఉపయోగించాలి. దానికి బదులుగా ఇతర యాప్స్ ఏవి వాడినా బ్యాన్ తప్పదు. థర్డ్ పార్టీలు రూపొందించిన అనధికార యాప్స్ తమ నియమనిబంధనలకు విరుద్ధమని వాట్సప్ చెబుతోంది. ఆ యాప్స్ సెక్యూరిటీ ఎలా ఉంటుందో తమకు తెలియదని, అందుకే ఇకపై వాట్సప్ ఈ థర్డ్ పార్టీ యాప్స్‌ని సపోర్ట్ చేయదని వెల్లడించింది.

    Read this: PAN Card: మీ దగ్గర రెండో పాన్ కార్డ్ ఉందా? ఇలా సరెండర్ చేయండి

    వాట్సప్ ఎప్పట్నుంచి ఈ థర్డ్ పార్టీ యాప్స్‌ని బ్యాన్ చేసిందో స్పష్టత లేదు. కానీ సోషల్ మీడియాలో దీని గురించి చర్చ జరుగుతోంది. ఈ అనధికార యాప్స్‌పై నిషేధం విధించడంతో చాలామంది అధికారిక వాట్సప్ యాప్ ఉపయోగిస్తున్నారు. మరి మీరు కూడా WhatsApp Plus, GB WhatsApp లాంటి థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగిస్తున్నట్టయితే ఒరిజినల్ వాట్సప్‌లోకి మారడం మంచిది. మీరు ఈ యాప్స్ ఓపెన్ చేయగానే “Temporarily banned” అనే మెసేజ్ వస్తే మీరు అధికారిక యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందే. ఇందుకోసం మీరు ముందుగానే ఛాట్ హిస్టరీ బ్యాకప్ చేసుకొని అధికారిక వాట్సప్ యాప్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది.

    Read this: FAME-II Scheme: ఎలక్ట్రిక్ బైకుకు రూ.20,000, కారుకు రూ.1.5 లక్షల సబ్సిడీ

    ఛాట్ హిస్టరీ ఎలా బ్యాకప్ చేసుకోవాలి?


    GB WhatsApp అయితే tap More options > Chats > Back up chats క్లిక్ చేయాలి. ఆ తర్వాత Phone Settings > tap Storage > Files క్లిక్ చేయాలి. GB WhatsApp పేరును తొలగించి WhatsApp అని రీనేమ్ చేయాలి. ఆ తర్వాత ప్లేస్టోర్‌లో ఒరిజినల్ వాట్సప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీ ఫోన్ నెంబర్ వెరిఫై చేసిన తర్వాత Backup Restore చేయాలి. WhatsApp Plus ఉపయోగిస్తున్నట్టితే Settings > Chats > Chat backup > Back Up క్లిక్ చేయాలి.

    Photos: యంగెస్ట్ సెల్ఫ్-మేడ్ బిలియనీర్‌గా 21 ఏళ్ల కైలీ జెన్నర్

    ఇవి కూడా చదవండి:

    Video: పబ్లిక్‌లో ప్రపోజ్ చేసినందుకు జైలుపాలైన ప్రేమజంట

    SBI Money Transfer: మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారా? ఎస్‌బీఐలో IMPS NEFT వివరాలు ఇవే...

    www: వాల్డ్ వైడ్ వెబ్‌కు 30 ఏళ్లు... గూగుల్ స్పెషల్ డూడుల్... ఆసక్తికరమైన 10 అంశాలివే...
    First published:

    Tags: Android, FAKE APPS, Playstore, Smartphone, Whatsapp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు