సోషల్ నెట్వర్కింగ్ యాప్(Social Networking App) ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) ఓ సమస్య గురించి వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. చాలా మంది వినియోగదారులు తమ ఖాతాలు అకస్మాత్తుగా నిలిపివేయబడ్డాయని పేర్కొంటున్నారు. ఇన్స్టాగ్రామ్ ఖాతాను(Instagram Account) సస్పెండ్ చేయడానికి గల కారణాన్ని కూడా తెలియజేయలేదని వినియోగదారులు తెలిపారు. అయితే.. ఈ సమస్య ప్రస్తుతం UKలో మాత్రమే కనిపిస్తుంది. చాలా మంది వ్యక్తులు సస్పెండ్(Suspend) చేసిన ఖాతాకు సంబంధించి స్క్రీన్షాట్లను(Screenshot) ట్విట్టర్లో పంచుకున్నారు. ఇన్స్టాగ్రామ్ నుండి వెలువడిని ఒక నోటీస్ కు సంబధించి స్క్రీన్‌షాట్ కనిపిస్తుంది.
All of us coming to twitter to confirm instagram is down #instagramdown pic.twitter.com/DT6BthlNDK
— cesar (@jebaiting) October 31, 2022
అందులో మీ ఖాతా 31 అక్టోబర్ 2022న తాత్కాలికంగా నిలిపివేయబడిందని రాయబడింది. ఈ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొన్ని నివేదికల ప్రకారం.. ఇది ఎక్కువ మందిని ప్రభావితం చేయలేదని తెలిసింది. చాలా మందితో మాట్లాడిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ని ఉపయోగించడంలో వారికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిసింది. ఇప్పటికే చాలా మంది తమ ఖాతాను వాడుతున్నారు.
Plis ini bukan masalah followersnya tapi kenangan semua ada di Instagram???????? #instagramdown pic.twitter.com/pTj5jSsYuc
— haruto’s girl (@imharutogirll) October 31, 2022
వాళ్లకు ఎలాంటి సమస్య లేదని చాలా మంది పేర్కొన్నారు. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌లో అకస్మాత్తుగా ఫాలోవర్లు తగ్గిపోయారని కొందరు అంటున్నారు. డౌన్ డిటెక్టర్‌లో కూడా ఈ ఇన్స్టాగ్రామ్ అంతరాయం కనుగొనబడింది. వారి సంఖ్య డౌన్ డిటెక్టర్‌లో 4,000 మాత్రమే చూపుతోంది.
My Instagram has just been suspended out of the blue along with lots of other people reporting the same on Twitter. Has @instagram been hacked??
Has this happened to anyone else?#instagramhacked pic.twitter.com/lzZWB1fP98 — Jenny Garbis (@jennygarbis) October 31, 2022
స్క్రీన్‌షాట్‌ను పంచుకుంటూ.. ఒక ఇండోనేషియా వినియోగదారు ఇలా రాశాడు.. మీ ఖాతా 31 అక్టోబర్ 2022న తాత్కాలికంగా నిలిపివేయబడిందని రాయబడింది. రాహుల్ రాజేష్ అనే వినియోగదారు ఒక మీమ్‌ను పంచుకున్నాడు. "నా ఇన్స్టాగ్రామ్ ఎందుకు సస్పెండ్ చేయబడిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను" అని రాశారు.
ఇలా నెటిజన్లు వివిధ రకాలుగా ట్విట్టర్ లో ట్వీట్ చేస్తున్నారు. అవి కొంత మందికి నవ్వు తెప్పిస్తుంటే.. మరి కొంత మందిన ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి.
ఇన్ స్టాగ్రామ్ హ్యాక్ అయితే ఇలా చేయండి..
మొదట ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసి, ఆండ్రాయిడ్‌లో అయితే లాగిన్ పేజీలో గెట్ హెల్ప్ లాగింగ్ ఇన్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఐఫోన్ లేదా వెబ్‌బ్రౌజర్‌లో అయితే ఫర్గాట్ పాస్వర్డ్? ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత వినియోగదారులు తప్పనిసరిగా యూజర్ నేమ్, ఇమెయిల్ అడ్రెస్, అకౌంట్‌కు లింక్ అయిన ఫోన్ నంబర్ ఎంటర్ చేసి నెక్ట్స్ బటన్‌పై క్లిక్ చేయాలి.
అకౌంట్‌కు సంబంధించి, ఫోన్, ఇమెయిల్, యూజర్‌నేమ్‌కు యాక్సెస్ లభించకపోతే, ఆ తర్వాత లాగిన్‌కి ఉపయోగించిన వివరాలను ఎంటర్ చేసి కాంట్ రీసెట్ పాస్వర్డ్? ఆప్షన్ సెలక్ట్ చేసుకొని, నెక్ట్స్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. తర్వాత వినియోగదారులు తప్పనిసరిగా వారి ఇమెయిల్ అడ్రస్ లేదా ఫోన్ నంబర్ సెలక్ట్ చేసుకుని, నెక్ట్స్ బటన్ క్లిక్ చేయాలి. అనంతరం వినియోగదారులు ఇమెయిల్ లేదా SMSలోని లాగిన్ లింక్ వస్తుంది. ఆ లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత ఆన్ స్క్రీన్‌పై కనిపించే సూచనలు ఫాలో అవ్వాలి. ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ రీసెట్ అవుతాయి.
హ్యాకింగ్ బారిన పడకుండా సోషల్ మీడియా అకౌంట్లకు టూ స్టెప్ వెరిఫికేషన్ ఆప్షన్లను వినియోగదారులు ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. పాస్‌వర్డ్‌లను వీలైనంత స్ట్రాంగ్‌గా పెట్టాలని సూచిస్తున్నారు. డేట్ ఆఫ్ బర్త్‌లు, కుటుంబ సభ్యుల పేర్లు, ఇష్టమైన ప్రాంతాలు, వస్తువల పేర్లు ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. ఇలాంటి పేర్లతో పాస్వర్డ్లు పెడితే హ్యాకర్లు సులువుగా గుర్తించే ప్రమాదం ఉందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g technology, Instagram, Technology