ప్రస్తుతం గులాబ్ (Gulab) తుఫాన్ రెండు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రతీ ఏటా ఇలాంటి తుఫాన్‌లు వస్తూనే ఉంటాయి. ఆ సమయంలో తుఫాన్ (Cyclone)) సమాచారం ఎలా తెలుసుకోవాలనే సందేహం అందరికీ వస్తుంది. అలాంటి సమయంలో ఎలా సమాచారం తెలుసుకోవాలి అనే విషయాలు తెలుసుకోండి. వాతావరణశాఖ సమాచారం.. తుఫాన్ ప్రస్తుత పరిస్థి ఏంటీ.. బలహీన పడిందా లేదా ఎలా వస్తుంది అనే సమాచారం స్మార్ట్ ఫోన్ (Smart Phone) ద్వారా తెలుసుకోవచ్చు. అందుకోసం పలు వెబ్‌సైట్‌లు అందుబాటులో ఉన్నాయని. ఈ సమాచారం తెలుసుకొని ముందు జాగ్రత్త పడొచ్చు. ఆ వివరాలు తెలుసుకొందాం.
మీ వద్ద ఫోన్ ఉంటే వెంటనే గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి www.hurricanezone.net వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. ఈ వెబ్‌సైట్ మీకు తుఫాన్ సమాచారాన్ని వెంటనే తెలుపుతుంది. మీరు ఇంట్లోనే కూర్చొని తుఫాన్ల స్థితిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చును.
ఈ వెబ్‌సైట్‌లో ఇండియన్ ఓషన్ (Indian Ocean), వెస్ట్ పసిఫిక్, సౌత్ పసిఫిక్, సెంట్రల్ పసిఫిక్ (Central pacific), ఈస్ట్ పసిఫిక్, అట్లాంటిక్ ప్రాంతాల్లో వచ్చే సైక్లోన్లు, టైఫూన్ల, హరికేన్‌లను ట్రాక్ చేయవచ్చును.
అలాంటి మరో వెబ్‌సైట్ తుపానును ఎప్పటికప్పుడు ట్రాక్ (Track) చేసేందుకు mausam.imd.gov.in వెబ్‌సైట్ను ఓపెన్ చేయాలి. ఇది కూడా పూర్తి కచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది. ఈ వెబ్‌సైట్‌ను ఎర్త్ సైన్సెస్ (Earth Science) మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది. దేశంలో సంభవించే అన్ని తుఫాను సమాచారం ఎప్పటికప్పుడు అప్డేటెడ్‌గా తెలుసుకోవచ్చు.
Google Browsing: సేఫ్ బ్రౌజింగ్ చేయాలనుకొంటున్నారా.. అయితే ఇలా చేయండి
ఉమాంగ్ (UMANG) యాప్‌ను ఉపయోగించి ప్రత్యక్షంగా తుపాన్లను ట్రాక్ చేయవచ్చును. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ (Apple Store) లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. ఉమాంగ్ యాప్ సహాయంతో తుపాన్ల రియల్‌టైమ్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు అందిస్తోంది.
భారత వాతావరణశాఖ-ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన వెబ్‌సైట్‌లో ఒకటి www.rsmcnewdelhi.imd.gov.in ఈ వెబ్‌సైట్ నిరంతరం తుఫాను సమాచారాన్ని అప్డేటెడ్‌గా అందిస్తుంది. ఉత్తర హిందూ మహాసముద్రం ఏర్పడే తుపాన్లను ట్రాక్ చేయడానికి ఈ వెబ్‌సైట్ (Website) చాలా ఉపయుక్తంగా ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cyclone, Information Technology, Smartphones, Technology, Website